బడ్జెట్ 2021-22 హై లైట్స్

223
  • కేంద్ర బడ్జెట్ ను అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు..
  • రైతు చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రతిపక్షాల నినాదాలు..
  • నినాదాల మధ్యనే బడ్జెట్ ప్రవేశ పెడుతున్న నిర్మల సీతారామన్
  • లాక్ డౌన్ వల్ల అనేక సవాళ్ళను ఎదుర్కోవాల్సి వచ్చింది..
  • కనీవినీ ఎరుగని పరిస్థితుల్లో ఈ బడ్జెట్ ప్రవేశపెడుతునన్నాం..
  • కేంద్రం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ ప్యాకేజీలు లాక్ డౌన్ కష్టాలను కొంతవరకు తగ్గించాయి..
  • ఐదు ప్యాకేజీలు 5 బడ్జెట్ లతో సమానం
  • పీఎం ఆత్మ నిర్భర్ భారత్ స్వస్థ యోజనకు శ్రీకారం..
  • 64 వేల కోట్లతో పథకం..
  • 6 మూల స్తంభాల మీద బడ్జెట్ 21..
  • మొదటి స్తంభం ఆరోగ్యం
  • ఆస్ట్రేలియాలో టీమ్ ఇండియా గెలిచినట్లే భారత ఆర్థిక రంగం పుంజుకుంది..
  • పౌష్టికాహారం అందరికీ అందించేందుకు మిషన్ పోషన్ 2.0..
  • స్వచ్ఛభారత్, స్వస్థ భారత్ ఈ బడ్జెట్ ముఖ్య లక్షణాలు
  • అర్బన్ స్వచ్ఛ భారత్ మిషన్ 2.0కు లక్ష 41 వేల కోట్లు..
  • కరోనా వ్యాక్సిన్ కోసం 35 వేల కోట్లు.. అవసరమైతే మరిన్ని నిధులు
  • ఆత్మ నిర్భర్ భారత్ ఆదర్శం కొత్తది కాదు..
  • మనదేశ మూలాల్లో నే ఆత్మ నిర్భర్ భావం ఉంది..
  • ఆర్థిక మూలస్తంభాలు మౌలిక రంగం రెండోది..
  • 5 ట్రిలియన్ వృద్ధి సాధించాలంటే నిర్మాణ రంగం పుంజుకోవాలి..
  • త్వరలోనే మెగా ఇండస్ట్రియల్ టెక్స్టైల్ పార్క్..
  • మరిన్ని పరిశ్రమలను ఆకర్షించేందుకు ప్రభుత్వం మెగా స్కీం..
  • వ్యక్తిగత వాహనాల 20 ఏళ్లు, కమర్షియల్ వాహనాలకు పదిహేనేళ్ల పరిమితి..
  • కాలం తీరిన వాహనాలను తుక్కుగా మార్చేలా పథకం..
  • ప్రపంచ యుద్ధాల తర్వాత ఆర్థిక సామాజిక రంగాల్లో ప్రపంచం మారింది..
  • ఇప్పుడు కరోనా తర్వాత కూడా మనం మరో కొత్త ప్రపంచంలో ఉన్నాం..
  • ఎకానమీ పునరుజ్జీవానికి అవసరమైన చర్యలన్నీ ఈ బడ్జెట్లో ఉన్నాయి..
  • కరోనాపై యుద్ధం కొనసాగుతుంది
  • వ్యవసాయ ఆదాయం రెట్టింపు చేసేందుకు పథకాలు..
  • హెల్త్ కేర్ కు రెండు లక్షల కోట్లు.. జల్ జీవన్ మిషన్ కు 2.7 లక్షల కోట్లు..
  • రక్షిత మంచినీటి పథకానికి 87 వేల కోట్లు..
  • వాయు కాలుష్య నివారణకు 2217 కోట్లు..
  • గతేడాది కంటే ఈ బడ్జెట్లో ఆరోగ్యానికి 137 శాతం అధికంగా నిధులు..
  • కేపిటల్ వ్యయానికి 5.54 లక్షల కోట్లు..
  • దేశంలోని మరో నాలుగు ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబ్ లు..
  • రహదారుల విస్తరణ కోసం న్యూ ఎకనమిక్ కారిడార్లు..
  • మూడేళ్లలో ఏడు టెక్స్టైల్ పార్కులు.. ప్రతి జిల్లాలో సమగ్ర హెల్త్ ల్యాబ్స్..
  •  1100 కిలోమీటర్ల నేషనల్ హైవే కారిడార్ పూర్తి చేస్తాం..
  • మార్చి 22 కల్లా 8500  కిలోమీటర్ల దూరం అదనపు హైవేలు..
  • మెట్రో నిర్వహణ తగ్గించేందుకు రెండు కొత్త సర్వీసులు..
  • మెట్రో లైట్, మెట్రో న్యూ పేరుతో ప్రాజెక్టులు..
  • బెంగళూరులో మెట్రో విస్తరణకు 14700 కోట్లు..
  • చెన్నైలో మెట్రో విస్తరణకు 63 వేల కోట్లు..
  • భారత మాల కింద 13 వేల కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధి..
  • విద్యుత్ రంగానికి 3.05 లక్షల కోట్లు..
  • పీ పీ ఏ పద్ధతి ద్వారా 2,200 కోట్ల ఏడు కొత్త ప్రాజెక్టులు..
  • సోలార్ పవర్ రంగానికి మరో వెయ్యి కోట్లు..
  • జమ్మూకాశ్మీర్ లో గ్యాస్ పైప్ లైన్ ఏర్పాటు..
  • ఉజ్వల స్కీమ్ కింద మరో 9 కోట్ల మంది గ్యాస్ కనెక్షన్లు..
