కోడెల పుత్ర..అవినీతి రత్న- వైసీపీ నేతల ఫైర్

882

కోడెల శివరాం పవిత్రమైన షాధి ఖానా కు వెళ్లి చీపురు పట్టుకొన ఉడవడం ఎలా ఉంది అంటే, అప్పుడు మీరు చేసిన దరిద్రాన్ని మీరే కడుగుతున్నట్టు ఉంది. అసలు షాధి ఖానా అప్పుడు అలా అవటానికి కారణం ఎవరు? మిమ్మల్ని నమ్ముకొని మీ హయం లో పనులు చేసి జీవితాల్ని పోగొట్టుకున్న కాంట్రాక్టర్ల లో షాధిఖానా లో వర్క్ చేసిన కాంట్రాక్టర్ కూడా ఒకరు అని మీరు మరిచారా  అని సత్తెనపల్లి నియోజకవర్గ వైసీపీ నేతలు టీడీపీ యువనేత కోడెల శివరాంపై విరుచుకుపడ్డారు.

టీడీపీ ప్రభుత్వంలో మీ కక్కుర్తి కమీషన్ కోసం, షాధి ఖానాలో చేసిన పనులకు పావలా వంతు కూడా డబ్బులు ఇవ్వకుండా, మున్సిపాలిటీ ధనాన్ని సొంత లాభాలు వాడుకొని ఆ కాంట్రాక్టర్ ని, ఆ పని పూర్తి కాకుండా చేసింది మీరే కదా అని షేక్ నాగురుమీరాన్(వై యస్ ఆర్ సిపి,  ప్రెసిడెంట్.) చల్లంచర్ల సాంబశివరావు (మాజీ మునిసిపల్ ఫ్లోర్ లీడర్) అచ్యుత శివ ప్రసాద్ (వై యస్ ఆర్ సిపి యూత్ ప్రెసిడెంట్.) షేక్ నాగూర్ బాషా (వై యస్ ఆర్ సిపి మైనార్టీ ప్రెసిడెంట్.)షేక్ మహమ్మద్ యూనుస్ (వై యస్ ఆర్ సిపి పట్టణ అధికార ప్రతినిధి.)   విరుచుకుపడ్డారు.

అసలు మీ గురించి, సత్తెనపల్లి లో మీరు చేసిన సేవల్ని సత్తెనపల్లి ప్రజలు కలకాలం గుర్తు ఉంచుకుంటారు. సొంత తండ్రి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం మీరు సర్..సొంత తండ్రినే సరిగ్గా చూసుకోలేని మీరు ప్రజల గురించి మాట్లాడడం చాలా విచిత్రం. ధూళిపాళ్ల 18 ఎకరాల భూ ఆక్రమణ నుంచి, పారిశుధ్య కార్మికులు, టిఫిన్ బండ్ల దగ్గర మీరు వసూళ్ల సత్తెనపల్లి ప్రజలు మిమ్మల్ని ఎప్పటికి క్షమించరు. పాపం పేదల కోసం అని 5 రూపాయలకె భోజనం అని పబ్లిసిటీ ఇచ్చుకొని, ఆ భోజనాన్ని మీ ఫార్మా కంపెనీ క్యాంటీన్ లో 70 రూపాయలకు అమ్ముకొని, వాళ్ళ పొట్ట కొట్టారు.  అని  విరుచుకుపడ్డారు.
అధికారం అడ్డు పెట్టుకొని, ఎంతో మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పిస్తామని, లక్షలు-లక్షలు గుంజి వాళ్ళ జీవితాల్ని ఛిద్రం చేసావు. వావిలాల పేరు చెప్పుకొని , ఆ పార్క్ అభివృద్ధి అని చెప్పి మీరు చేసిన లూటీ, ఆయన్ను అవమానించిన విధానం.. నువ్ చేసిన బెదిరింపుల వలనే కదా, సత్తెనపల్లి-పిడుగురాళ్ల రోడ్ మధ్య ఉన్న బ్రిడ్జి ల పని , నడికుడి రైల్వే కాంట్రాక్ట్ ల పనులు ఆగింది.. దాదాపు నియోజకవర్గ పరిధిలో వర్క్ ల పేర్లతో ,బెదిరింపులు లతో300 కోట్లు కొల్లగొట్టిన విషయం అందరికి తెలిసిందే  అని ఎద్దేవా చేశారు. .

