మరపురాని గెలుపు

361

ఓటమే లేని కంగారు లోకంలో

బ్రిస్సేన్ వేదికగా భారత్ బంగారు విజయం

మూడొందల పరుగుల లక్ష్యాన్ని ఛేదించి

భారత ఆటగాళ్లు అద్భుతమైన ఘనకార్యం చేశారు

ఎలాగైనా గెలవాలన్న తపన అంకితభావం

సంకల్పంగా ఎంచుకొని ముందుకేగిన భారత్

గబ్బాలో తొలి విజయం సాధించి

అబ్బా! అనిపించుకున్న భారత ఆటగాళ్లు

అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సయితం

గొప్ప పోరాట పటిమనే ప్రదర్శించారు

శుభమన్ క్లాస్ బ్యాటింగ్, పుజారా దృఢ సంకల్పం

రిషబ్ పంత్ వీరోచిత ఇన్నింగ్స్ తోడయి

రసవత్తరంగా సాగిన చివరి టెస్టులో గెలుపు

32 ఏళ్లుగా గబ్బా మైదానంలో ఓటమి అన్నది

ఎరుగని అజయ ఆస్ట్రేలియా జట్టుకు ఇది చెంపపెట్టు

భారత ఆటగాళ్లకు అభినందన మందార మాలలు

చింతపట్ల. వెంకటరమణాచారి మౌన యోగి,
జర్నలిస్ట్,
హైదరాబాద్,
9493331195.