ప్రసన్నకుమార్‌రెడ్డిపై తక్షణం కేసు పెట్టాలి

0
127

రాష్ట్రంలో వైసీపీ చట్టం అమలు
ఆలయాల ధ్వంసం వెనుక ప్రభుత్వ కుట్ర
ఫాస్టర్ ప్రవీణ్ వెనుక కుట్రకోణం
రథ యాత్రను అడ్డుకుంటే వైకాపాకు కాంగ్రెస్ గతే

పోలీసు అధికారులను బెదిరిస్తున్న వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డిపై తక్షణం కేసులు నమోదుచేయాలని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నిస్పక్షపాత్రంగా పనిచేసే పోలీసు అధికారులను బెదిరించి, మూలన కూర్చోబెట్టి తమ మాట వినేవారికి ఖాకీదుస్తులు వేసి సేవ చేయించుకుంటూ సొంత పోలీసు చట్టం అమలుచేస్తోందని వైకాపా ప్రభుత్వాన్ని ఆరోపించారు. పోలీసులు వైకాపా కార్యకర్తల్లా, వైకాపా కార్యకర్తలు పోలీసుల్లా పెత్తనం చెలాయిస్తూ, పార్టీలు మార్పించేలా ప్రతిపక్ష కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి గుండాలా ఒక ఐపిఎస్ అధికారిని దుర్బాషలాడి, బెదిరించడం వైకాపా అరాచకత్వానికి పరాకాష్టగా అభివర్ణించారు. ఆలయాలు ధ్వంసం చేసిన వారెవరో ప్రభుత్వానికి తెలుసని, వారిని రక్షించేందుకు ఇతర పార్టీలపై కుట్ర పూరితంగా ఆరోపనలు చేస్తుందని ప్రభుత్వంపై మండిపడ్డారు. వచ్చే నెల 4 నుంచి కపిలతీర్ధం నుంచి చేపట్టే రథయాత్రను ఆపాలని ప్రయత్నిస్తే కాంగ్రెస్ పార్టీలా వైకాపా ప్రభుత్వం కూలిపోతుందని పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశం మంగళవారం ఉదయం నిర్వహించారు. ఆయన ఇంకా ఇలా మాట్లాడారు…..

