మళ్లీ మతమార్పిడి కలకలం

751

నాడు  కృష్ణా పుష్కర ఘాట్.. నేడు కొవ్వూరు గోపాదాలరేవు
కొవ్వూరులో అడ్డుకున్న పౌరోహితులు
సోషల్ మీడియాలో వీడియో హల్‌చల్
వరసగా వెలుగుచూస్తున్న ఘటనలు
ఏపీలో పెరుగుతున్న క్రైస్తవం
పోలీసుల మౌనంపై బిజెపి, హిందూమహాసభ ఆగ్రహం

(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో మతమార్పిడి కలకలం మళ్లీ మొదలయింది. గత ఏడు నెలల నుంచి రాష్ట్రంలో నిర్నిరోధంగా క్రైస్తవ మత ప్రచారకులు హిందువులను, మత మార్పిళ్లు చేస్తున్న వైనం వెలుగుచూస్తూనే ఉన్నాయి.దానికి సంబంధించి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  దీనిపై ఇటీవల అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహరాజ్ ప్రధాని మోదీ, కేంద్రహోం మంత్రి అమిత్‌షాకు లేఖలు రాశారు. గత ఏడు నెలల నుంచి ఆంధ్రప్రదేశ్‌లో వేలమంది హిందువులను క్రైస్తవ  మతంలోకి మార్చారని, వారికి ప్రభుత్వ మద్దతు ఉందంటూ ఫిర్యాదు చేసిన వైనం సంచలనం సృష్టించింది. ఇది కూడా చదవండి… ‘ అమరావతికి హిందూ దళం!
దానికి కొనసాగింపుగా, బెజవాడలో పర్యటించిన హిందూ మహాసభ తెలుగు రాష్ట్రాల బాధ్యుడు, ప్రముఖ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణలు మరింత సంచలనం సృష్టించాయి. సీఎం జగన్‌కు తెలిసే మతమార్పిళ్లు జరుగుతున్నాయని, కృష్ణా పుష్కర ఘాట్‌లో 40 మంది హిందువులను మతం మారిస్తే, జగన్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇది  కూడా చదవండి.. ‘ఏపీ మరో యుపి అవుతుందా?  ఒక పథకం ప్రకారం రాష్ట్రాన్ని క్రైస్తవాంధ్రప్రదేశ్‌గా మారుస్తున్నారని ఆరోపించారు. చివరకు వెంకటేశ్వరస్వామి కొలువుదీరిన టి టిడిని కూడా భ్రష్ఠుపట్టిస్తున్నారని ఆరోపించిన ఆయన, వెంకన్న జోలికి వెళ్లిన వారంతా ఏమయ్యారో తెలుసన్నారు. అసలు జగన్ తన మతం చెప్పడానికి  ఎందుకు మొహమాటపడుతున్నారని ప్రశ్నించారు. ఆ సందర్భంలో మతమార్పిళ్లకు వ్యతిరేకంగా హిందూ మహాసభ నిర్వహించిన ర్యాలీ అందరినీ ఆకర్షించింది. నిజానికి విజయవాడ పుష్కరఘాట్‌లో 40 మంది హిందువులను మతం మార్పించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇది కూడా చదవండి.. ‘ అనుకున్నట్లే.. అమరావతికి హిందూదళం వచ్చేసింది!
తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు పక్కనే ఉన్న తంగిడి నుంచి వచ్చిన సుమారు 25 మంది కాపులను గోపాదాల రేవులో బాప్జిజం ఇప్పించేందుకు, క్రైస్తవ మత పెద్ద చేసిన ప్రయత్నాలను అక్కడి శివాలయ పౌరోహితులు అడ్డుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  తంగిడి నుంచి వచ్చిన కాపులను క్రైస్తవంలోకి మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలను అక్కడి పౌరోహితులు గమనించి అడ్డుకున్నారు. పాస్టర్ ప్రతినిధులను నిలదీసేసరికి.. తాము ఎక్కడి నుంచి వచ్చాము? ఎందుకోసం వచ్చామన్న వివరాలు వెల్లడించారు. దానితో పౌరోహితులు సీఐకి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు.  భయపడిన కొందరు మహిళలు  తాము తెలియక ఇక్కడకు వచ్చామని, బాప్టిజం కోసం ఇక్కడకు తీసుకువచ్చారని, మరోసారి రామని బ్రతిమిలాడుకున్నారు. దానితో ఆగ్రహించిన ఓ పౌరోహితుడు పార్టర్ ప్రతినిధులనుద్దేశించి విరుచుకుపడ్డారు. ‘మేం కూడా మీ చర్చికి ర మ్మంటారా? అక్కడ సత్యనారాయణ వ్రతం చేయమంటారా? అసలు ఇది హిందువుల రేవు. ఇక్కడకు మీరెలా వస్తారు’ అని ప్రశ్నల వర్షం కురిపించిన వీడియో హల్‌చల్ చేస్తోంది.

దీనిపై స్పందించిన బిజెపి ధార్మిక సెల్ రాష్ట్ర అధ్యక్షుడు తూములూరు చైతన్య.. రాష్ట్రంలో మత మార్పిళ్లు చాపకింద నీరులా పెరుగుతున్నాయని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకునేందుకు భయపడుతనన్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవ మతానికి అనుకూలంగా వ్యవహరిస్తుందనడానికి గతంలో బెజవాడ పుష్కరఘాట్, ఇప్పుడు కొవ్వూరు గోపాదాలరేవు వద్ద  బాప్టిజం ఇప్పించే ప్రయత్నాలే నిదర్శనమని వ్యాఖ్యానించారు.