పాస్టర్ ప్రవీణ్ తీరు దేశ ప్రతిష్టకు ప్రమాదకరం!

346

రాష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను “క్రీస్తు గ్రామాలు”గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.

పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు మాతృదేశం ప్రతిష్టను కూడా తాకట్టు పెట్టిన విషయం లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ పరిశోధనలో తేలింది. “బానిసత్వం నుండి బాలకార్మికులకు విముక్తి” పేరిట కథలు సృష్టించి ప్రపంచం దృష్టిలో దేశాన్ని అప్రతిష్టపాలు చేసి, ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ ద్వారా ఏవిధంగా కోట్లాది రూపాయల ధనం సంపాదించాడో వివరిస్తూ లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ జాతీయ బాలల హక్కుల కమిషన్ కు నివేదిక అందజేసింది.

ఈ నివేదిక ప్రకారం.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కాకినాడలో బాలబాలికల కోసం అనాథ శరణాలయం నడిపిస్తున్నాడు. వీటిని ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ అనే సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాడు. ఫారిన్ కంట్రిబ్యూషన్ లైసెన్సు కలిగిన సైలోమ్ బ్లైండ్ సెంటర్ సంస్థకు అమెరికాలోని రెండు సంస్థలు “సెట్ ఫ్రీ అలయన్స్’, “వాటర్ ఆఫ్ లైఫ్” ద్వారా  2013 నుండి 2018 (5 ఏళ్లలో) వరకు 93.67 కోట్లు ధనం నిధుల రూపంలో అందాయి. ఏయే సంవత్సరం ఎంత ధనం విదేశాల నుండి ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ సంస్థకు అందాయో ఈ దిగువన ఇవ్వబడింది:

పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి తమ దేశంలో ఏయే సంవత్సరం ఎంతమందిని మతం మార్చాడో వివరిస్తూ “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ తమ అధికార వెబ్సైటులో ఉంచిన డేటా ఇది. 2019 డిసెంబర్ 5న లీగల్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరమ్ సంస్థ ఈ అంశాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లి, ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’కు విదేశీ నిధులు రాకుండా ఆ సంస్థ FCRA లైసెన్సు రద్దు చేయాల్సిందిగా ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన మరుక్షణం “వాటర్ ఆఫ్ లైఫ్” సంస్థ తమ అధికారిక వెబ్సైట్ www.givefreshwater.org మూసివేసింది. అంతే కాదు “వాటర్ ఆఫ్ లైఫ్” వెబ్సైట్ ఓపెన్ చేయాలనుకుంటే సంబంధిత లింక్ “సెట్ ఫ్రీ అలయన్స్” వెబ్సైటుకు (www.setfreealliance.org) రీ-డైరెక్ట్ అయ్యే విధంగా సెట్టింగులు మార్చివేయబడ్డాయి.

ఇక ప్రవీణ్ చక్రవర్తికి చెందిన ‘సైలోమ్ బ్లైండ్ సెంటర్’ విదేశీ నిధుల కోసం భారతదేశ పరువును సైతం ఫణంగా పెట్టి తమకు నిధులు అందిస్తున్న సెట్ ఫ్రీ అలయన్స్ కు భారతదేశం విషయంలో తప్పుడు గణాంకాలు అందించింది. దీంతో ఇవే తప్పుడు గణాంకాలను ‘సెట్ ఫ్రీ అలయన్స్’ తమ అధికారిక వెబ్సైట్ లో ప్రదర్శనకు ఉంచి, భారతదేశంపై దుష్ప్రచారానికి తెరదీసింది. ఈ వెబ్సైట్ ఇస్తున్న తప్పుడు గణాంకాల ప్రకారం భారత్ ప్రపంచంలోనే అత్యధిక బానిసలున్న దేశం. అంతేకాకుండా ఆ బానిసల్లో ఎక్కువ శాతం 7నుండి 14 ఏళ్ల వయసున్న మైనర్ బాలబాలికలు!!