అందానికి, ఆరోగ్యానికి బొప్పాయి…

314

ఏడాది పొడవునా విరివిగా లభించేది బొప్పాయి.ఇందులో ఉన్న పోషకాలు మన అందరికీ ఎంతో ఉపయోగపడతాయి.బొప్పాయికి మంచి చరిత్ర ఉన్నది.అంతేకాక బొప్పాయిని మందులలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.బొప్పాయిని ఎన్నొ వ్యాధులకు, రోగాలకు, చర్మానికి మందుగా వాడుతున్నారు.రోజూవారి వనుల్లోనూ దీని ప్రాముఖ్యత ఎంతో ఉంది.బొప్పయిని నావికా పితామహుడైన క్రిస్టఫస్ కొలంబస్ కు ఇష్టమైన పండుని చెబుతారు.ఇది సామాన్యంగా అన్ని ఉష్ణమండల ప్రదేశాలలో పండుతుంది.తక్కువ ఉష్ణోగ్రతతో పెరుగుతుంది.బొప్పాయి ఆకులు, విత్తనాలు, పాలు ప్రేగులోని పరాన్నజీవుల్ని నాశనం చేయటానికి,చాలా రకాల వ్యాధులకు మందుగా పని చేస్తుంది.అంతేకాక గర్భ నిరోధానికి,గర్భస్రావానికి ఉపయోగపడుతుంది.బొప్పాయి రుచి,దాని విషేషతలు విస్తారమైన ఆరోగ్యానికి సోపానంగా నిలుస్తుంది.

చర్మం మరియు బొప్పాయి:
ఇది మీ చర్మాన్ని కాపాడుకోవటానికి విశిష్టమైన దివ్య ఔషధం.దీనిని ముఖానికి ఫేస్పాక్ గా వాడుకోవచ్చు.ముఖంపై ఏర్పడిన మచ్చలకు,మొటిమలకు,చర్మ వ్యాధులకు ఉపయోగించవచ్చు.చర్మంలో ఏర్పడిన మృతకణాలను,మృత చర్మన్ని పోగొడుతుంది.చర్మం మరింతగా ప్రకాశించేదుకు బొప్పాయి తోడ్పడుతుంది.

వంటిలోని కొవ్వును తీసివేయటంలో బొప్పాయి పాత్ర:
శరీరంలోని కొవ్వును తీసివేయటంలో,రక్తకణాలలోని కొవ్వును బొప్పాయి తీసివేస్తుంది.గుండె పోటు రానీయకుండా నివారిస్తుంది.

చర్మ సౌందర్యానికి బొప్పాయి: బొప్పాయి ఫేస్ మాస్క్ గా చాలా మంచిది. బొప్పాయి వయస్సును మీద పడినా వారిలో సైతం తన ప్రభావాన్ని చూపుతుంది.చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది.వయస్సు మీరిన వారిలోనూ అందాన్ని పెంపొందించుతుంది.
శరీరంలో హాని కలిగించే టాక్సిన్లను బొప్పాయి నివారిస్తుంది.అంతేకాక ఇది జీర్ణవ్యవస్ధపై చక్కగా పని చేస్తుంది.కాకపోతే మీరు బొప్పాయిని రోజూ వాడాలి.అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి.

వ్యాధినిరోధకశక్తి మరియు బొప్పాయి: ఈ పండులో విటమిన్-ఎ,విటమిన్-సి ఉండటం వల్ల శరీర వ్యాద్థి నిరోధకశక్తి పెరుగుతుంది.అంతేకాక జ్వరం,జలుబు,ఫ్లూతో బాధపడే వారికి ఎంతో మంచిది.రోజూ బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తి బాగా అభివృధ్ధి చెందుతుంది.

ఋతు క్రమ సమస్యలకు బొప్పాయి: ఆడవారిలో తరచూ ఉండే ఋతుక్రమ సమస్యలకు బొప్పాయి చక్కని మందు.అంతేకాక ఆడవారిలో రుతుక్రమ సమయంలో వచ్చే పొత్తి కడుపు నొప్పిని కూడా బొప్పాయి తొలగిస్తుంది.

కాలేయ కాన్సర్ కు బొప్పాయి: కాలేయ సమస్యలకు దూరంగా ఉండేట్లు బొప్పాయి చేస్తుంది.అంతేకాక కాలేయంలో ఉన్న కణాల్లో కాన్సర్ కారక క్రిములను చంపేస్తుంది.

అధిక బరువును తగ్గించటంలో బొప్పాయి: అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గాలంటే బొప్పాయిని రోజూ వాడితే బరువు తగ్గుతారు.బొప్పాయిలో ఉన్న సహజమైన పోషకాల వల్ల తక్కువ కాలరీలు ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది.సన్నగా తయారవాలని ఆశపడేవారికి బొప్పాయి వల్ల సన్నగా తయారయ్యే అవకాశముంది.

మలబధ్ధకానికి బొప్పాయి: మలబద్ధకానికి బొప్పాయి మంచి మందు.జీర్ణాశయంలో బొప్పాయి పని చేసి మలబద్ధకం నుంచి బయటపడేస్తుంది.మలబద్ధకం రాకుండా ఉండేందుకు బొప్పాయిని వాడితే మంచి ఫలితాలనిస్తుంది.బొప్పయిలో ఉన్న పొపైన్ ఎన్జయం జీర్ణవ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది.

బొప్పాయి చాలా మంచి పొషక విలువలు ప్రోటీనులు కలిగిన పందు.అంతేకాక ఇది పండ్లన్నిటిలోనూ చవకగా లభించే పండు.వారానికి ఒకసారైనా దీనిని తినటం ఎంతో మంచిది.బొప్పాయిని చర్మానికి కూడా రాయటం వల్ల చర్మం మెరుస్తుంది.మనం ఎంతో ఖర్చు చేసి వాడే ఫేస్ క్రీములకన్నా బొప్పాయి ఎంతో మిన్న.