ఏపీ ఫైబర్ నెట్ సేవలు త్వరగా అందించండి..

228

ఏపీ ఫైబర్ నెట్ అందని ద్రాక్షగా చేసిన గత ప్రభుత్వం..

స్థానిక కేబుల్ ఆపరేటర్లు అడ్డు పడుతున్నారనే ఆరోపణలు..

ప్రభుత్వానికి సామాన్య ప్రజలు విజ్ఞప్తి..

సామాన్యులకు తక్కువ ఖర్చుతో సేవలు అందించే విధంగా,గత ప్రభుత్వం మొదలు పెట్టిన “ఏపి ఫైబర్ నెట్” టిడిపి ప్రభుత్వ హయాంలో కొందరు బడాబాబులు,రాజకీయ నాయకులకే పరిమితం అవుతుంది అనే చెప్పాలి.సామాన్యులు కనెక్షన్ కోసం ఎంత ప్రయత్నించినా ఫలితం మాత్రం శూన్యం గానే ఉంది.వైసీపీ ప్రభుత్వం సామాన్యుల ప్రజలందరికీ ఇంటర్నెట్ అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతుంది.గత టిడిపి ప్రభుత్వం హయాంలోని ఏపీ ఫైబర్ నెట్ లోని కోట్లాది రూపాయలు కుంభకోణం జరిగిందని ఆరోపణలు ఉన్నాయి.వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏపీ ఫైబర్ నెట్ పల్లె ప్రజలుకు, పట్టణా ప్రజలందరికీ సౌకర్యవంతమైన సేవలు అందించాలనే సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుకు వెళుతుంది.

ఈ క్రమంలోనే ఇటీవలనే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా వైసీపీ నాయకులు గౌతంరెడ్డిని నియమించారు.ఏపీ ఫైబర్ నెట్ విజయవాడ పట్టణ వాసులకు సేవలు అందుతుందో లేదో అన్నది కొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.విజయవాడ పట్టణంలో కొంత మంది కేబుల్ ఆపరేటర్లు సిండికేట్ అయిన ఏపీ ఫైబర్ నెట్ పట్టణంలోకి రాకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.ఇటీవలనే చైర్మన్ గా నియమితులైన గౌతం రెడ్డిని ఏపీ ఫైబర్ నెట్ సేవలు సామాన్య ప్రజలు అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని సామాన్యులు కోరుతున్నారు..