టిడిపి నాయకులతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్

494

పాల్గొన్న తొలిదశ పంచాయితీ ఎన్నికల ప్రాంతాల టిడిపి నేతలు

తొలివిడత పంచాయితీ ఎన్నికల ప్రాంతాల టిడిపి నాయకులతో తెలుగుదేశం పార్టీ అధినేత గురువారం సాయంత్రం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ పంచాయితీ ఎన్నికల సందర్భంగా టిడిపి అభివృద్ది ప్రణాళికను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ‘‘పల్లె ప్రగతి-పంచసూత్రాలు, పల్లెలు మళ్లీ వెలగాలి’’ కరపత్రాలను ఇంటింటికి పంపిణి చేయాలి. టిడిపి 5ఏళ్లలో గ్రామాల్లో చేసిన అభివృద్దిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి.

చరిత్రలో లేనంత అభివృద్ది రాష్ట్రంలో కేవలం 5ఏళ్లలోనే చేశాం. వేలాది కిమీ సిమెంట్ రోడ్లు నిర్మించాం. వేలాది అంగన్ వాడి భవనాలు, పంచాయితీ భవనాలు నిర్మించాం. సాగునీరు, తాగునీరు, విద్యుత్ కొరత లేకుండా చేశాం. పూర్తి ఇన్ ఫ్రాస్ట్రక్చర్ తో, పచ్చదనంతో అందమైన పల్లెలుగా మన గ్రామాలను చేశాం. ఇప్పుడంతా నాశనం చేశారు.గెలిస్తే మీ ఊరికి మీరేం చేస్తారో అభ్యర్ధులే వివరించాలి. ప్రజలను మెప్పించాలి, ప్రజాదరణ పొందాలి.

వైసిపి బలవంతపు ఏకగ్రీవాలను, హింసా విధ్వంసాలపై జనం విసిగిపోయారు. వైసిపి విధ్వంస కాండతో రాష్ట్రానికి ఎనలేని చెడ్డపేరు. అన్నివర్గాల ప్రజల్లో వైసిపిపై తీవ్ర అసంతృప్తి..ఉన్మాద చర్యలు, కోర్టుల చివాట్లు, విధ్వంసాలతో జనం విసిగిపోయారు.

ఇళ్లస్థలాల్లో భూసేకరణకు మీ ఊళ్లలో ఎంత స్కామ్ చేశారో జనం కళ్లముందే ఉంది. గ్రామాల్లో పట్టా భూములు, ఎండోమెంట్ భూములు 6రకాల ప్రభుత్వ భూములు కాపాడాలంటే, ల్యాండ్ మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటే వైసిపిని ఓడించాలి.పేదల స్కీముల్లోనూ స్కామ్ లు చేసిన వైసిపికి బుద్ది చెప్పాలి. టిడిపి తెచ్చిన సంక్షేమ పథకాలు రద్దుచేసినందుకు గుణపాఠం చెప్పాలి.

ఎక్కడ ఎటువంటి ఘర్షణలకు పాల్పడినా, ఆటంకాలు సృష్టించినా రాజధాని అమరావతిలో టిడిపి కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలి. 24గంటలు (రౌండ్ ద క్లాక్) పనిచేసే కంట్రోల్ రూమ్ ను ఇప్పటికే ఏర్పాటు చేశాం. కంట్రోల్ రూమ్ లో కాల్ సెంటర్ నెంబర్ 7306299999 కు వెంటనే తెలియజేయాలి. ఫోటో, వీడియో సాక్ష్యాధారాలను వాట్సప్ నెంబర్ 7557557744కు పంపాలి. సలహాలు సూచనలు ఇచ్చేందుకు టిడిపి లీగల్ సెల్ న్యాయవాదులు అందుబాటులో ఉంటారు. అన్ని స్థానాల్లో నామినేషన్లు వేయాలి. ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టాలి. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడేవాళ్లకు బుద్ది చెప్పాలని’’ చంద్రబాబు పేర్కొన్నారు.