టీమిండియాకు పీట‌ర్స‌న్ వార్నింగ్‌!

449

ఆస్ట్రేలియా గడ్డపై చివరి టెస్టులో సంచలన విజయాన్ని నమోదు చేసి సంబ‌రాలు చేసుకుంటున్న టీమిండియాకు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీట‌ర్స‌న్ ఓ స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు. మ‌రీ ఎక్కువ‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌ద్దని, త్వ‌ర‌లోనే ఇంగ్లండ్ జట్టు ఇండియాకు వస్తుందన్నాడు. అయితే పీట‌ర్స‌న్ చేసిన ట్వీట్ హిందీలో ఇక్కడ విశేషం. ప్రస్తుతం ఆ ట్వీట్ వైరల్ అవుతోంది. త్వ‌ర‌లోనే ఇంగ్లండ్ టీమ్ భారత పర్యటనకు రానున్న నేప‌థ్యంలో కేపీ ఇలా సరదాగా ట్వీట్ చేశాడు.

‘టీమిండియా.. ఆస్ట్రేలియాపై గెలిచిన చారిత్ర‌క విజ‌యాన్ని బాగా సెల‌బ్రేట్ చేసుకోండి. ఎందుకంటే.. ఇది ఎన్నో అడ్డంకుల మ‌ధ్య సాధించిన విజ‌యం. అయితే అస‌లు సవాలు మీకు కొన్ని వారాల్లో ఎదురు కాబోతోంది. ఇంగ్లండ్ జట్టు భారత్ వ‌స్తోంది. ఇంగీష్ టీమ్‌ను మీ సొంత‌గ‌డ్డ‌పై ఓడించాల్సి ఉంటుంది. జర జాగ్ర‌త్త..‌ ఈ రెండు వారాల్లో మ‌రీ ఎక్కువ‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌ద్దు’ అని కెవిన్ పీట‌ర్స‌న్ హిందీలో ట్వీట్ చేశాడు. క్రికెట్ నుంచి తప్పుకున్నాక పీటర్సన్‌ వ్యాఖ్యాతగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.