ప్రార్థన మందిరాలపై జరుగుతున్న వ్యవహారం అత్యంత బాధాకరం

428

రాజకీయ పార్టీలకు రాజకీయ నాయకులకు దేవాలయాలు ప్రార్థన మందిరాలుపై రాజకీయం చేయడం చాలా దారుణం .ఈ భారతదేశంలో  హిందువుల రాజులు ముస్లిం సుల్తానులు పరిపాలించారు. వారు భక్తితో దేవుడు మీద భయంతో నిత్యం పూజలు చేసుకుంటూ దేవుని ఆరాధిస్తూ ఆ దేవుని నైవేద్యం కోసం దీపం వెలిగించడం కోసం పూజలు నిర్వహించే పూజారులకు వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యం కోసం వందల ఎకరాలు దేవుడి పేరుమీద దానం చేయటం జరిగింది.

వారు దానం చేసిన ఆస్తుల పరిరక్షణకు హిందూ సమాజ హితం కోసం దేవాదాయ శాఖ ముస్లిం సమాజ హితం కోసం మైనారిటీ శాఖ ఏర్పాటు చేయడం జరిగింది. ఆనాడు వారు భక్తితో  ప్రేమతో  దేవుడి పేరుమీద ఆస్తులను భూములను అందిస్తే ఇవాళ పరిపాలిస్తున్న పాలకులు దేవుడి మాన్యాలు ఆస్తులు కాజేస్తున్నారు. ప్రార్థనా స్థలాల్లో ఉండే  హుండీ సైతం మింగేస్తున్నారు.
ఉదాహరణకు కు వక్ఫ్ భూములు  పూర్తిగా ఎక్కడ ఏ గ్రామంలో చూసినా అన్యాక్రాంతం గురి అయి ఉన్నవి దేవుడి మీద ప్రేమతో దేవుడు ఆశీస్సులతో దేవుడి పేరుమీద ఆస్తులు భూములు ఇచ్చిన పాలకులు ఆనాడు వందల సంవత్సరాలు పరిపాలించారు.

కానీ ఇప్పుడు ఐదు సంవత్సరాల కాలం ప్రభుత్వం ఉంటుందో లేదో తెలియని అయోమయం. ఇవాళ ఉన్న రాజకీయం ఇవాళ ఉన్న పార్టీల పరిస్థితి కారణం ఏమిటంటే దేవుడంటే భక్తీ లేదు భయం అంతకంటే లేదు .ఎంత దురదృష్టమైన పరిస్థితి అంటే వీళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఎంతో ఆప్యాయంగా కులమతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా బతుకుతున్న అటువంటి ఆంధ్రరాష్ట్రంలో దేవాలయాలను ప్రార్థనా మందిరాలను  అడ్డం పెట్టుకొని అరాచకం చేయాలని  విద్వేషాలు రెచ్చగొట్టాలని చూడటం చాలా ఘోరం అత్యంత బాధాకరం.

ఏ రాజకీయ పార్టీ అయినా ఏ మనిషైనా దేవుడు ఆశీస్సులు అల్లాహ్ ఆశీస్సులు ప్రభు ఆశీస్సులు ఉండాలని కోరుకోవాలి తప్ప రాజకీయ పార్టీలైన దేవుడి ఆశీస్సులతో రాజకీయంలో రాణించాలని కోరుకోవాలి గాని దేవుని రాజకీయం చేయడం అనేది నీచమైన నీచాతి నీచమైన రాజకీయం ఇలాంటి దుష్ట శక్తుల నుండి ప్రజలు ఎ గ్రామానికి ఆ గ్రామం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఇలాంటి రాజకీయాలు ఇలాంటి ఇ దుష్టశక్తుల తో మన గ్రామాలను మనమే కాపాడుకోవాలి.

మన గ్రామాలలో  అన్నదమ్ములుగా బతుకుతున్న మంచి సాంప్రదాయంతో ఉన్నటువంటి మన సమాజంలో ఇలాంటి చీడ పురుగులు ఉండి మన గ్రామాలలో ఉన్న మనుషులను మందిరాలను మసీదులను చర్చలను దర్గా లను మన పవిత్రమైన ప్రార్థనా మందిరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిమీద ఉందని తెలియజేస్తున్నాను.

 Sufi Hajarat Mohammad Altaf Ali Raza,
 Chairman, Hajarat Sayyad Sha Bukhari Sharif,
 Kondapalli, Krishna District. 9848334075.