నిమ్మగడ్డ ఎన్నికల అధికారా లేక టిడిపి అధికార ప్రతినిధా

302

– ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి 

రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే ..  ఆయనలో ఎన్నికల అధికారి కంటే టి డి పి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నట్లు అర్థమవుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు.

వైఎస్ఆర్ జిల్లా పర్యటనలో నిమ్మగడ్డ రమేష్ కుమార్  చేసిన వ్యాఖ్యలుపై  శనివారం సాయంత్రం రాయచోటిలోని వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడారు. దివంగత మహానేత వైఎస్ఆర్ మరణించిన 12 ఏళ్ల తర్వాత ఆయన పేరును ప్రస్తావించడాన్ని చూస్తే ఆయనపై అభిమానం కంటే,  ఓ పార్టీకి మద్దతు పలికే రీతిలో ఉండడంతో పాటు మరోపార్టీని రెచ్చగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. రాజ్యాంగ పదవిలో ఉంటూ బాధ్యతగా వ్యవహరించాల్సిన వ్యక్తి ఇలా మాట్లాడడం సమంజసమా అని ప్రశించారు.

రాజకీయ పార్టీలకు చెందిన సుజనా చౌదరి మరికొందరితో ప్రయివేట్ హోటళ్లలో తిరుగుతూ రాజ్యాంగబద్ధమైన పదవులకు కళంకం తేవడమే కాకుండా ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ప్రభుత్వంపై అనునిత్యం నిందలు మోపడం ఎంతవరకు సమంజసమన్నారు. ఎన్నికల అధికారుల విధులను  మా పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు. కానీ ఆవిధులును ఎవరో ప్రయోజనాల కోసం, మరో పార్టీకి  లబ్ది చేకూర్చేలా చేసి,  ఆ వ్యవస్థను దిగజార్చేలా చేయడం దారుణమన్నారు.  రాజకీయాలకు అతీతంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలలో  ప్రజలు ఏకాభిప్రాయంతో ఎన్నికలను  జరుపుకుంటామన్న వాటిపై కూడా విమర్శలు చేయడం మంచిదికాదన్నారు. ప్రస్తుతం చేస్తున్న తప్పుడు పనులపై  భవిష్యత్తులో తప్పకుండా నిమ్మగడ్డ పశ్చాత్తాప పడతారన్నారు.

కేవలం పబ్లిసిటీ కోసం వైఎస్ఆర్ జిల్లా పర్యటన సందర్భంగా.. సి బి ఐ కేసు గురించి ప్రస్తావన తేవడం విచిత్రంగా ఉందన్నారు.ఆ కేసుపై ఏమి మాట్లాడుదలచుకున్నారో తెలియడం లేదన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పరిటాల రవి హత్యానంతరం రాయలసీమలో ఉన్న కక్షలు, కార్పణ్యాలును రూపుమాపేందుకు ముందుకు వచ్చినా , చంద్రబాబు నాయుడు ముందుకు రాలేదన్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఆరోజు ఫ్యాక్షన్ ఉంటేనే మాకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్న విధానంతోనే టి డి పి ముందుకు పోయిందన్నారు. ఇలాంటి సమయంలో రాయలసీమ గురించి హేళనగా మాట్లాడడం  ఇక్కడ ఏదో జరిగిపోతోందన్న వాదనను తీసుకురావడం సరికాదన్నారు.

ప్రజాస్వామ్య బద్దంగా ప్రజల మంచిని కోరుకునే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ అన్న విషయాన్ని గుర్తించాలన్నారు. చంద్రబాబు నాయుడు తన రాజకీయ జీవితంలో వ్యవస్థలును ఎలా వాడుకుంటున్నారో ప్రపంచానికంతటికి తెలుసునన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే 86 శాతం సీట్లతో గెలిచిన పార్టీ  వైయస్ఆర్ కాంగ్రెస్ అన్న విషయాన్ని గుర్తుచేశారు. 23 సీట్లు వచ్చాయన్న బాధను దిగమింగుకోలేక  చంద్రబాబు నాయుడుకు ఎలా మేలు చేయాలో అన్న ఆలోచనలతో నిమ్మగడ్డ పనిచేస్తున్నట్లున్నారని విమర్శించారు. ప్రతిరోజు విలేఖరుల సమావేశాలను పెట్టి మంత్రులుపైన , ఐ ఏ ఎస్, ఐ పి ఎస్ అధికారులపై చర్యలు తీసుకున్నామంటూ నిమ్మగడ్డ ప్రచారం చేయడం తగదన్నారు.

ఎవరి ప్రయోజనాల కోసం నిమ్మగడ్డ యాప్ పెట్టారు

ప్రభుత్వానికి సంబంధం లేకుండా, సొంతంగా అంటే, టిడిపి వారితో కలిసి ఒక యాప్ ను పెట్టి ఫిర్యాదులు చేయాలని ప్రచారం చేయడం నిమ్మగడ్డ దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. షాడో టీములంటూ.. రహస్యంగా ఎవరితో టీములు ఏర్పాటు చేస్తున్నారో బహిరంగం చేయాలని నిలదీశారు.  టి డి పి హయాంలో జరిగిన దౌర్జన్యాలు, హత్యలు, దాడులు , ఫ్యాక్షన్ రాజకీయాలును ఒకసారి నెమరు వేసుకోవాలన్నారు.

అభివృద్దే ధ్యేయంగా ముందుకుపోతున్న ఈ ప్రభుత్వంపై నిందలు వేయడం మంచిపద్దతి కాదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేసే అర్హత మీకెవ్వరికీ లేదన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే పాలనలో ఎక్కడైనా అవినీతి జరిగినా , అధికారులు తప్పులు చేసినా నిలదీయాలే కానీ వ్యవస్థలను పనిచేయనీయకుండా , అడ్డుకునేలా నిమ్మగడ్డ ద్వారా చంద్రబాబు రాజకీయాలును చేయాలనుకోవడం సిగ్గుచేటన్నారు. మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారికి, మా పార్టీకి రాజ్యాంగంపైన, వ్యవస్థలు పైన పూర్తిస్థాయి నమ్మకం ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. తామెప్పుడూ వ్యవస్థలును అతిక్రమించకుండా వాటిని సరైన మార్గంలోనే  నడిపించేలా పాలనను సాగిస్తూ,  ప్రజల సంక్షేమానికి  కృషి చేస్తామన్నారు.

పార్టీలకు అతీతంగా జరుగుతున్న ఎన్నికలలో మేనిఫెస్టోను విడుదల చేయడం చంద్రబాబు అవివేకానికి నిదర్శనమన్నారు.ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రసంగాలు, హుంకరింపులను చూసి భయపడే పరిస్థితులలో మేం లేమన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ఢిల్లీ తోనే తొడగొట్టి పోరాడిన  నాయకుని దగ్గర పనిచేస్తున్నామన్న విషయాన్ని తెలుసుకోవాలన్నారు. మీరు చెపుతున్న మాటలు, చేష్టలును చూస్తుంటే.. సినిమాలలో కమెడీయన్ బ్రహ్మానందం ను మించిపోతున్నారన్న ప్రచారం జరుగుతోందని శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.