నిజాయితీగా పనిచేసే పోలీసులకు రక్షణ లేదు

ఏపీలో పోలీసులు పోలీసులను రక్షించుకునే పరిస్థితి లేకుండా పోయింది. నేడు ఐపీఎస్‌లకు నువ్వు రెండు రోజుల్లో ఉండవు అని అల్టిమేటమ్ ఇచ్చే స్ధితికి వైసీపీ వచ్చింది. పోలీసు వ్యవస్ధ దిగజారిపోయింది. వైపాకా ఎమ్మెల్యేలు, కార్యకర్తల నుంచి నిజాయితీ పరులైన పోలీసు అధికారులను వైసీపీ నేతల నుంచీ డీజీపీ రక్షించాలి. ప్రజలకు అన్యాయం జరిగితే హక్కుల సంఘాల వద్దకు వెళ్లేవారు. ఇప్పుడు పోలీసులు కూడా మానవ హక్కుల సంఘాల వద్దకు వెళ్తేపరిస్తితి నెలకొంది.సోషల్ మీడియాలో పోస్టులపై కొందరు పోలీసులు, పోలీలసు అధికారులు సుప్రీంకోర్టు న్యాయసూత్రాలకు వ్యతిరేకంగా కేసులు పెడుతున్నారు. అదే పోలీసులు ఎపీలో ఐపీఎస్‌లను బెదిరిస్తుంటే ఆ ఎమ్మెల్యేలపై ఎందుకు కేసులు పెట్టరు ? నెల్లూరు జిల్లాలో భాస్కర్ భూషణ్ అనే ఐపీఎస్ అధికారి పట్ల వైకాపా ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి బహిరంగంగా అనుచిత వ్యాఖ్యలు చేసి 24 గంటలైనా పోలీసులు ఎందుకు కేసులు పెట్టలేదు. రాష్ట్రంలో ఐపీసీ ఏమైనా వైసీపీ గా మారిపోయిందా? లేదా వైకాపా ఎమ్మెల్యేలకు ఐపీసీ వర్తించదా? ఆ వైసీపీ చట్టం ఏమిటో ప్రజలకు చెప్పాలి. ఎంత అహంకారం ? అంత అధికారం మదం? పోలీసుల్లో మెరాలిటీ ఉంటుందా? ఏ రకంగా విధులు చేయగలుగుతారు? మా ఎస్‌ఐ, సీఐ వద్ద ఉంటా ? నువ్వు రా తేల్చుకుందాం అని బెదిరిస్తున్నారు. ఎస్సైలు, సీఐలు కొంతమంది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇళ్ల దగ్గర పని చేస్తున్నారా ? భాజపా కర్నూలు జిల్లా మైనార్టీ కార్యకర్తలు కరీం, జలీల్, జిలానిలను వైకాపాపార్టీలోకి మారాలని లేకుంటే ఎన్‌కౌంటర్ చేస్తానని ఎస్‌ఐ శ్రీనివాసరావు బెదిరిస్తున్నాడు. ఇక్కడి పోలీసులు పట్టించుకోకుంటే జాతీయ మైనార్టీ కమిషన్‌కు ఫిర్యాదుచేసాం. అక్కడి సిద్ధార్దరెడ్డి అనే వైకాపా నాయకుడు 300 మంది రౌడీలను తెచ్చి బెదిరస్తున్నాడు. కొందరు పోలీసులు నిజాయితీతో పనిచేస్తుంటే వారిని వైకాపా నాయకులు బెదిరిస్తున్నారు. కొందరు పోలీసులు వైకాపా కార్యకర్తల్లా పనిచేస్తున్నారు. అందుకే ఎపీలో ఐపీసీనా లేక వైసీపీనా తేల్చాలి.

వైసీపీ ఆఫీస్‌గా పోలీస్ హెడ్ క్వార్టర్

ఎపీలో విగ్రహాలు, ఆలయాల ధ్వంసం వెనుక కుట్ర ఉందని సిఎం జగన్ చెప్పారు. సిఎం చెప్పిన 24 గంటలు ముగియకముందే ఎపీలో దేవాలయాల ద్వసం వెనుక కుట్రకోణం లేదని ఏపార్టీకి సంబంధం లేదని చెప్పిన డీజీపీ మరల రెండురోజుల్లో మాటమార్చారు. వైకాపా వారు లేరని, తెదేపా, భాజపా కార్యకర్తలు చేశారని, రాజకీయ కుట్ర ఉందని చెప్పడాన్ని బట్టి రాజకీయ వత్తిడికి లొంగారని స్పష్టంగా తెలుస్తోంది. ఏపీ పోలీస్ వ్యవస్థ వైసీపీ కేంద్ర కార్యాలయం నుండి నడుస్తుంది. పోలీస్ హెడ్ క్వార్టర్ వైసీపీ ఆఫీస్‌గా మారింది. పోలీసు అధికారులు సంఘం వైసీపీ కార్యకర్తల సంఘంగా మారిపోయింది. వైకాపా కార్యకర్తలు పోలీసులుగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరోక్షంగా అధికారం చెలాయిస్తున్నారు. ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది. వ్యవస్తలు వైకాపా చేతుల్లోకి వెళ్లిపోయింది.

