ఢిల్లీ రైతు ఉద్యమం ఖర్చెంత? ఇస్తుందెవరు?

0
229

 (మార్తి సుబ్రహ్మణ్యం)

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటపై జెండా ఎగురవేసిన రైతుల తెగింపు వెనుక ఉన్న శక్తులెవరు? అసలు కొద్ది నెలల నుంచీ విజయవంతంగా జరుగుతున్న ఈ ఉద్యమానికి, ఖర్చులు భరిస్తున్న శక్తులెవరన్న ప్రశ్నను సమాజం విస్మరిస్తోంది. సాధారణంగా ఎవరైనా ఒక చిన్న కార్యక్రమం తలపెట్టాలంటే, దానికేయ్య ఖర్చు వేలల్లోనే ఉంటుంది. అదే వందలు.. వేల మంది పాల్గొనే కార్యక్రమాలకు లక్షలు-కోట్లలో ఖర్చవుతుంది. షామియానాల నుంచి వాహనాల అద్దె, వచ్చిన వారికి భోజనాల ఖర్చు తడిసి మోపెడవుతుంది. మరి ఢిల్లీలో రోజుల తరబడి ధర్నాలు చేస్తున్న రైతులకు ఈ ఖర్చులు ఎవరు భరిస్తున్నారు? రైతులపై అంత ప్రేమ ఒలకబోస్తున్న వదాన్యులెవరు? రైతాంగంపై అంత ప్రేమానురాగాలు కురిస్తున్న ఆ మహానుభావులెవరన్నది ప్రశ్న.

అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ,  ఏడాదికి పైగా జరుగుతున్న ఉద్యమ ఖర్చులను భూములిచ్చిన  రైతులే  భరిస్తున్నారు. ఒక సమాచారం ప్రకారం.. ఎకరానికి 5 వేల రూపాయలు రైతులు విరాళంగా ఇస్తున్నారట. దానితో లాయర్ల ఖర్చులతోపాటు, రోజువారీ ఆందోళన ఖర్చులు భరిస్తున్నట్లు సమాచారం. అసలు లాయర్ల ఫీజులకే తడిసి మోపెడవుతోందట. మరి.. ఒక్క కొన్ని గ్రామాల సమస్యలకే అంత ఖర్చవుతే, ఏకంగా ఒక రాష్ట్రం నుంచి తరలివచ్చిన రైతులకయ్యే ఖర్చెంత? ఇదీ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ.

గణతంత్ర దినోత్సవం రోజున రైతుల ముసుగులో జరిపిన దుశ్చర్యలు పరిశీలిస్తే, ఇది రోజువారీ వ్యవసాయం చేసుకునే రైతుల పని కాదన్నది.. మెడపై తల ఉన్న ఎవరికయినా తడుతుంది. అదేదో సుశిక్షుతులయిన కార్యకర్తల పనే అన్నది,  వీడియోలు చూసిన ఎవరికయినా అనిపించక మానదు. గణతంత్ర దినోత్సవం రోజున, ఢిల్లీ నగర నడిబొడ్డున జరిగిన ఈ ఆక్రమణ వ్యవహారం ఖిచ్చితంగా నిఘా వైఫల్యమే. ట్రాక్టర్లతో బస్సులను అడ్డుతొలగించి, ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ఆ దృశ్యాలు పరిశీలిస్తే, ఇది స్వదేశీ శక్తుల పనా? లేక విదేశీ శక్తులు పనా అన్న అనుమానం బుద్ధి-బుర్రా ఉన్న ఎవరికయినా రాక తప్పదు.

అసలు రోజుల తరబడి, రైతుల పేరుతో ఢిల్లీ సరిహద్దుల్లో జరుగుతున్న ఈ ‘ప్రాయోజిక’ కార్యక్రమానికి,  కర్త-కర్మ-క్రియ ఎవరు? వారికి ఆర్ధిక సాయం చేస్తున్న ఆ అదృశ్య శక్తులెవరన్న సందేహం, చర్చ సోషల్‌మీడియాలో మొదలయింది. అది ఎలాగంటే.. లక్ష ట్రాక్టర్ల ఊరేగింపు. 400 కి.మీ.దూరం. ప్రతి 10 కి.మీలకు ఒక లీటరు డీజల్ వినియోగం.  ఒక లీటరు డీజల్ ధర 84 రుపాయలు. ఒక్కోక్క ట్రాక్టరుకు 40 లీటర్ల వినియోగం. లక్షట్రాక్టర్లకు 40లక్షల లీటర్ల డీజల్ అవసరం. డీజల్ పై ఖర్చు 84×4,000,000 =   33,60,00,000 = ముప్పై మూడు కోట్ల అరవై లక్షలు.

