72వ గణతంత్ర దినోత్సవానికి ఘనంగా ఏర్పాట్లు:జిల్లా కలెక్టరు ఇంతియాజ్

289

ఈనెల 26వ తేదీన 72వ గణతంత్ర దినోత్సవాన్ని రాష్ట్రస్థాయిలో ఘనంగా నిర్వహించడానికి విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ ఆదేశించారు.

స్థానిక కలెక్టరు క్యాంపు కార్యాలయంలో బుధవారం ఇందిరాగాంధి మున్సిపల్ స్టేడియంలో జరగనున్న గణతంత్ర దినోత్సవ ఏర్పాట్లు పై రాష్ట్ర,జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టరు ఏ.యండి.ఇంతియాజ్ సమీక్షించారు.

సమావేశంలో కలెక్టరు ఇంతియాజ్ మాట్లాడుతూ ఈనెల 26వ తేదీన నగరంలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించే 72వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి ఉదయం 8.30 గంటలకు పేరేడ్ ఏర్పాటు అవుతుందని, ఉదయం 8.45 గంటలకు పేరేడ్ కమాండర్ పేరేడ్ ను సిద్ధం చేయడం జరుగుతుందన్నారు. అనంతరం 8.51 గంటలకు రాష్ట్ర  డిజిపి, ఉదయం 8.55 గంటలకు  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉదయం 8.30 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఉదయం 8.57 గంటలకు  రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.యస్. జగన్మోహన రెడ్డి  , ఉదయం 8.58 గంటలకు  రాష్ట్ర గవర్నరు  స్టేడియంకు చేరుకుంటారన్నారు. అనంతరం రాష్ట్ర గవర్నరు  బిశ్వభూషణ్ హరిచందన్ ఉదయం 9-00 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారన్నారు. ఉ. 9.01 గంటల నుంచి 9.10 గంటల వరకు  రాష్ట్ర గవర్నరు పోలీస్ పేరేడు సమీక్షిస్తారన్నారు. అనంతరం కవాతుదళాలతో మార్చ్ ఫాస్ట్ నిర్వహించబడుతుందని, తదుపరి ఉదయం 9.41 గంటలకు  రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్ సందేశం ఇస్తారన్నారు. ఉదయం 9.57 గంటలకు మార్చ్ ఫా’ ఉత్తమంగా నిలిచిన కంటెంజెంట్సకు ట్రోఫీలు, బహుమతులు అందజేస్తారన్నారు. అనంతరం ప్రభుత్వ సంక్షేమ పథకాలను అవగాహన పరిచేందుకు ప్రదర్శించిన వివిధ ప్రభుత్వ శాఖల శకటాల్లో ఉత్తమంగా నిలిచిన వాటికి బహుమతులు అందజేస్తారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులతో పాటు, పలువురు ఉన్నతస్థాయి అధికారులు, ఆర్మీ, యన్ సిసి కంటి జెంట్స్, అధికారులు, తదితరులు హాజరవుతారన్నారు.

ప్రస్తుత కోవిడ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా సీటింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు. గణతంత్ర ఉత్సవాల్లో పాల్గొనే కవాతుదళాలకు, శకటాలు తయారు చేసే సిబ్బందికి రెండు విడతలు కోవిడ్ పరీక్షలు (ఆర్టిపిసిఆర్) నిర్వహించాలన్నారు. గత ఏడాది నిర్వహించిన ఉత్సవాల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కార్యక్రమ నిర్వహణలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా సంబంధిత అధికారులు, శాఖలు సమన్వయంతో పనిచేసి 12వ గణతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలన్నారు. ప్రొటోకాల్ అమల్లో ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా అమలు చేయాలన్నారు. స్టేడియంలో వేదిక, ముఖద్వారాలను, పరిశీలనా వాహనాన్ని పుష్పాలంకృత ఏర్పాట్లను ఆకర్షణీయంగా ఉండేలా చేయాలని ఉద్యానవన శాఖాధికారులను కలెక్టరు ఆదేశించారు. శకటాల ప్రదర్శనకు సంబంధించి ప్రతీ శకటానికి నలుగరికి మించకుండా ఆయా వ్యక్తులను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రత్యేక సిసి కెమోరాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్తు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా అవసరమైన ఏర్పాట్లుకు ఏ.పి. ట్రాన్స్ కో, ఏపిసిపిడిసియల్ అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు.

స్టేడియంలో త్రాగునీరు సరఫరాతో పాటు తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటుకు, పారిశుద్ధ్య కార్యక్రమాల నిర్వాహణకు విజయవాడ నగరపాలక సంస్థ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిమాపక శాఖాధికారులు స్టేడియంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఆహ్వానితులు అందరూ ఉదయం 8-30 గంటలకు ముందుగానే స్టేడియంలో తమకు కేటాయించిన సీట్లలో కూర్చునే ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ డ్యూపాన్లు, ఐడెంటిఫికేషన్ కార్డులతో హాజరుకావాలన్నారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రతిఒక్కరూ పోలీలకు, అధికారులకు సహకరించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాల అమలుకు సంబంధించిన వివిధ శాఖల ద్వారా రూపొందించబడిన 12 శకటాలను ప్రదర్శించడం జరుగుతుందన్నారు. అంబులెన్స్ లు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్, గ్యాలరీలలో ఫస్ట్ ఎయిడ్ కిట్స్ కూడా అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామన్నారు.

నగరపోలీస్ కమిషనరు బత్తిన శ్రీనివాసులు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాలుపంచుకుంటున్న ప్రముఖులు, తది తరులకు సంబంధించి ప్రవేశం, పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా  రాష్ట్ర గవర్నరు,  రాష్ట్ర ముఖ్యమంత్రి స్టేడియంకు చేరుకునే ముందుగానే  రాష్ట్రమంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు స్టేడియంకు చేరుకునేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు.