మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి అరెస్ట్ పై మండిపడ్డ చంద్రబాబు

178

పొద్దుటూరులో వైసిపి దమనకాండపై చంద్రబాబు ధ్వజం
తప్పుడు కేసులు వెంటనే ఎత్తేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేసిన చంద్రబాబు

పొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, కడప పార్లమెంటు టిడిపి అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి అరెస్ట్ పై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.

వ్యాపారులు వద్దని బతిమాలినా వినకుండా కూరగాయల మార్కెట్ కూల్చివేత వైసిపి మరో తుగ్లక్ చర్య. ముస్లింలు, బిసి, ఎస్సీ, ఎస్టీలు నడుపుకునే షాపులను కూల్చడాన్ని ఖండిస్తున్నాం. నిర్మించడం చేతగాని వైసిపికి కూల్చేసే హక్కు ఎక్కడిది..? ప్రజావేదికతో ప్రారంభమైన వైసిపి విధ్వంస కాండ ప్రతి నియోజకవర్గంలోనూ చేస్తున్నారు.

చిరువ్యాపారుల పొట్టకొట్టే చర్యలకు వైసిపి స్వస్తి చెప్పాలి. కమిషన్ల కక్కుర్తితో వ్యాపారులను వేధించడం దారుణం. పొద్దుటూరు మార్కెట్ కూల్చివేత ప్రక్రియను తక్షణమే నిలిపేయాలి. అరెస్ట్ చేసిన లింగారెడ్డి సహా టిడిపి మరియు ఇతర ప్రతిపక్షాల నాయకులపై పెట్టిన తప్పుడు కేసులను వెంటనే ఎత్తేయాలని’’ చంద్రబాబు డిమాండ్ చేశారు.