‘స‌ర్కారు వారి పాట’ ప్రారంభం

513

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా టాలెంటెడ్ డైరెక్డ‌ర్ పరశురామ్ దర్శకత్వంలో తెర‌కెక్కుతోన్న భారీ చిత్రం ‘సర్కారు వారి పాట`. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్ బి ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ సంస్థలు సంయుక్తంగా ఈ ప్రెస్టీజియస్ మూవీనునిర్మిస్తున్నాయి. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేష‌న్ త‌మ‌న్ ఎస్.ఎస్. సంగీత సార‌థ్యం వ‌హిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. ఈ విష‌యాన్ని అధికారికంగా తెలియ‌జేస్తూ `ది ఆక్ష‌న్ అండ్ ది యాక్ష‌న్ బిగిన్స్` అంటూ ఒక వీడియో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌.

ఈ సంద‌ర్భంగా.. చిత్ర ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ పెట్ల మాట్లాడుతూ – `సర్కారు వారి పాట` మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభ‌మైంది. సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు గారిని డైరెక్ట్‌ చేయాల‌న్న ఇన్నేళ్ళ నా క‌ల ఈ రోజు నిజ‌మైంది. మహేష్ బాబు గారితో వర్క్ చేయడం చాలా ఎగ్జైటింగ్ గా ఉంది.  ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకుల, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇర‌వై రోజుల పాటు దుబాయ్‌లో ఫ‌స్ట్ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంది. ఇత‌ర న‌టీన‌టులు సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాం` అన్నారు.