ఆ పాస్టరు – మోసంలో మాస్టరు

155

పేదలే వారి లక్ష్యం సారూ….

మిళనాడులోని వెల్లూరులో ఒక పాస్టర్ పిల్లల చదువుల నిమిత్తం స్కాలర్‌షిప్ ‌లు ఇప్పిస్తానని చెప్పి అనేకమంది రోజువారీ కూలీలను మోసం చేశాడు. రోజువారీ కూలీ కుమార్ కు, తన ఇద్దరు పాఠశాలకు వెళ్ళే పిల్లల విద్య కోసం ఆర్థిక సహాయం అవసరమైంది. అతను తన పిల్లలకు స్కాలర్‌షిప్ అందించగల ట్రస్ట్ గురించి విన్నాడు. దాంతో అతను ఆ ట్రస్ట్ నడుపుతున్న విక్టర్ జేసుదాస్ ను సంప్రదించాడు. కుమార్ పిల్లలకు స్కాలర్‌షిప్ ఏర్పాటు చేస్తానని విక్టర్ వాగ్దానం చేశాడు. అయితే దీనికి ₹ 20,000 ఖర్చవుతుందని చెప్పాడు. అందుకు సమ్మతించిన కుమార్ ఆ డబ్బు సమకూర్చి ఇచ్చాడు. అలాగే మరికొందరు రోజువారీ కూలీలను కూడా విక్టర్ దగ్గరకు తీసుకువచ్చాడు.

అందరూ విక్టర్ ‌కి ₹ 20,000 చెల్లించారు. కానీ ఎన్ని రోజులు గడచినా అతని నుండి స్కాలర్‌షిప్ డబ్బు గురించి ఎలాంటి సమాచారం రాలేదు. కుమార్ దాని గురించి ఆరా తీసినప్పుడు విక్టర్ అతనికి చెక్ ఇచ్చాడు. కానీ ఆ చెక్ బౌన్స్ అయ్యింది. కుమార్ మరలా డబ్బు అడగడానికి విక్టర్ దగ్గరకు వెళ్ళాడు. అయితే, విక్టర్, కుమార్ ‌ని బెదిరించాడు. అభ్యంతరకర పదజాలంతో దూషించాడు.

దాంతో కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేసి, విక్టర్ ‌పై చర్యలు తీసుకోవలసిందిగా డిఐజిని అభ్యర్ధించారు. పోలీసులు విక్టర్ పై దర్యాప్తు ప్రారంభించినప్పుడు విక్టర్ ద్వారా మోసపోయిన వారి అనేక సంఘటనల గురించి వారికి తెలిసింది.

అతను తన ట్రస్ట్ ద్వారా పిల్లలకు స్కాలర్‌షిప్పు‌లు, వృద్ధులకు పెన్షన్ లు, ఇళ్లకు ఋణాలు, భూమి, చిన్న వ్యాపారాలు, మహిళలకు టైలరింగ్ యంత్రాలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు మొదలైనవి ఇస్తానని ఆర్థికంగా బలహీనంగా ఉన్నవారికి వాగ్దానం చేస్తాడు. అతను కుమార్ దగ్గర్నుంచి తీసుకున్నట్లుగానే చాలా మంది నుండి డబ్బు వసూలు చేశాడు. ఆ విధంగా దాదాపు 2.27 లక్షల వరకూ మోసం చేసినట్లు చెబుతున్నారు.

ఇలాంటి సందేహాస్పద పద్ధతుల ద్వారా విదేశీ నిధుల నుండి సంపాదించాలనే ఆశతో FCRA ఖాతా తెరిచే మత ప్రచారకులు అనేక మంది ఉన్నారు. ఇలాంటి సంఘటనలు కూడా గణనీయంగానే ఉన్నాయి. గత ఏడాది అదే జిల్లాలో మరో పాస్టర్ యోబు శరవణన్ కూడా ఇలాంటి దుశ్చర్యకే పాల్పడగా అతనికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అతను కూడా ఒక ట్రస్ట్ నడుపుతూ, విదేశాల నుండి తనకు లభించే డబ్బు ద్వారా ఆర్థికంగా అట్టడుగున ఉన్నవారికి ఇళ్ళు నిర్మిస్తానని ప్రచారం చేశాడు. ఈ విషయంలో, అతను కొంతమంది ద్వారా 4 లక్షలను అందుకున్నాడు. అతను తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఇస్తానన్న డబ్బు అడిగినవారికి చెక్కులు ఇచ్చాడు. ఆ చెక్కులన్నీ బౌన్సయ్యాయి.

