అచ్చన్నా.. ఇంకొకరు సర్పంచ్ కాకూడదా?

264

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1 (న్యూస్‌టైమ్): టీడీపీ రాష్ట్ర అధ్య‌క్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో స‌ర్పంచ్ అభ్య‌ర్థిని బెదిరించ‌డం ప‌ట్ల వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, పార్ల‌మెంట‌రీ పార్టీ నేత వి. విజ‌య‌సాయిరెడ్డి మండిప‌డ్డారు. ఏంటి అచ్చెన్నా… నిమ్మాడ అంటే చంద్రబాబు రాసిచ్చిన దివాణమా? మీరు డిక్టేట్ చేసిన వ్యక్తి తప్ప ఇంకొకరు సర్పంచ్‌గా నామినేషన్ వేయకూడదా? అందరికీ శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డట్టు లేదూ! అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఉద‌యం చేసిన ట్వీట్‌లో సహజం… గెలుపు అద్భుతం.. అద్భుతం అనేది ఒకే రోజులో జరగదు.. ప్రయత్నిస్తూనే ఉండాలి.. ఓటమి అంటే ఓడిపోవడం కాదు.. ప్రయత్నించకపోవడం! అంటూ విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.