నెట్ బౌలర్లతో భారత్ గబ్బా కోటను బద్దలుకొట్టారు

184

ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో 2-1 తేడాతో గెలుపొందిన భారత జట్టుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. తమ జట్టు ఓటమిని ఆసీస్ మాజీ క్రికెటర్లు ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. భారత్‌ను ఎప్పటికీ తక్కువ అంచనా వేయొద్దని రుజువైందని ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్ వ్యాఖ్యానించగా.. దిగ్గజ క్రికెటర్ రిక్కీ పాంటింగ్ అయితే ఇప్పటికీ షాక్ నుంచి తేరుకోలేదు. ఇండియా-ఏ జట్టు ఆసీస్‌ను సొంత గడ్డపై ఓడించడం పట్ల పాంటింగ్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.కోహ్లి లేకున్నా.. గాయాల బెడద కారణంగా కీలక ఆటగాళ్లు దూరమైనా.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో భారత్ 3 వికెట్ల తేడాతో ఆసీస్‌ను ఓడించింది. అడిలైడ్‌లో 36 పరుగులకే కుప్పకూలిన స్థితి నుంచి నెల రోజుల్లోనే అనూహ్య ఫలితాలను సాధించింది.

1 COMMENT