ఏపీ ముఖ్య కార్యదర్శిని విధుల నుంచి తప్పించండి

222

సీఎస్‌కు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ లేఖ

అమరావతి: ఎన్నికల విధుల నుంచి ఏపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ని తప్పించాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో సమీక్షించకుండా ఆదేశాలివ్వాలన్నారు. సకాలంలో చర్యలు తీసుకోవడంలో ప్రవీణ్‌ విఫలమయ్యారని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 23న కలెక్టర్లు, ఎస్పీలతో జరగాల్సిన వీడియో కాన్ఫరెన్స్‌ జరపకుండా చేశారని, జీఏడీకి అధిపతిగా ఉన్న ప్రవీణ్‌ తన ఆదేశాలను పట్టించుకోలేదని లేఖలో పేర్కొన్నారు. అధికారులను సన్నద్ధం చేయడంలో విఫలమయ్యారని, అందుకే ఎన్నికల షెడ్యూల్‌ను వాయిదా వేయాల్సి వచ్చిందని ఎస్‌ఈసీ తెలిపారు. ఈ నెల 25న నామినేషన్ల స్వీకరణకు సహకరించలేదని అన్నారు..