ఒక్కోట్రాక్టరుకు రోజుకు బాడుగ Rs 1500/-.  లక్ష ట్రాక్టర్లలో రైతుల స్వంతంగా కలవి = 50 వేలు.  50 వేల ట్రాక్టర్లకు బాడుగ 50000 x 1500 = 7,50,00,000 = 7 కోట్ల 50 లక్షలు.

ఒక్కో ట్రాక్టర్ డ్రైవరు బత్తారోజుకు 800. 50 వేలమంది డ్రైవర్లకు బత్తా 50,000 x 800 = 40,00,000 =  40 లక్షలు.  ఒక్కో ట్రాక్టరులో 5మంది వస్తే, మొత్తం లక్ష ట్రాక్టర్లుకు కలిపి = 5,00,000 = ఐదు లక్ష మంది. ఒక్కొక్కరికి ఉదయం టిఫిన్ ఖర్చు = 50 రూపాయలు. ఐదు లక్షలమందికి 5,00,000 x 50 = 2,50,00,000 = రెండు కోట్లా యాభైలక్షలు.  మధ్యాహ్న భొజనం ఒక్కొక్కరికి Rs 75.

5 లక్షల మందికి 5,00,000 x 75 = 3,750,0,000 = మూడుకోట్ల డెబ్బై ఐదు లక్షలు. బ్యానర్లు, మైకులు ఒక్కో ట్రాక్టరుకు Rs 500.  50 వేల ట్రాక్టర్లకు 50,000 x 500 =  2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు. కాఫీ, టీలు, స్నాక్స్ వగైరాలు, 2,50,000 మందికి ( వచ్చేవారి సంఖ్య మొత్తం = 5 లక్షలు) ఒక్కొక్కరికి 25 రుపాయలు = 2,50,000 = 25 =62,50,000 = అరవై రెండు లక్షలా యాభైవేలు
సభాసమావేశము కొరకు = రెండుకోట్లు. హజరయ్యే రాజకీయనాయకులు చిన్నా పెద్దాకలిసి = 5 వేలు.

వారి వాహనాలు, గన్ మెన్లు, డ్రైవర్లు, అటెండరులు,  డీజల్, భోజనాలు వగైరాలు కలిపి ఒక్కోనాయకుడి ఖర్చు Rs 5,000. 5 వేల మందికి 5,000 x 5000 = 2,50,00,000 = రెండుకోట్ల యాభైలక్షలు.
ఒకరోజు ర్యాలి మొత్తం వ్యయం = 46 కోట్లా,82 లక్షల, 75 వేల రుపాయలు ఈ ఖర్చంతా ఎవరు భరిస్తున్నారు.స్వదేశీ రైతులా? విదేశీశక్తులా ? దేశాన్ని అస్తిరపరిచేటందుకు పూనుకొన్న చైనా, పాక్, దేశాలే కదా! ఇవికాక ప్రభుత్వం ఏర్పాటు చేసే బందోబస్తు వ్యయం ఉండనేవుంది. ప్రజలు ఈ  ఖర్చును పన్నుల రూపంలో చెల్లించాలి కదా!

మరి ఇన్ని లక్షలు, కోట్ల రూపాయలు భరించి ఉద్యమం చేయిస్తుంది స్వదేశీ శక్తులా? విదేశీ శక్తులా? వారికి రోజూ భోజన సౌకర్యాలు సమకూరుస్తుందెవరు? రైతులంటే పేదల కిందే లెక్క. మరి పేదల వద్ద అంత డబ్బు ఉంటుందా? భూమిని నమ్ముకుని బతికే రైతులకు,  ‘రాజ్యం’పై తిరగబడేంత తెగువ ఎక్కడి నుంచి వచ్చింది?.. గణతంత్ర దినోత్సం నాటి ఘటనతో దేశ ప్రజల్లో మొదలయిన అనుమానాలివి.