అప్పుడు మీ బాంబుల రాజకీయం మొదలు ఇప్పటి K- టాక్స్, కేబుల్ దందా,భూ ఆక్రమణ,ఇసుక వ్యాపారం,కంప్యూటర్ల దొంగతనం,తోపుడు బండ్ల వసూళ్లు,నాయకుల కిడ్నాప్ లు,
వ్యాపారస్తులకు బెదిరింపులు, గ్రామ బహిష్కరణలు, ఇలా చెప్పుకుంటూ పోతే వందల్లో,వేలల్లో ఉంటాయి..మీరు ఎన్ని నాటకాలు ఆడినా, సత్తెనపల్లి-నరసరావుపేట ప్రజలు నిన్ను దగ్గరికి కూడా రానివ్వరు అని స్పష్టం చేశారు.

కోడెల శివరాం అవినీతి చర్యల్లో నష్టపోయింది వైశ్యులే!

టీడీపీ అధికారంలో ఉండగా కోడెల శివరాం వల్ల ఎక్కువగా నష్టపోయింది ఆర్య వైశ్య సామాజికవర్గమేనని సత్తెనపల్లి ఆర్యవైశ్య నేత దివ్వెల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.అందుకే ఈరోజు కోడెల శివరాంపై ఆరోపణల్లో వైశ్యులే ముందుంటున్నారని చెప్పారు. శివరాం ఆగడాలు చెబితే పేజీలు సరిపోవన్నారు.

సత్తెనపల్లి ఏరియాలో మెడికల్ షాపులు వాళ్ళను వాళ్ళ సేఫ్ కంపెనీ చెందిన మందులు అమ్మాలిఅని అలా అమ్మని షాపులు వాళ్ళ దగ్గరకు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారిని పంపటం నిజం కాదా? ప్రస్తుత వావిలాల గారి కాంప్లెక్స్ను,గతంలో మీరు అధికారంలోకి ఉన్నపుడు మెడికల్ షాప్ వాళ్లకే కేటాయిస్తామని వాళ్ళ దగ్గర మీ కుటుంబ సభ్యులు డబ్బు తీసుకొన్నమాట వాస్తవం కాదా.?ఫుడ్ ఇన్స్పెక్టర్ లను సంబందిత షాపులకు పంపి కేసులు బనాయిస్తాము అని ,పార్టీ ఫండ్ వసూలు చెయ్యలేదా.? అని ప్రశ్నించారు.

నాడు సత్తెనపల్లి -నరసరావుపేట నియోజకవర్గములో ఎంత మంది ఆర్యవైశ్య సామాజిక  వర్గానికి చెందిన ప్రముఖులపై అక్రమ కేసులు బనాయించారో ప్రజలు అందరికీ తెలుసు.అపార్ట్మెంట్ నిర్మాణం చెప్పట్టిన బిల్డర్లు ఎంత ఇబ్బందులు పడ్డారో ,వారిలో ఎక్కువమంది ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన వారే ఉన్నారు.ఇంకా ఇలా తెలియజేస్తే ఒక పుస్తకంచాలదు.దీనిమీద ఏలాంటి బహిరంగ చర్చకు నేను సిద్దముగా ఉన్నాను. నిజంగా ఆంద్రప్రదేశ్లోగానీ, అటు తెలంగాణలో గానీ ఆర్యవైశ్య సామాజిక వర్గాన్ని వేధింపులకు గురి చేసిన రాజకీయ నాయకులు లేరు,అది ఏ రాజకీయ పార్టీలో లేరు  అని  దివ్వెల శ్రీనివాసరావు స్పష్టం చేశారు.