మీ జుట్టు ఊడిపోతుందా?

652

అనేక ఏళ్ళుగా ఎందరో, కాదు కాదు దాదాపుగా అందరూ ఎదుర్కునే ఏకైక సమస్య ఈ జుట్టు ఊడిపోవడం, అసలు జుట్టు ఊడిపోవడం అనేది మనం అనుకునే అంత పెద్ద సమస్య కాదు అనుకోవడానికి లేదు, ఇది సాధారణంగా ఒత్తిడి వల్ల,సరియైన ఆహరం తీసుకోకపోవడం వల్ల,దీర్ఘకాలిక వ్యాధులు , వృద్ధాప్యం , వంశపారంపర్య, కాలుష్యం ఎలా అనేక సమస్యల వల్ల ఈ సమస్య మనల్ని పట్టి పీడిస్తుంది. అయితే భయపడవలసిన అవసరం లేదు. దీనిని అత్యంత పొషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా,సరియైన జుట్టు సంరక్షణ పదార్దాలు అంటే, నూనే లాంటివి వాడడం ద్వారా నిర్మూలించవచ్చు.

కొబ్బరి, మీ జుట్టు సం రక్షణలో అన్నిటికంటే, మొదటిగా, మరియు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కోబ్బరి గురించే, దీనిలో ఉత్పన్న లక్షణాలు మీ జుట్టుని ఊడిపోకుండా కాపాడడంలో ఎంతగానో సహాయపడతాయి, అయితే కొబ్బరి కాయని చిన్న చిన్న ముక్కలుగా చేసి రుబ్బితే అందులో ఉండే కొబ్బరి పాలు, మీ జుట్టు రక్షణలో కీలక పాత్ర పోషిస్తాయి.

రాత్రి పడుకునే ముందు మీ జుట్టు కు జొజోబా ఆయిల్ పట్టించి, మరుసటి రోజు తలస్నానం చేస్తే మంచి ప్రభావం చూపిస్తుంది.

ఒక్కోసారి తగినంత పోషక ప్రోటీన్లు లేకపోవడం కారణంగా మీ జుట్టు ఎక్కువగా ఊడిపోవడం జరుగుతుంది,అందుకే ఈ పోషక ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం,రోజు వారి ఆహారంలో “హైడ్రోక్లోరిక్ ఆమ్లం టాబ్లెట్(Hydrochloric Acid)” ఒకటి తీసుకోవడం మంచిది.

ఒక కోడి గుడ్డు తీసుకుని దానిలోని తెల్ల సొనని ఆలీవ్ ఆయిల్ లో కలిపి, ఈ మిశ్రమాన్ని మీ తలకు పట్టించాలి,20నిమిషాల తరువాత చల్లని నీటితో,షాంపూతో తల స్నానం చేస్తే గుడ్డులో అదికంగా ఉండే సెలీనియం, ఐరన్, ఫాస్ఫరస్ మీ జుట్టుకు పట్టి మంచి ప్రబావం చూపిస్తాయి.

ఉసిరి మీ జుట్టుని రక్షించడంలో ఎంతగానో సహాయపడుతుంది.ఇందులో ఉండే “యాంటీ ఆక్సిడంట్స్(Anti Oxidents)”,”Vitamin C”మీ జుట్టుకి బలాన్ని చేకూర్చడంలో ఎంతగానో సహాయపడుతుంది.2 స్పూన్లు ఉసిరి పొడి, 2 స్పూన్లు నిమ్మ రసం కలిపి మీ జుట్టికి పట్టించి 20 నిమిషాల తరువాత శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది.

మీ ఇంట్లో దొరికే పదార్దాలలో తేనె,ఆలీవ్ నూనె,దాల్చిన చెక్క కలిపిన మిశ్రమాన్ని మీ జుట్టుకు పట్టించి శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

ఒక కోడి గుడ్డు తీసుకుని,దానిలోని సోనను,గోరింటాకు పొడిని,కొంచెం పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి కాసేపటి తరువాత వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఫలితం లబిస్తుంది.

మీకు తెల్ల జుట్టు పెరగ కుండా ఉండాలన్న,జుట్టు ఊడిపోకుండా ఉండాలన్నా, మందార పువ్వులు తీసుకుని పొడిగా చేసి అందులో కొబ్బరి నూనె కలిపి, ఆ పేస్ట్ ని మీ తలకు పట్టించి 20 నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో శుబ్రం చేసుకుంటే మంచి ఉపసమనం కలుగుతుంది.

10-12 గోరింట ఆకులు తీసుకుని, ఆవాల నూనెలో కలిపి, మరగ పెట్టాలి,తరువాత ఈ మిశ్రమంలో ఆకులన్ని తొలగించి, దానిని ఒక సీసాలో ఉంచుకుని రోజూ మీ సాధారణ నూనెలా ఉపయోగించుకుంటే మంచిది.