రథయాత్ర ఆపితే వైకాపాకు కాంగ్రెస్ గతే

భాజపా రాష్ట్ర అధ్యక్షులు సోమువీర్రాజు నేతృత్వంలో రథయాత్ర చేస్తుంది. తిరుపతి కపిలతీర్ధం నుంచి రామతీర్దం వరకు జరుగుతుంది. పార్టీ జాతీయ నేతలు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. జనసేన, భాజపా కలిపి యాత్ర చేపడుతాయి. మతాలను రెచ్చగొట్టేందుకు యాత్రలు చేస్తున్నట్లు విమర్శిస్తున్న వైకాపా మంత్రులు బోత్సాసత్యనారాయణ, వెలంపల్లి, అవంతిశ్రీనివాస్‌లు రాష్ట్రాభివృద్ధికి ఏం చేశారో చెప్పాలి? బంగ్లాలు కూల్చడం, రాజకీయకక్షలతో ఇళ్లు కూల్చడం, గుళ్లు కూలుస్తుంటే ఫిడేల్ వాయించుకోవడం, పోలీసు అధికారులను బెదిరించడం మినహా ఏం చేశారు? ఒక చేత్తో రూ.100 లాక్కుని మరో చేత్తో రూ.10 విదిలిస్తున్నారు. ఇళ్ల పట్టాల పేరుతో రూ.9 వేల కోట్లు ఖర్చుచేసి రూ.4 వేల కోట్లు కొట్టేశారు. కేవలం సవాళ్లు టీవీలో విసురుతారు…వాస్తవానికి వస్తే పడిపోతారు.. దర్గాకు పోయే ఎండోమెంట్ మినిస్టర్ ఎపీ చరిత్రలో వెలంపల్లి ఒక్కడే ఉన్నాడు. మేం దర్గాలకు వ్యతిరేకం కాదు. మేంచేసే రథయాత్రను అడ్డుకుంటామని వైకాపా నాయకులు ప్రకటనలు చేస్తున్నారు. కపిల తీర్థం నుండి రామతీర్థం యాత్రని అడ్డుకుంటే హిందువులను అడ్డుకున్నటే.. రామమందిరంకోసం అద్వానీగారిని అడ్డుకున్న కాంగ్రేస్ ప్రభుత్యం పరిస్థితి ఎలా మరిందో..వైసీపీకి కూడా అదే గతి పడుతుంది. మేం అధికారంలోకి వస్తాం. మేం పోలీసుల వద్దకు వెళ్లి గౌరవంగా అభ్యర్దిస్తాం. మా యాత్రను అడ్డుకుంటే హిందువుల యాత్రను అడ్డుకున్నట్లే.

ఫాస్టర్ ప్రవీణ్ వెనుక కుట్రకోణం

వైకాపా కార్యకర్తగా ఉన్న ఫాస్టర్ ప్రవీణ్‌పై ఇప్పటి వరకు ఎందుకు వైకాపా ప్రభుత్వం కేసులుపెట్టలేదు. ఫాస్టర్ ప్రవీణ్ వెనుక కుట్రకోణం బయటపెట్టాలి. అయిదేళ్ల క్రితం జరిగిన పాస్టర్ ప్రవీణ్ ప్రసంగాలపై సిట్ వేసినట్లు ప్రకటించడం ఆలయాల ధ్వంసం అంశాన్ని పక్కదోవ పట్టించడానికే. హిందూ ఆలయాలపై దాడులు జరుగుతుంటే హిందూ ధర్మాచార్యులతో మాట్లాడక అన్యమతాల ఆచార్యులతో కమిటీ ఏరకంగా వేస్తారు?హోమాలు, యజ్ఞాలు చేస్తామంటే హిందూ ధర్మాచార్యులను బెదిరిస్తున్నారు. అన్యమతాచార్యులను బెదిరించగలరా? మతాలకు సంబంధించిన సమావేశం పెడుతున్నారంటే ఆలయాలపై దాడులు జరుగుతున్నట్లు ఒప్పుకున్నట్లే కదా? ఎందుకు ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకోలేదు. కర్నూలులో ఆలయాల ధ్వంసం కేసులో నిందుతులైన ముస్లిం యువకులను ఎందుకు అరెస్టు చేయలేదు? బలవంతంగా మతమార్పిడులు చేసుకోండని ప్రభుత్వమే ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోంది. ఆలయాల ధ్వంసం వెనుక విపక్షాల కుట్ర లేదు. ప్రభుత్వ కుట్ర ఉంది. ఆలయాల ధ్వంసం వెనుక ఏమతాల వారున్నారో ప్రభుత్వానికి తెలుసు. అందుకే అన్ని మతాలతో కలిపి కమిటీ వేశారు.