బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

405

బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కానీ ఎక్కువ మంది తీపి కోసం చక్కెరనే వాడుతారు. ఐతే చక్కెర కంటే బెల్లంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి వైద్యులు సూచిస్తున్నారు.

పూర్వీకులు కూడా ఇదే విషయాన్ని చెప్పారు.

బెల్లం నోటికి తీపిని ఇవ్వడమే కాదు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు తోడ్పడు తుంది. మన పూర్వీకులు కూడా బెల్లం తినడంతోపాటు నీటిలో కలుపుకొని తాగేవారు.

బెల్లంలో ఇరన్‌, మినరల్స్‌ ఎక్కువగా ఉంటాయి. అందుకే బెల్లం తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆహారంలో ప్రతి రోజులు బెల్లం తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చు.

జలుబు చేసినప్పుడు ఒక ముక్క బెల్లం తీని గోరువెచ్చని నీరు తాగితే మంచి ఫలితం ఉంటుంది.

ఇది ప్రాథమిక చికిత్సగా పనిచేయడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. నిత్యం బెల్లం తీసుకోవడం వల్లే యవ్వనం పెరుగుతంది.

ముఖం మచ్చలు చర్మంపై ముడతలను తొలగించి మంచి నిగారింపు ఇస్తుంది. రోజూ బెల్లం ముక్క తినడం వలన వెంట్రుకల సమస్యలు తొలగుతాయి. ఇందుకోసం గోరు వెచ్చని నీటితో బెల్లం తీసుకోవాలి.

టీ, కాఫీల్లో చక్కెరకు బదులు బెల్లం వాడితో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని వైద్య నిపుణులు సూచి స్తున్నారు.