“ఆర్‌ఆర్‌ఆర్‌” అప్టేట్‌

0
115

మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌, యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోలుగా దర్శక ధీరడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం `ఆర్‌ఆర్‌ఆర్‌`. ఇక సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇప్పటికే 80 శాతం పైగా షూటింగ్ జరుపుకున్నది. ఇప్పటికే సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే.. ఇవాళ ఈ సినిమా నుంచి లేటేస్ట్‌ అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమాను 2021 అక్టోబర్‌ 13న రిలీజ్‌ చేయనున్నట్లు ఈ సినిమా యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో గుర్రంపై రామ్‌చరణ్‌ ,బైక్‌పై యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌  ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ను చూసి… చరణ్‌, ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషి అవుతున్నారు.