14 రోజులు రిమాండ్

1299

బోయినపల్లి కిడ్నాప్‌ కేసులో అఖిలప్రియ కస్టడీ ముగిసింది. ఈరోజు న్యాయమూర్తి నివాసంలో ఆమెను హాజరుపరిచారు. గాంధీ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి అఖిలప్రియను న్యాయమూర్తి ఇంటికి తీసుకు వెళ్ళారు బోయినపల్లి పోలీసులు. అయితే ఈ కిడ్నాప్ కేసుకు సంబంధించి అఖిలకు వ్యతిరేకంగా అన్ని ఆధారాలు పక్కాగా ఉండడంతో ఆమెకు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో ఆమెను చంచల్‌గూడా మహిళా జైలుకు తరలించారు పోలీసులు. అఖిలను 3 రోజుల పాటు విచారించిన పోలీసులు 300లకు పైగా ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. అసలు ఈ కిడ్నాప్‌ ఎలా జరిగింది ? ఎవరెవరు పాల్గొన్నారు ? ఎలా స్కెచ్‌ వేశారు ? కాస్టూమ్స్‌ నుంచి ఎస్కేప్‌ వరకు ఎలా వ్యూహం రచించారు ? ఈ విషయాలన్నీ బయటకొచ్చాయి. ఎవరు ఏ రోల్‌ పోషించారో తెలిసిపోయింది. ఇక భార్గవ్‌ రామ్‌, గుంటూరు శీనును పట్టుకోవడమే మిగిలింది. ఈ కిడ్నాప్ కేసులో భార్గవరామ్, మాదాల శ్రీను, చంద్రహాస్ ప్రధాన నిందితులుగా ఉండగా.. అఖిలప్రియ కీలకంగా వ్యవహరించారు.

7 COMMENTS