మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా టీజర్ అనౌన్సమెంట్ ఇచ్చేశారు దర్శకుడు కొరటాల శివ. జనవరి 29 న సాయంత్రం 4:05 నిమిషాలకు ధర్మస్థలి డోర్ ఓపెన్ కాబోతుందంటూ కొరటాల ట్విట్టర్ ద్వారా ఓ వీడియోతో షేర్ చేశారు. ఇంతవరకు పోస్టర్ తప్ప, వేరే ఏ అప్డేట్ ‘ఆచార్య’ నుంచి లేకపోవడంతో ఈ టీజర్ గురించి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాజల్ ఈ చిత్రంలో చిరంజీవికి జోడీగా నటిస్తోంది. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.