రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా కన్నబాబు నియామకం.

709

అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కార్యదర్శిగా కన్నబాబును నియామించారు. కన్నబాబును నియమిస్తూ సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్ ఎండీగా కన్నబాబు ఉన్నారు. అయితే రవిచంద్రను నియమించాలని కోరినా… ఇవ్వకుండా విజయ్ కుమార్, కన్నబాబు, రాజబాబుల పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించడంతో వారిలో కన్నబాబును ఎస్ఈసీ ఫైనల్ చేసినట్లు తెలియవచ్చింది. గతంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి వాణిమోహన్‌ను ఆ బాధ్యతలనుంచి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ తొలగించారు. ఆమెను ప్రభుత్వాని కి సరెండర్‌ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌కు లేఖ రాశారు. అంతకుముందు ఎన్నికల సంఘం చేపట్టిన కార్యక్రమాలకు పథకం ప్రకారం విఘాతం కలిగించారనే అభియోగాలతో ఎస్‌ఈసీ జాయింట్‌ డైరెక్టర్‌ సాయిప్రసాద్‌ను ఏకంగా విధుల నుంచే తొలగించిన సంగతి తెలిసిందే.