ఏపి ఫైబర్‌నెట్‌ను ముఖ్యమైన ఆదాయ వనరులుగా తీర్చిదిద్దుతా:డా.పి.గౌతమ్ రెడ్డి

575

మంత్రుల సమక్షంలో ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం…

నిజమైన కార్యకర్తలకు గుర్తింపునిస్తున్నాం… ప్రతి ఫలంగా ప్రభుత్వ పథకాలను ప్రజలోకి తీసుకువెళ్ళాలని కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవాణా శాఖ మంత్రి పేర్నినాని, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని), ప్రభుత్వ విప్ సామినేని ఉదయభానులు పేర్కొన్నారు. కార్యక్రర్తగా పార్టికి అంటి పెట్టుకుని ఉన్న డా. పూనూరు గౌతమ్ రెడ్డిని ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియామకమే ఇందుకు నిదర్శనంమన్నారు.

స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం ఏర్పాటు చేసిన ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రులు హాజరవ్వగా, పెడన శాసన సభ్యులు జోగి రమేష్ సభకు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా పంచాయితీ రాజ్ శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి మాట్లాడుతూ గౌతమ్ రెడ్డిని ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కీలకమైన బాధ్యాతలను అప్పగించడం జరిగిందన్నారు. కార్మికుల నాయకుడిగా కష్టించి పనిచేసే గౌతమ్ రెడ్డి ప్రభుత్వానికి ఉపయోగపడేలా సూచనలు, సలహాలు ఇచ్చి కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రాష్ట్రానికి ముఖ్యమైన ఆదాయ వనరులుగా ఏపి ఫైబర్ నెట్ కార్పొరేషన్‌ను తీర్చిదిద్దాలన్నారు.

ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా మాట్లాడుతూ వైఎస్ కుటుంబాన్ని నమ్ముకుని, ప్రజల కోసం నిస్వార్థంగా కష్టించి పనిచేసే కార్యక్రర్తకు గుర్తింపు వస్తుందనడానికి గౌతమ్ రెడ్డే నిదర్శనం అన్నారు. ఎపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సరైయిన వ్యక్తిని ముఖ్యమంత్రి నియమించడం జరిగిందన్నారు. ఆ పదవికి వన్నె తేవాలని అభినందించారు. రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ సంస్థను గౌతమ్ రెడ్డి ఒక గాడిలోకి తీసుకురావలని అన్నారు . ఈ వ్యవస్థను గాడిలో పెట్టడానికి ముఖ్యమంత్రి చక్కగా పనిచేసే వ్యక్తిని ఎంపిక చేశారన్నారు. పార్టిలో పనిచేసే కార్యక్రర్తల వల్లనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఆనాడు ఇచ్చిన హామిలని ఈ ప్రభుత్వం నేరవేరుస్తునందుకు కార్యక్రర్తలు గర్వపడాలన్నారు. రాష్ట్రంలో 31 లక్షల మంది పేదలకు సొంత ఇంటి కల నేరవేర్చుటతోపాటు, తెలతెలవారకుండానే పింఛన్లు ఇంటివద్దనే అందించడం జరుగుతోందన్నారు. గత ప్రభుత్వంలాగా కార్యక్రర్తలను దోచుకోనే వ్వవస్థ మనది కాదన్నారు. స్వార్ధం కంటే ప్రజల సంక్షేమమే ముఖ్యమని ఇవన్ని మనమిచ్చిన హామిలను నేరవేర్చినందుకు కార్యక్రర్తలు గర్వపడాలని వాటికి సామాజిక మాధ్యమలో ప్రచారం కల్పించాలని పిలుపునిచ్చారు.

దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.
ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను మాట్లాడుతూ ఎపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలలోకి చేరువు చేయలన్నారు. ఇందుకు ఈ మాధ్యమాన్ని విస్త్రత స్థాయిలో ప్రజలకు అందించాలన్నారు.

ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా గౌతమ్ రెడ్డి ప్రమాణ స్వీకారం:

ఏపి ఫైబర్‌నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సాంకేతిక సామాజిక విప్లవానికి నాంది పలికిన నాయకుడిగా వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి చర్రితలో నిలుస్తారన్నారు. కార్లమాక్స్, ఏంజెల్స్ లు సమాజ పరిణామ క్రమం గురించి తెలిపారన్నారు. అయితే వాటిని ఆచరణలోకి చూపిన నాయకుడు వైఎస్ జనగ్‌మోహన్ రెడ్డి అన్నారు. భవిష్యత్‌లో అందరికి ఇంటర్ నెట్ అవసరం ఉందన్నారు. గ్రామ గ్రామానికి ఏపి ఫైబర్‌నెడ్ కార్పొరేషన్ ద్వారా కేబుల్ టీవి ప్రసారాలు, ఇంటర్ నెట్, టెలిఫోన్ సేవలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరికి బేసిక్ ప్లాన్ ప్యాకేజిల్లో భాగంగా ఇంటర్‌నెట్, టెలిఫోన్ సేవలు ఉంచితంగా అందిస్తామన్నారు. తదుపరి ప్యాకేజిల్లో రూ.450 ప్లాన్‌లో 30 యంబిపిఎస్‌లు స్పీడ్, 300 జీబి అందిస్తామన్నారు. రూ.599 ప్లాన్‌లో అన్‌లిమిటేడ్ డేటా 50 యంబిపిఎస్‌లు స్పీడ్‌లో ఇంటర్‌నెట్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి 25 లక్షల కేబుల్ కనెక్షన్లు, 35 ప్రవేటు అపరేటర్ల డిటిహెచ్ కనెక్షన్లు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో ఏపి ఫైబర్ నెట్ ద్వారా 10 లక్షల కనెక్షన్లు ఉన్నాయని భమిష్యత్‌లో ప్రతి ఇంటికి గ్రామ గ్రామానికి సచివాలయల ద్వారా ఫైబర్ నెట్ సేవలు అందిస్తామన్నారు. గత ప్రభుత్వం హాయంలో దోచుకున్న వేలలక్షరూపాయల అవినితిని బయటపేటేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కష్టించి పనిచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని డా. పి. గౌతమ్ రెడ్డి హామి ఇచ్చారు.

అనంతరం కృష్ణాజిల్లా ఇన్‌ఛార్జీ మంత్రి, రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దరెడ్డి రామచంద్రరెడ్డి, ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, రవాణా శాఖ మంత్రి పేర్నినాని, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరావు (నాని), ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, పెడన శాసన సభ్యులు జోగి రమేష్, ఏపి ఫైబర్‌నెట్ యండి మధుసూదన్‌రెడ్డి, స్థానిక నాయకులు బొప్పన భవకుమార్, దేవినేని అవినాష్, అజరయ్య, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కెబుల్ టీవి అపరేటర్లు, ట్రేడ్ యూనియాన్ నాయకులు, కార్మికులు తదితరులు డా. గౌతమ్ రెడ్డిని ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు.