కబాలి, హుషారు, ఇస్మార్ట్ శంకర్, గద్దలకొండ గణేష్, ఇప్పుడు లేటెస్ట్ గా క్రాక్ వంటి సూపర్ హిట్ చిత్రాలను నైజాంలో పంపిణీ చేశారు.. కార్తికేయ ఎగ్జిబిటర్
నైజాం డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సినిమా అంటే పిచ్చి నాకు. మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సినిమాలు చూసి ఇన్
ఎందుకంటే నైజాంలో ధియేటర్స్ విషయంలో దిల్ రాజు, శిరీష్ రెడ్డి గుత్తాధిపత్యాన్ని పెత్తనాన్ని కొనసాగిస్తుంన్నారు. వారి నిరంకుశపాలనకి అడ్డుకట్ట వేసే దిశగా నా పోరాటం కొనసాగిస్తాను. ఎగ్జిబిటర్స్ ని బెదిరించి ధియేటర్స్ ఆక్యుపే చేసి డిస్ట్రిబ్యూటర్స్ అందర్నీ నానా ఇబ్బందులు పెడుతున్నారు. తన సినిమాకి ఒకలా బయట వాళ్ళ సినిమాకి ఇంకోలా చేస్తూ.. తన సినిమా పదివేలు కలెక్షన్ ఉంటే తీయవద్దు అంటాడు. పక్కోడి సినిమా లక్షరూపాయల కలెక్షన్ ఉంటే తీసివేస్తాడు. ఈరోజు మా క్రాక్ ఆడుతున్న మేజర్ సెంటర్స్ లలో 80 ధియేటర్స్ తీసివేసి మాస్టర్ మూవీకి ఇచ్చారు. క్రాక్ లాంటి హిట్ సినిమాకి శిరీష్ రెడ్డి కిల్ రాజు తన నియంతృత్వ ధోరణితో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మెయిన్ థియేటర్స్ లేకుండా చేశారు. అదేంటి అని అడిగితే రెస్పెక్ట్ లేకుండా ఎరా..పోరా అని పదిమందిలో అవమానించారు.
ఎంతో కాలంగా ఓపికతో వారి అరాచకాలను భరిస్తూ వచ్చాను. ఇక నాకు ఓపిక నశించి పోయింది. తెలంగాణ దిల్ రాజు జాగీర్ కాదు. మూడుపూటలు మేమె తినాలి అంటే కుదరదు. ఎదుటి వారికీ కూడా ఛాన్స్ ఇవ్వాలి. అందరూ బతకాలి. అందరికీ సమానంగా ధియేటర్స్ ఇవ్వాలి. అది వచ్చేదాకా నా పోరాటం ఆగదు. మా జోలికి రావద్దు. మా సినిమాలు వేసినా కూడా మాకు సరిపడే ధియేటర్స్ ఇవ్వండి అని నిన్ను బ్రతిమిలాడుకోవటం ఏంటి. నువ్వు నైజాం డిస్ట్రిబ్యూటర్వే నేను నైజాం డిస్ట్రిబ్యూటర్నే. నువ్వు నిర్మాతవే నేను నిర్మాతనే . రామానాయుడు , అశ్వినీదత్, అల్లు అరవింద్ గార్ల కంటే నువ్వు గొప్పోడివా ? నువ్వు ఇప్పటినుండి దిల్ రాజు కాదు కిల్ రాజువి. నిర్మాతలకు తప్పుడు లెక్కలు చూపించి కోట్ల రూపాయలు దోచుకుంటున్నావు వారిని నువ్వు చంపేస్తున్నావు . ఆ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. ఈ విషయం ఎవరో ఒకరు చెప్పాలి, గళం విప్పాలి అందుకే నేను ఈ రోజు ఈ విషయం చెబుతున్న. నీ దగ్గర డబ్బు ఉండొచ్చు కానీ నా దగ్గర డబ్బుతో పాటు నిజాయితీ ఉంది.
ఆ నిజాయితీతో దేనినైనా గెలవచ్చు అనేది నా సిద్ధాంతం. థియేటర్స్ ఓనర్స్ ను ఎగ్జిబ్యూటర్స్ ను గౌరవించవు. వారు నీ ముందు చేతులు కట్టుకొని నిల్చోవాలి. థియేటర్స్ ఓనర్స్ ని, మరియు లీజ్ దారులను బెదిరించి అతి తక్కువ రెంట్స్ ఇస్తూ.. నిర్మాతలకు ఎక్కువ రెంట్స్ చూపించి కోట్లు గడిస్తున్నాడు. ఇకనైనా లీజ్ దారులు, యజమానులు నా వెంట ఉంటే వారు అడిగే రెంట్లు ఇప్పిస్తానని హామీ ఇస్తున్నాను. సినిమాలు తెచ్చుకుంటాడు. థియేటర్స్ ఉన్నాయి కదా అని నిర్మాతల దెగ్గర సినిమాలను తెచ్చుకుంటాడు. బెదిరించి నువ్వు కొత్త డిష్టిబ్యూటర్స్ ను ఎదగనివ్వకుండా తొక్కేస్తావు ఎందుకంటే వారు నైజాం లో నీకంటే పై స్థాయికి వెళతారు కావున. అందుకే నువ్వు దిల్ రాజు కాదు కిల్ రాజు.
ఓయూ యూనివర్సిటీ అద్యక్షుడు సంపత్ నాయక్ మాట్లాడుతూ …. దిల్ రాజు, శిరీష్ అన్నలతో నాకు ఎప్పటినుండో పరిచయం ఉంది. అయితే శ్రీను అన్న తెలంగాణ బిడ్డ. మా యూనివర్సిటీ ఇంజినీరింగ్ విద్యార్థి. తను ఎంతో కష్టపడి కోట్ల రూపాయలతో క్రాక్ సినిమాని నైజాంలో రిలీజ్ చేశాడు. తనకి థియేటర్స్ ఇవ్వకుండా శిరీష్, దిల్ రాజు అన్యాయం చేయడమే కాకుండా, ఎరా, పోరా, వాడు, ఈడు, అని రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నారు.. టార్చర్ చేస్తున్నారు అని శ్రీను అన్నా చెప్పాడు. అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ మా విద్యార్థి సంఘాలు గళం విప్పుతాయి.. అంత పరిస్థితి రాకుండా వరంగల్ శ్రీను అన్నకు తగిన పరిష్కారం చేయాలి.. లేదంటే మేము ఈ విషయాన్ని ఎంతదూరం అయినా తీసుకెళతాం.. అన్నారు.