‘సలార్’లో శృతి !

202

ఇటీవలే ‘క్రాక్’ సినిమాతో హిట్ కొట్టిన శృతి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా వేసవిలో విడుదలకు ఏర్పాట్లు చేసుకుంటుంది. ఇదిలావుంటే, శృతి హాసన్  మరో పెద్ద ప్రాజెక్ట్ లో నటించే అవకాశం వచ్చిందనే వార్తలు కోలీవుడ్, టాలీవుడ్ లోను హల్చల్ చేస్తున్నాయి. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ మూవీ ‘సలార్’ లో నటించే అవకాశం ఈ అమ్మడును వరించిందట. ఇప్పటికే ‘సలార్’ పరిశీలనలో ఉన్న  హీరోయిన్ దిశా పటానితో పాటుగా శృతి హాసన్ కూడా ఈ సినిమాలో నటించనుందట. కాగా, శృతి హాసన్ ప్రధాన హీరోయిన్ గా నటించనుందని టాక్. శృతికి అన్ని భాషల్లో గుర్తింపు పొందిన నాయిక కావడం, రెమ్యూనరేషన్ లో కూడా పెద్దగా ఇబ్బందులు లేకపోవడం ‘సలార్’ కు కలిసొచ్చే అంశంగా పరిశీలిస్తున్నారట.  ఇటీవలే పూజా కార్యక్రమాలు చేసుకున్న ఈ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.