గవర్నర్ జోక్యం చేసుకొని విశ్వవిద్యాలయాలు నిర్వీర్యం కాకుండా కాపాడాలి

405
  • విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించకుండా విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న కెసిఆర్
  • తెలంగాణ ప్రజల వేదన అరణ్య రోదనే
  • వెంటనే ఉపకులపతుల నియామకాలు చేపట్టడంలో గవర్నర్ చొరవ తీసుకోవాలి.
  • ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రసంగించిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్

ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఉస్మానియా యూనివర్సిటీ లో ఉస్మానియా టీచింగ్ అసోసియేషన్ ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాల ఆలస్యం అనే అంశం పై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో పాల్గొని ప్రసంగించారు.సర్వరోగాలకు జిందాతిలిస్మాత్ ఎలాగో తెలంగాణాలో ఉన్న సకల సమస్యలకు తెలంగాణ సాధనే అని నాలుగు కోట్ల మంది ప్రజలు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కేవలం ఒక కుటుంబం లోని నలుగురు మాత్రమే ఫలాలు దోచుకుంటున్నారని ఏ పని చేసిన తాను తన కుటుంబం మాత్రమే బాగుపడాలని ఆయన నిర్ణయాలు తీసుకుంటున్నారని ఎమ్మెల్యే లు,మంత్రులు,ఐఏఎస్ లు ఆ నిర్ణయాలకు డూడూ బసవన్నల్లా తలాడిస్తున్నారని బానిసల్లా ప్రవర్రిస్తూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.డెబ్భైవేల పుస్తకాలు చదివిన ముఖ్యమంత్రికి విష్వవిద్యాలయాలకు ఉపకులపతులను నియమించాలనే ఇంగితం లేకుండా పోయిందని అన్నారు.తెలంగాణ ఇపుడు దౌర్భాగ్య స్థితిలో ఉందని ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలిపోయిందని ప్రజలు సమస్యలు వినే నాధుడే లేడని  ప్రజల వేదన అరణ్య వేదన అయిందని పేర్కొన్నారు.ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకించే వారే లేకుండాపోయారన్నారు.కోర్టులను కూడా మ్యానేజ్ చేసే స్థితికి చేరుకున్నారని మీడియా అమ్ముడుపోయే స్థితిలో ఏక పక్షంగా వ్యవహరిస్తుందని అన్నారు.

సమాజం అభువృద్ది చెందాలంటే విద్య,వైద్య రంగాలకు నిధులు కేటాయిస్తే మంచి అభువృద్ది జరిగేదని 7 సంవత్సరాల కాలం లో నాలుగు లక్షల కోట్లు అప్పు తీసుకొచ్చి కమీషన్లకోసం మిషన్ భగీరథ,కాళేశ్వరం పైన పెట్టి వాటి పై కమీషన్లు పొందారని దుయ్యబట్టారు.అదే నిధులు విశ్వవిద్యాలయాలకు కేటాయిస్తే కమీషన్లు రావని  వ్యవస్థలు నిర్వీర్యం చేస్తున్నారని కెసిఆర్ ను తప్పుబట్టారు.

దొంగ సర్టిఫికెట్లు పెట్టి కళాశాలలు నడుపుతున్న వారు మనకు మంత్రులుగా ఉండడం మన దురదృష్టమని ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను బతుకించడానికి ప్రభుత్వ విశ్వవిద్యాలయాలని చంపేస్తున్నారని విశ్వ విద్యాలయాలు పట్టభద్రులని తయారుచేసే ఫ్యాక్టరీ లే కాకుండా సమాజానికి దశదిశ నిర్దేశ్యం చేసేనిలయాలని అన్నారు.
ప్రశ్నించకుండా బానిసకు ఒక బానిసను తయారు చేస్తున్నారు.

కెసిఆర్ 2014 ఎన్నికల ప్రచారం లో కెజి టు పీజీ ఒక విద్య పథకం పేరుతొ ఓట్లు దండుకొని పథకం మాట దేవుడెరుగు ఉన్న విద్యా విధానాన్ని తుంగలో తొక్కుతున్నారని తూర్పారబట్టారు.టీచర్ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని చాలా పాఠశాలల్లో టీచర్లే లేరని బడుగు,బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే ప్రభుత్వ పాఠశాలలు,జూనియర్ కాలేజీ,డిగ్రీ కాలేజీ లను అర్థాంతరంగా మూసివేసి కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.బడ్జెట్లో విద్యావ్యవస్తకు కేటాయిస్తున్న కేటాయింపులు లోన లొటారం పైన పటారం గా మారాయని కేటాయింపులే తప్ప నిధుల విడుదల చేసే ధైర్యం లేదని నిలదీశారు.

తెలంగాణ లో ఉన్న యూనివర్సిటీ లలో ఉస్మానియాలో 848 ఖాళీలు ఉండగా కాకతీయలో 295 ఖాళీలు ,తెలంగాణ యూనివర్సిటీ లో 75,మహాత్మా గాంధీ లో 115,శాతవాహన లో110,పాలమూరులో 130,పొట్టిశ్రీరాములు యూనిర్సిటీ లో 97,జె ఎన్ టీ యూ ఏచ్ లో232 ఖాళీలు,ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 4000 ఖాళీలు,ఎయిడెడ్ డిగ్రీ కాలేజీలో 1650,ప్రభుత్వ జూనియర్ కాలేజీలో5154 ఖాళీలు  వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేయడం లో కాలయాపన ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదని ప్రజాసంఘాలు,విద్యార్థి సంఘాలు ,యూనివర్సిటీ బోధనా సంఘాలు ఎన్ని సార్లు వినతిపత్రాలు సమర్పించిన కెసిఆర్ కు దున్నపోతు మీద వాన పడ్డ చందాన స్పందించడం లేదని యూనివర్సిటీ ఛాన్సలర్ హోదా లో గవర్నర్ కలుగ జేసుకొని వెంటనే నియామకాలు చేపట్టాలని గవర్నర్ ను దాసోజు శ్రవణ్ కోరారు.

మెడ మీద తలకాయ ఉన్నవాడు ఎవడైనా విశ్వవిద్యాలయాలకు ఉపకులపతులు లేకుండా చేయరని ఉపకులపతులు లేని విశ్వవిద్యాలయాలు తలలేని మొండెం లాంటివని పేర్కొన్నారు. తమ సమస్యల పరిష్కారానికి తనవంతు సహాయసహకారాలు అందిస్తానని
అంతే కాకుండా తమ పార్టీ తరఫునకుడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వదలిస్తే తాము తమ పార్టీ తరపున పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని శ్రవణ్ ఉస్మానియా యూనివర్సిటీ టీచింగ్ అసోషియేషన్ సభ్యులకు తెలియజేసారు.