అమీర్ సినిమాలో చై?

0
140

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్‌గా అమీర్ ఖాన్ పేరు తెచ్చుకున్నాడు. ప్రతి సినిమాతో కొత్త తరహా కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాడు. అతడి సినిమాలో చేయాలని అనేక మంది యువ హీరోలు ఎదురుచూస్తుంటారు.అయితే ఈ అవకాశం టాలీవుడ్ హీరోకి అందిందట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అమీర్ సినిమాలో అక్కినేని యువ హీరో నాగచైతన్య ఓ కీలక పాత్రలో కనిపించనున్నాడట. ప్రస్తుతం నాగచైతన్య థాంక్యు సినిమా చిత్రీకరణలో ఉన్నాడు . ఇదిలా ఉంటే అమిర్ ఖాన్ ప్రస్తుతం లాల్ సింగ్ చద్దా అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇందులోని సపోర్టింగ్ పాత్ర కోసం మొదటగా తమిళ నటుడు విజయ్ సేతుపతిని ఓకే చేశారట. కానీ డేట్స్ కారణంగా విజయ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. దాంతో ఈ సినిమా మేకర్స్ ఈ పాత్ర చేసేవారి కోసం వెతుకులాట మొదలుపెట్టారు.చివరకు ఈ పాత్రకు నాగచైతన్యను అనుకున్నారట. ఈ అవకాశంపై నాగచైతన్య త్వరలో తన నిర్ణయం తెలపనున్నాడు.నాగచైతన్యకు తన హిందీ పరిచయం కోసం ఇది ఓ మంచి అవకాశంగా భావించవచ్చు, దీంతో నాగచైతన్య మార్కెట్ కూడా చాలా పెరుగుతుంది. మరి ఈ విషయంలో నాగచైతన్య ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి.