రేషన్ బండి రెడీ…

569

–  ఫిబ్రవరి 1 నుంచి ఇంటివద్దకే రేషన్…
– రేషన్ కష్టాలు, తూకాలలో మోసాలకు చెక్…
– మినీట్రక్కుల సరఫరాకు సర్వం సిద్ధం…
-సీఎం జగన్ చేతులమీదుగా మినీ ట్రక్కుల ప్రారంభం…
– చౌకదుకాణాలకు వెళ్లే వ్యయ ప్రయాసలు  తప్పనున్నాయి…
– ప్రభుత్వ సేవలపై సర్వత్రా హర్షం…
( మార్తి సుబ్రహ్మణ్యం)

రేషన్ షాపు దూరం సరుకులు తెచ్చుకోవడం భారం  వయసు మీరిన వారు పడే బాధలు వర్ణనాతీతం. అప్పుడప్పుడు వేలిముద్రలు పడకపోవడం , గంటల కొద్దీ సరుకుల కోసం నిరీక్షించడం తదితర ఇబ్బందులకు, తూకాలలో మోసాలకు  జగన్ ప్రభుత్వం చెక్ పెట్టనుంది.ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి రేషన్ లబ్ధిదారుల ఇంటికే నిత్యావసర సరుకులను అందచేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

రాష్ట్రంలో  జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుంది..ఇప్పటికే  ఇంటి వద్దకే పెన్షన్ , అనేక సంక్షేమ పథకాలును ప్రవేశపెడుతూ ప్రజా రంజక పాలన సాగిస్తున్నారు.
రేషన్‌లో అందించే నాణ్యమైన బియ్యం సహా నిత్యావసరాలను ఇంటి వద్దే డెలివరీ చేయనుంది.ఈ మేరకు 9260 వాహనాలను సిద్దం చేసింది.

ఇంటింటికీ బియ్యం, సరుకులు  పంపిణీ ఇలా…

ప్రతి నెలా 1 వ తేదీనుంచి సరుకులు అందచేస్తారు. ఒక్క రోజుకు 90 నుంచి 100కుటుంబాలకు మినీ ట్రక్కు ద్వారా రేషన్ పంపిణీ చేయాల్సిఉంటుంది.  ట్రక్కును కేటాయిస్తూ సచివాలయ పరిధిలో నెలలో 14 నుంచి 22 రోజులపాటు రేషన్ పంపిణీ పక్రియ కొనసాగిస్తారు. ఏ రోజుకారోజు బియ్యం తూకం వేయించుకుని  వాహనంలో తీసుకెళ్లి కార్డుదారులకు మినీ ట్రక్కు  వాహనదారుడు అందచేస్తారు.ఆయా వీధులు, కాలనీలుకు వచ్చిన మినీ ట్రక్కు వద్దకు గ్రామ, వార్డ్ వాలంటీర్లు చేరుకుని దగ్గరుండి తమ పరిధిలోని కార్డు దారులకు రేషన్ పంపిణీ చేస్తారు.ఏ రోజున ఏ వీధిలో ఎవరెవరి ఇళ్లవద్దకు ఎన్నిగంటలకు రేషన్ డోర్ డెలివరీ వాహనం వస్తుందనే సమాచారం కార్డుదారుని ఫోన్ కు మెసేజ్ వస్తుంది.ఆ సమయానికి కుటుంభ సభ్యుల్లో ఒకరు ఇంటివద్ద ఉంటే చాలు.వారి కళ్లెదుటే తూకం వేసి సరుకులు అందచేస్తారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి…

మినీ ట్రక్కులును నిరుద్యోగులకు ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి దొరకనుంది.ట్రక్కులును  అన్ని వర్గాలకు అందించి ప్రభుత్వం సమన్యాయం చేసింది.

మినీ ట్రక్కులో అధునాతన సౌకర్యాలు…

ప్రతి ఇంటికీ రేషన్ తీసుకెళ్లే వాహనాలును అధునాతన సౌకర్యాలతో, ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు.వాహనానికి ముందుభాగంలో స్పీకర్ అమర్చారు.దీనికి మైక్, సైరన్ అనుసందించారు.వాలంటీర్ తమ పరిధిలోని ఇళ్ల వద్దకు రాగానే సైరన్ మోగిస్తారు.మైక్ ద్వారా రేషన్ సరుకులు వచ్చాయని చెపుతారు.రాత్రి వేళల్లో  రేషన్ పంపిణీకి  ఇబ్బంది లేకుండా ఎల్ ఈ డి లైట్లు అమర్చారు.వాహనంలో వాలంటీర్ కోసం కుర్చీ ఏర్పాటు చేశారు.సరుకులను తూకం వేసేందుకు కాటా ఏర్పాటు చేశారు.ఛార్జింగ్ పెట్టుకునే సౌకర్యం కల్పించారు.దుకాణాల తరహాలో క్యాష్   బాక్స్, అత్యవసర సమయాలలో ప్రధమ చికిత్స పెట్టె, ఫైర్ సేఫ్టీ యంత్ర పరికరాలును అందుబాటులో ఉంచారు.