పాలభిషేకాల సీఎం.. మళ్ళి ఒక కొత్త డ్రామా !

0
109

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్
కేవలం తనకు అనుకూలంగా ఉండే ఉద్యోగ సంఘాలనే సీఎస్ నేతృత్వం లోని త్రిసభ్యకమిటీ బిస్వాల్ రిపోర్ట్ పై అభిప్రాయ సేకరణకు పిలుస్తున్నారు. తన అనుకూల సంఘాల తో చర్చించి, వాళ్లతో పాలాభిషేకం చేయించు కోవాలని అనుకుంటున్నాడు సీఎం కేసీఆర్. ఇప్పటికే దుబ్బాక లో, గ్రేటర్ హైదరాబాద్ లో ఓటర్లు చేసిన అభిషేకం సరిపోయినట్లు లేదు.  అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్ షన్ దారుల సంఘాలను చర్చకు పిలవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు  బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు.

రాష్ట్రం లోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షన్ దారులను నట్టేట ముంచినట్టు బిస్వాల్ కమిటీ రిపోర్ట్  ఉందని లక్షలాది మంది కడుపు మంటతో రగిలి పోతుంటే సీఎం ఎక్కడ పడుకున్నాడు. ఇప్పటిదాకా ఎందుకు స్పందించడం లేదు. 7.5% ఫిట్ మెంట్ ను ముందు పెట్టి పెండింగ్ లో ఉన్న ఎన్నో ఉద్యోగ సమస్యలు తెర పైకి రాకుండా కేసీఆర్ కుట్ర చేశాడు. ఆయన ప్లాన్ ప్రకారమే  ఇప్పుడు త్రిసభ్య కమిటీ చర్చ అంతా ఫిట్ వైపు డైవర్ట్ అయింది. 2014 లో ఉద్యోగులకు కేసీఆర్ ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేరలేదు  అన్నారు.

ఉద్యోగులకు కల్పించాల్సిన EHS అమలు కావడం లేదు, ఎక్కడా క్యాష్-లెస్ ట్రీట్ మెంట్ లేదు. కరోన బాధిత ఉద్యోగులకు ఒక లక్ష సాయం చేస్తామని చేతులు దులుపుకొన్నారు. కరోన బారిన పడ్డ ఉద్యోగులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసుకుని అప్పుల పాలయ్యారు.

NGO లకు LTC లేకుండా పోయింది. భార్య భర్తల ట్రాన్స్ ఫర్ లు ఇంకేప్పుడు. త్రిసభ్య కమిటీ ముందు ఈ అంశాలన్నీ చర్చకు రావాల్సిందే.ప్రభుత్వం తమపట్ల అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగులంతా రగిలిపోతుంటే సీఎం కేసీఆర్ కు పెనుకుట్టినట్లు కూడా లేదు.

పైగా ప్రభుత్వ వైఖరి పై గొంతెత్తే వాళ్ళను కేసుల పేరుతో బెదిరిస్తున్నారు. ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంది. వాళ్ళను వేధిస్తే ఊరుకునేది లేదు. ఉద్యోగ బంధువు లారా మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీకు జరిగిన అన్యాయాన్ని పంటి బిగువున భారించాల్సిన అవసరం లేదు. మీకు బీజేపీ అండగా ఉంది  అని సంజయ్ హామీ ఇచ్చారు.

 ఫాం హౌజ్ ల కూసోని prc రాయించినవా కేసీఆర్.. ?

ఉద్యోగులకు ఫిట్ మెంట్ పేరుతో కేసీఆర్ కొత్త డ్రామా కు తెరలేపాడు. ఇప్పుడిస్తా.. అప్పుడిస్తా అని వూరించి వూరించి మూడేండ్ల తర్వాత ఇప్పుడు బిశ్వల్ కమిటీ రిపోర్ట్ తో వుసూరు అనిపించిండు.. అందరినీ మోసం చేసే.. ఉద్యోగాలు ఇస్తా అని పిలగాండ్లను, నిరుద్యోగ భృతి ఇస్త అని నిరుద్యోగులను, సన్న వడ్లు అని రైతులను.. ఇప్పుడు ఉద్యోగులను కూడా మోసం చేసిండు.. 7.5 శాతం పది శాతం ఫిట్ మెంట్ ఇయ్యనీకే ఒక కమిటీ వేయల్నా.. మూడేండ్లు టైమ్ తీసుకోవాల్నా..
అసలు బిష్వాల్ కమిటీ పని చేసిందా.. స్వతంత్రంగా పని చేయనిచ్చారా.. అని సంజయ్ సీఎం కేసీఆర్‌ను నిలదీశారు.

ఉద్యోగులను నమ్మియ్యనీకే బిశ్వల్ కమిటీ వేసి .. ఆ కమిటీ ఏం రాయాలే.. ఎంత రాయాలే.. ఒత్తిడి పెంచి ఆ రిపోర్ట్ రాపించ్చారు. ఫిట్ మెంట్ 7.5 శాతం ఇచ్చి HRA 6 శాతం తగ్గించటం దారుణం.. మోసం.. ఇచ్చినట్లే ఇచ్చి గుంజుకున్నవ్.. ఉద్యోగుల ను మోసం చేసినవ్.. 7.5 prc ఇచ్చి cps 10 శాతం తగ్గిస్తారు.. 30 శాతం ఉన్న cps ఉద్యోగికి ఈ prc ద్వారా జీతం పెరగదు.. పైనంగ 2.5 శాతం జీతం తగ్గుతది అన్నారు.

31 నెలల నుంచి ఉద్యోగులు ఎదురుచూస్తుంటే వాళ్లకు ఇచ్చేది ఇదా.. ఉద్యోగులు డిమాండ్ చేసినట్లు 43 శాతం ఫిట్ మెంట్ ఇయ్యాలి.. వున్న ఉద్యోగులు మన జనాభా కు సరిపోయినట్లు వున్నారా.. జనాభా ప్రాతిపదికన లేరు.. ఉద్యోగులపై పని భారం పెరిగింది.. ఇంకా కమిటీలు.. రిపోర్ట్ లు అని కాలయాపన చేయకుండా ఖాళీలు భర్తీ చేయాలి ఇంత దారుణమైన, అతి తక్కువ ఫిట్మెంట్ ను సమైక్య పాలకులు కూడా ఇవ్వలేదు.  సమైక్య పాలకులు  25 % కంటె తక్కువ ఫిట్ మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు. PRC వేసిన వెంటనే IR ఇవ్వడం సంప్రదాయం. కానీ ఈ సర్కార్ IR కూడా ఇవ్వలేదు.  ఇంటి కిరాయిలు విపరీతంగా పెరుగుతుంటే HRA తగ్గించాలని అనుకోవడం మూర్ఖత్వం. అని   సంజయ్ సీఎంపై విరుచుకుపడ్డారు.