ఎమ్మెల్యే రోజాను కలిసిన నటుడు అర్జున్‌

609

ఎమ్మెల్యే రోజాతో నటుడు అర్జున్, ఆయన కుటుంబ సభ్యులు

నగరి : సినీ నటుడు అర్జున్‌ కుటుంబ సమేతంగా ఏపీఐఐసీ చైర్‌పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఆమె నివాసంలో కలిశారు. అర్జున్‌ గురువారం సాయంత్రం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళుతూ నగరిలో స్నేహితురాలు రోజాను, ఆమె భర్త సెల్వమణిని కలిసేందుకు వారి ఇంటికి వెళ్లారు. కాసేపు వారు పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అర్జున్‌ వెంట ఆయన భార్య నటి నివేదిత, కుమార్తెలు నటి ఐశ్వర్య, అంజనా ఉన్నారు. తిరుమలకు వెళుతూ స్నేహితురాలిని కలవడం తనకు చాలా సంతోషాన్ని ఇచ్చిందని అర్జున్‌ తెలిపారు.