అలాగే మరో వ్యక్తి, కేరళకు చెందిన షిబు నాయర్, ఒక పాస్టర్ వలె నటించి, 2017 లో ఓఖీ తుఫాను సమయంలో ప్రభావితమైన మత్స్యకారుల కోసం ఇళ్ళు నిర్మిస్తానని చెప్పి ప్రజల నుండి డబ్బు వసూలు చేశాడు. అలాగే అనాథాశ్రమాన్ని కూడా నిర్మిస్తానాని చెప్పి లక్షలాది రూపాయల డబ్బు వసూలు చేశాడు.

2017 లో ఇదే విధమైన సంఘటనలో, మైఖేల్ అనే పాస్టర్ తన స్నేహితులు రవి స్టాన్లీ మరియు పిచముత్తులతో కలిసి ‘వివేహం’ అనే ఎన్జీఓను నడుపుతూ ఇళ్ళు నిర్మిస్తానని వాగ్దానం చేసి 250 మంది నుండి 50,000 చొప్పున 1 కోటి రూపాయలకు మించి వసూలు చేశారు. ప్రారంభంలో, అతను 20 మందికి ఒక్కొక్కరికి 1 లక్ష ఇచ్చాడు. ఇంకా డబ్బు వస్తుందనే ఆశతో వారు ఇళ్ళ నిర్మాణానికి పునాదులు కూడా వేసుకున్నారు. అయితే పాస్టర్ ఎఫ్‌సిఆర్‌ఎ డబ్బు లేదు, ఇసుక ధర పెరిగింది వంటి కారణాలను పేర్కొంటూ ఎక్కువ డబ్బు ఇవ్వలేదు.

స్థానిక దళిత పార్టీ VCK నేతృత్వంలో బాధిత ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. అతని ఆధ్వర్యంలో నడిచే అపోస్టలిక్ గాస్పెల్ మిషన్ చర్చికి తాళం వేశారు. అనంతరం అఖిల భారత మైనారిటీ ఫోరం నిర్వహించిన శాంతి సమావేశం గందరగోళం నెలకొనడంతో సదరు పాస్టరు, అతని సహచరులు పరారీలో ఉన్నారు.అనేక మిషనరీ సంస్థలు సమాజంలోని బలహీన వర్గాలను మత మార్పిడి కోసం ఆకర్షించడానికి మరియు డబ్బు సంపాదించడానికి మరియు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇటువంటి వాగ్దానాలను ఉపయోగిస్తాయి. ఉత్తర భారతదేశంలో, ప్రధానంగా పంజాబ్ ‌లో చాలా మంది మిషనరీలు ప్రజలను మార్చడానికి వాటర్ ప్యూరిఫైయర్‌లను వాగ్దానం చేసి పంపిణీ చేస్తారు.

అలాంటి కార్యకలాపాలను కొనసాగించే మిషనరీలు ఎందరో ఉన్నారు. ఉదాహరణకు, చెన్నైకి చెందిన అకార్డ్ ఛారిటబుల్ ట్రస్ట్… గిరిజనులు, ఈలం తమిళులు మరియు జానపద కళాకారులను లక్ష్యంగా చేసుకోవడానికి ఇలాంటి పద్ధతులను ఉపయోగిస్తుంది. ఈ వ్యక్తులు మైక్రో ఫైనాన్సింగ్ ద్వారా గిరిజనులకు సహాయం చేస్తారు. టైలరింగ్ షాపులు ఏర్పాటు చేయడం, కొవ్వొత్తులు, ఫినాల్, బ్లీచింగ్ పౌడర్ తయారీ మొదలైన చిన్న చిన్న వ్యాపారాలకు 5,000 మూలధనాన్ని అందిస్తారు.

వ్యాపారాన్ని విస్తరించడానికి వారు స్వయం సహాయక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. నిజాయితీగా అమలు చేస్తే ఇది ఒక గొప్ప ‌సేవగా అనిపించవచ్చు. అయితే, ప్రజలు ఏసును ప్రార్థించినందున మాత్రమే వారి సమస్యలకు సమాధానం లభించిందని చెప్పి అమాయక ప్రజలను మతం మార్చడానికే ఈ పద్ధతులు ఉపయోగిస్తున్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి.

-VSK ANDHRAPRADESH