టిఫిన్ చేస్తున్నారా?…ఒక్క నిమిషం ఆగండి!

852

మనకు టిఫిన్ అంటే ఇప్పటి వరకూ గుర్తుకు వచ్చేది ఇడ్లీ, దోసె, పూరీ, ఉప్మా మొదలగునవి. వీటిని తింటే ఏమవుతుందంటే, వీటిలో ప్రాణశక్తి లేని కారణంగా (జీవం) మనం పీల్చుకునే ప్రాణశక్తి వీటి జీర్ణానికి ముఖ్యంగా వెళ్లిపోతుంది. విసర్జన క్రియకు ఎక్కువగా వెళ్ళి శరీరాన్ని శుద్ధిచేసే కార్యక్రమాన్ని ఆపి, ఆ ప్రాణశక్తి అక్కడ నుండి ఇక్కడకు (జీర్ణక్రియ) వచ్చేస్తుంది. దానితో విసర్జన క్రియ కుంటుపడుతుంది. అందువల్లనే అలాంటి టిఫిన్లు తిని వెళ్ళిన పిల్లలు స్కూలులో మొదటి క్లాసులో కొందరు మత్తుగా ఉంటే, మరి కొందరు నిద్రపోతూ, తూలుతూ ఉంటారు. అలాగే ఆఫీసుకు వెళ్ళిన పెద్ద వారు కూడా కొద్దిగా మత్తుగా ఒక గంట, రెండు గంటలుంటారు. అదే మరి అసలు రహస్యం. అలాంటి టిఫిన్లను ఉప్పు, నూనె లేకుండా చేసుకొనే అవకాశం మనకున్నప్పటికీ వీటిని రోజూ తినకుండా ఏదేని సెలవు రోజో పండుగరోజో లేదా కోరిక పుట్టినప్పుడో తప్ప రోజూ తినకండి. అలవాటైన టిఫిన్ స్థానంలో మనం తినబోయే ఆరోగ్యకరమైన కొత్త టిఫిన్ మొలకెత్తిన విత్తనాలు అనగా పెసలు, శెనగలు, గోధుమలను, మొలకలు వచ్చే విధముగా తయారు చేసుకుని, వేరుశనగ గింజలను రాత్రి నీళ్ళలో నానబెట్టి ఉదయానికి వాటిని తీసి, మొత్తం ఈ నాలుగు రకాల గింజలను మీకు కావలసినన్ని, ఆకలి తీరినన్ని ఖర్జూరంతో కలుపుకొని తినవచ్చు. దీనికి తోడు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా ఎంతైనా తినవచ్చు. అయితే వీటిని బాగా నమలి తినాలి. ఆ మొక్కలు అంగుళం పొడుగు వరకూ వచ్చేలా చేసుకోవాలి. ఈ మొలకెత్తిన గింజలలో అధికంగా ఉన్న ప్రాణశక్తి, పోషక శక్తి ఇటు విసర్జన క్రియకు, అటు శారీరక శ్రమకు అనుకూలంగా ఉంటుంది. మొలకెత్తిన గింజలు తిన్న 45 నిమిషాల నుంచి విసర్జక ధర్మం మెల్లగా తగ్గిపోతుంది. పూర్తిగా ఆగిపోతుంది.