మహాశివరాత్రి బరిలో నాని?

98

ఈ యేడాది మహాశివరాత్రికి బాక్సాఫీస్ బరిలో ఆసక్తికరపోరు నెలకొనబోతోంది. ఇప్పటికే మార్చి 11న మహా శివరాత్రి కానుకగా మూడు సినిమాలు విడుదల కాబోతున్నట్టు ప్రకటనలు వచ్చాయి. శర్వానంద్ హీరోగా ఫోర్టీన్ రీల్స్ ప్లస్ ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ‘శ్రీకారం’ అదే తేదీ జనం ముందుకు వస్తోంది. ఈ ప్రకటన వచ్చిన వెంటనే నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘జాతిరత్నాలు’ చిత్రాన్ని కూడా మార్చి 11న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. ఇక అనిల్ రావిపూడి దర్శకత్వ పర్యవేక్షణలో రూపుదిద్దుకుంటున్న శ్రీవిష్ణు సినిమా ‘గాలి సంపత్’ సైతం మార్చి 11న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమౌతోంది.వీటి కథ ఇలా ఉంటే… ఇప్పుడు ఈ మూడు సినిమాలకు నేచురల్ స్టార్ నాని చెక్ పెట్టబోతున్నాడు.ఏప్రిల్ 16న విడుదల చేస్తామని ఇప్పటికే ‘టక్ జగదీశ్’ నిర్మాతలు ప్రకటన చేశారు. అయితే… పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను శరవేగంగా పూర్తి చేసి… ఈ చిత్రాన్ని మార్చి 11కి ప్రీ పోన్ చేయాలని దర్శక నిర్మాతలు ఆలోచిస్తున్నారట. అదే జరిగితే… శర్వానంద్, నాని బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారుతుంది.లేదంటే… ఏదైనా సినిమా కాస్తంత ముందుకో వెనక్కో వెళుతుందేమో వేచిచూడాలి.