పగబట్టిన భారతి బిడ్డ – షహీద్ ఉద్ధం సింగ్

0
2

1919 ఏఫ్రెల్ 13 పంజాబ్ లోని అమృతసర్ లో జలియన్ వాలాబాగ్ అనే చిన్నతోటలో రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా, శాంతియుతంగా సభ జరుపుకుంటున్న అమాయక ప్రజలపై జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో దాదాపు వెయ్యిమంది మరణించారు. రెండువేలమంది క్షతగాత్రులైనారు. ఇది అత్యంత ఘోరమైన సంఘటనగా చరిత్రలో మిగిలిపోయింది..

ఆ రోజు ఆ సభలో మంచినీరు సరఫరా చేయడానికి ఒక అనాథశరణాలయం నుండి 19 యేండ్ల కుర్రాడు వచ్చాడు.. జరిగిన దురంతం చూసి చలించిపోయాడు. నేలమీద పరుండి ప్రాణాలు కాపాడుకున్న ఆ కుర్రాడు శవాల గుట్టలను చూసి కోపంతో వణికిపోయాడు. కంటి నిండా నీరు ఉబికి వస్తుండగా ఆ తోటలోని రక్తం అంటిన మట్టిని తీసుకొని “ఈ దురంతానికి కారకుడైన వ్యక్తులను చంపేదాకా నేను చావను” అంటూ ప్రతిజ్ఞ చేశాడు.

దీనికి కారకులైన డయ్యర్స్ ను వెతుక్కుంటూ బయలుదేరాడు. తుపాకీ కాల్చడం నేర్చుకున్నాడు. కొన్నిరోజులు భగత్ సింగ్ తో కలిసి విప్లవ కార్యక్రమాలలో పాల్గొన్నాడు. డయ్యర్స్ లో ఒకరైన ఫ్రాన్సిస్ డయ్యర్ 1927లో భారత్ లోనే చనిపోయాడు. దానితో జనరల్ ఓ డయ్యర్ ను చంపేందుకు ఇంగ్లండ్ పయనమవ్వాలనుకుంటున్న సమయంలో భగత్ సింగ్ తో పాటు ఆయనను అరెస్ట్ చేశారు. తన కళ్ళ ముందే భగత్ సింగ్ ను ఉరితీయడం చూసి హతాశుడైనాడు. 1932లో విడుదలైన తర్వాత ఇంజనీరింగ్ చదవాలని ఇంగ్లండ్ పయనమైనాడు. పేరు మార్చుకుంటూ జనరల్ ఓ డయ్యర్ ను వెంటాడసాగాడు. దీనికోసం చాలా కష్టాలు పడ్డాడు. ఆకలితో నిద్రలేని ఎన్నో రాత్రులు గడిపాడు.

ఒక రోజు ఓ డయ్యర్ ఒక కాన్ఫరెన్స్ కు హాజరుకాబోతున్నట్లు సమాచారం అందిందతనికి. ఎంతో కష్టపడి ఎంట్రీ పాస్ సంపాదించాడు. ఒక పుస్తకంలో ఫిస్టల్ పట్టేటట్లు కాగితాలను కత్తించి అందులో దానిని దాచాడు..ఏమీ ఎరగనట్లు ఓ డయ్యర్ సభకు వెళ్ళాడు. సభలో ఓ డయ్యర్ ను వీరుడు,ధీరుడంటూ పొగిడేస్తున్నారు. అది వింటున్న ఆ యువకుడి రక్తం సలసల మరిగిపోసాగింది. జలియన్ వాలా బాగ్ లో అమాయకుల ఆర్తనాదాలు గుర్తొచ్చాయి. రక్తపు మడుగులో గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలు విడుస్తున్న అభాగ్యులు గుర్తుకొచ్చారు. ఇంతలో డయ్యర్ ప్రసంగం ముగిసింది. సభికులు ఆయనను అభినందించాడానికి ఆయన దగ్గరకు వెళుతున్నారు. ఆ యువకుడు కూడా గంభీరంగా లేచి పుస్తకం చేతబట్టుకొని డయ్యర్ దగ్గరకు వెళుతున్నాడు. నిశితంగా గమనిస్తున్న ఓ డయ్యర్ ఆ యువకుడి వేషధారణను చూసి ఏదో గుర్తుకొస్తున్నట్లు అనిపించి అప్రమత్తమయ్యే లోపలే పుస్తకంలోని పిష్టల్ మెరుపువేగంతో తీయడం, అంతే వేగంతో ఓ డయ్యర్ పై గుళ్ళ వర్షం కురిపించడం జరిగిపోయింది. జనరల్ ఓ డయ్యర్ నేలకొరిగాడు. ఎవరినైతే నా బానిసలు, వారి ప్రాణాలు నేను పెట్టిన బిక్ష అంటూ జలియన్ వాలాబాగ్ కాల్పుల తర్వాత గర్వంగా అన్నాడో, ఆ సంఘటనలోని వ్యక్తి చేతిలోనే ప్రాణాలు విడిచాడు. ఇది 1940 జూలై 31 న జరిగింది.

ఓ డయ్యర్ ను చంపిన తరువాత “ఈయనను చంపడానికే నేను ఇన్నిరోజులు బతికాను. ఇంక నన్ను ఏమైనా చేసుకోండి” అంటూ లొంగిపోయాడా యువకుడు. ఇంతకీ ఆ యువకుడి పేరేమిటో తెలుసా? షంషేర్ ఉద్దామ్ సింగ్ . ఆ విప్లవవీరుడిని ఉరి తీశారు.

“జోహార్ ఉద్దాం సింగ్ …జోహార్”

-VSK ANDHRAPRADESH

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here