కేసీఆర్..ఇదేనా ఉద్యోగుల ఫ్రెండ్లీ సర్కార్?

391

 ఉద్యోగులకు వెంటనే 50% ఫిట్ మెంట్ ను ప్రకటించాలి.
  – మాజీ మంత్రి శ్రీధర్‌బాబు ఫైర్

PRC రిపోర్ట్ పై 31 నెలలుగా ప్రగల్భాలు పలికిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తోలి వేతన సవరణ కమిషన్ నివేదిక సిఫారసులతో ఉద్యోగుల ఆకాంక్షలను నీరుకారుస్తూ, మట్టిలో కలిపినట్లుగా 7.5% ఫిట్ మెంట్ సూచించడం ఘోర నిర్లక్ష్య నివేదికగా ఉద్యోగులను, ఉపాధ్యాయులను మోసం చేసే విధంగా ఉందని  మాజీ మంత్రి శ్రీధర్‌బాబు  విరుచుకుపడ్డారు.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులకు సంతోషంగా అక్కడి ప్రభుత్వం జులై 2019 నుండే 27% తాత్కాలిక భ్రుతి IR ఇస్తున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత కూడా తెలంగాణ ఉద్యోగులు జులై 2018 నుండి ఎదురుచూస్తున్న PRC ఫిట్ మెంట్ వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఉద్యోగులతో వెంటనే చర్చించి నివేదికలో PRC బిస్వాల్ కమిటి రిపోర్టు సిఫారసులను అంగీకరీంచకుండా ఉద్యోగ సమస్యలను పరిష్కరించి వారు కోరుతున్న విధంగా 50% ఫిట్ మెంట్ ను ఈ నెలలో వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు.

PRC నివేదిక లో పెరుగుతున్న నిత్యావసర సరుకులు, ధరలు ద్రవ్యోల్భణం తదితర శాస్త్రీయ అంశాల ఆధారంగా వేతన పెంపుదల ఉండేల కమిటి సిఫారసు చేయకుండా, తెలంగాణ తొలి PRC రిపోర్టులో HRA స్లాబులను గణనీయంగా తగ్గించడం మరియు ఉచితంగా ఉద్యోగ, ఉపాధ్యాయులకు అందించే EHS వైద్యసేవలకు 1% మూల వేతనం తగ్గింపును మరియు CPS ఉద్యోగుల విషయములో వారి వేతనం నుండి మినహాయింపును 10% నుండి 14% పెంచడం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న DA ను కూడా తగ్గించాలని సూచించడం PRC కాలపరిమితిని కూడా పెంచాలనడంతో PRC కమీషన్ ఘోరంగా విఫలమైంది,ఈ తెలంగాణ తొలి PRC కమిటీ  ఉద్యోగులు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.

ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం కొత్త జిల్లాలు కొత్త మండలాలు ఏర్పడటం తో ఉద్యోగులు కోరుతున్న విధంగా HRA స్లాబులను 20, 25, 30, 35 గా పెంచాలని మరియు EHS ఉద్యోగులకు వైద్య సేవలను ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రిలో ఉచితంగా అందించాలి. మరియు CPS ఉద్యోగులు కోరుతున్న విధంగా CPS విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పున:రుద్ధరించాలి. కేంద్ర ప్రభుత్వ DA ను ఎదావిధిగా అమలు చేయాలి. మరియు PRC నివేదిక కాలపరిమితిని యధావిధిగా కొనసాగించాలి. ఉద్యోగుల కనిష్ట వేతనం 27 వేలు ఉండే విధంగా మరియు పెన్షనర్ల కు 15 వేలు కనిష్ట పెన్షన్ గా ఉండేవిధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను.

పెన్షనర్లు, ఇతర ఉద్యోగులు కోరుతున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని త్రిసభ్య కమిటి పేరుతొ రాష్ట్ర ప్రభుత్వం కాలయాపన చేయకుండా ఉద్యోగులను ఆర్థికంగా నష్టపరచకుండా వెంటనే మెరుగైన 50% ఫిట్ మెంట్ ను ఉద్యోగులకు ప్రకటించాలని అన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులు కోరుకున్న విధంగా DA ల విషయంలో గాని, IR, PRC విషయంలో గాని, బదిలీలు పారదర్శకంగా వ్యవహరించామని తెలిపారు