  • ఇన్సూరెన్స్ రంగంలో భారీగా ఎఫ్డిఐలు..
  • ఇన్సూరెన్స్ రంగంలో 74 శాతం వరకు ఎఫ్డిఐలకు అనుమతి..
  • ఏడాది రైల్వే లక్షా 10 వేల కోట్లు..
  • బ్యాంకింగ్ రంగంలో భారీ సంస్కరణలు..
  • బాడ్ బ్యాంక్ ఏర్పాటుకు నిర్ణయం..
  • ఎంపీఏలు, మొండిబకాయిలు బ్యాడ్ బ్యాంకులకు తరలింపు..
  • బ్యాంకు ఖాతాలను సజావుగా నిర్వహించేందుకు చర్యలు..
  • రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది..
  • వ్యవసాయ ఉత్పత్తుల్లో భారీగా పెరుగుదల..
  • జాతీయ అంప్రెంటీస్ చట్టానికి సవరణలు.
  • యువతకు అవకాశాలు పెంచేలా కొత్త సవరణలు.
  • జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా 15 వేల పాఠశాలలు ఆధునీకరణ.
  • నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ విధివిధానాలు ఖరారు దశలో ఉన్నాయి.
  • రానున్న ఐదేళ్లలో నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్‌కు రూ.50 వేల కోట్లు.
  • డిజిటల్ చెల్లింపుల ప్రోత్సాహానికి రూ.1,500 కోట్లు.
  • త్వరలో జాతీయ భాషా అనువాద కార్యక్రమం.
  • రూ.4 వేల కోట్లతో డీప్ ఓషన్ మిషన్.
  • త్వరలో జాతీయ నర్సింగ్, మిడ్‌వైఫరీ కమిషన్ బిల్లు.
  • జనాభా లెక్కల కోసం రూ.3,726 కోట్లు.
  • దేశ చరిత్రలో తొలిసారి డిజిటల్ విధానంలో జనగణన.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు అంచనా 9.5 శాతం.
  • 2021-22లో ద్రవ్యలోటును 6.8 శాతానికి పరిమితం చేయాలని లక్ష్యం.
  • ద్రవ్యలోటును ప్రభుత్వ అప్పుల ద్వారా భర్తీకి ప్రయత్నాలు.
  • ఈ 2 నెలల్లో ఇంకా రూ.80 వేల కోట్లు  అప్పులు చేయాల్సి ఉంది.
  • వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.12 లక్షల కోట్లు అప్పులు తేవాలని నిర్ణయం.
  • 2021-22 బడ్జెట్ అంచనా మొత్తం 34.83 లక్షల కోట్లు.
  • 2025-26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతం లోపు పరిమితం చేయాలని లక్ష్యం.
  • 15వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కేంద్రం ఆమోదం.
  • పన్నుల్లో రాష్ట్రాలకు 41 శాతం వాటా.
  • పీఎంఏవై పథకం మరో ఏడాది పొడిగింపు.
  • అందుబాటు ధరల గృహరుణాల రాయితీ పథకం మరో ఏడాది పొడిగింపు.
  • అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పొడిగింపు.
  • ఐటీ రిటర్న్ దాఖలకు మినహాయింపు.
  • 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఊరట.
  • పింఛను, వడ్డీ ఆదాయం ఆధారంగా ఐటీ మినహాయింపు.
  • డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లు
  • 2022లో ద్రవ్య లోటు అంచనా – జీడీపీలో 6.8 శాతం
  • 2022లో స్థూల మార్కెట్ రుణాల లక్ష్యం రూ. 12 లక్షల కోట్లు
  • ఆర్ అండ్ డీలో ఇన్నోవేషన్‌కు ప్రోత్సాహం
  • నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ
  • 15 వేల పాఠశాలలు శక్తివంతం
  • కొండ ప్రాంతాలలో ఏకలవ్య స్కూల్స్ కోసం రూ. 38 కోట్లు-రూ. 40 కోట్లు కేటాయింపు
  • ఎన్‌జీఓలతో భాగస్వామ్యం ద్వారా 100 సైనిక్ స్కూల్స్ ఏర్పాటు
  • లెహ్ లడఖ్‌లో యూనివర్సిటీ ఏర్పాటు
  • దేశవ్యాప్తంగా ఐదు వ్యవసాయ హబ్‌లు
  • వ్యవసాయ రుణాల లక్ష్యం 16.5 లక్షల కోట్లు.
  • 1000 మండీలను ఈనామ్‌తో అనుసంధానం.
  • తేయాకు తోటల కార్మికుల కోసం 1000కోట్లు
  • ప్రభుత్వ రంగ సంస్థల్లో భారీగా పెట్టుబడుల ఉపసంహరణ
  • ఎయిరిండియా, షిప్పింగ్‌ కార్పొరేషన్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌
  • ఐడీబీఐ, భారత్‌ ఎర్త్‌ మూవర్స్‌ పెట్టుబడులలో ఉపసంహరణకు గ్రీన్‌ సిగ్నల్‌
  • ఈ ఏడాదిలోనే ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ
  • 2021-22లో పవన్‌ హన్స్‌, ఎయిరిండియా ప్రైవేటీకరణ
  • 50లక్షల నుంచి 2కోట్ల పెట్టుబడి పరిమితి వరకూ చిన్న సంస్థలుగా గుర్తింపు.
  • కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ తప్పనిసరి.
  • 5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి తప్పనిసరి.
  • సొలార్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియాకి వెయ్యి కోట్లు
  • బ్యాంక్ ఖాతాదారులకు ఇన్సూరెన్స్ లక్ష నుంచి 5 లక్షలకు పెంపు