తొలి విడతలో 9 ఆలయాల నిర్మాణాలకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన
రూ.70 కోట్లతో దుర్గ గుడి అభివృద్ధి..విస్తరణ పనులకు భూమి పూజ
తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితం ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది.విజయవాడలోని దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను సీఎం వైయస్ జగన్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్కు దుర్గ గుడి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులు వెలంపల్లి శ్రీనివాస్, బోత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రక్షణ నిధి, వంశీ, దేవినేని అవినాస్ తదితరులు పాల్గొన్నారు.