జగన్ బైబిల్ సూచించే మార్గాలను పాటించని ఒక ఫేక్ క్రిస్టియన్

1
4

– టీడీపీ జాతీయ అధికారప్రతినిధి  కొమ్మారెడ్డి పట్టాభిరామ్
రామతీర్థం ఘటనజరిగిన మరుసటిరోజు, విజయనగరం జిల్లా పర్యటనకు  వెళ్లిన ముఖ్యమంత్రికి, రామతీర్థం సందర్శనకు వెళ్లడానికి పదినిమిషాల సమయంకూడా లేకపోయిందని, అటువంటి వ్యక్తికి ఒక్కసారిగా హిందూధర్మంపై, దేవాలయాలపై ఎనలేని ప్రేమపుట్టుకొచ్చిందని, టీడీపీ జాతీయఅధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవాచేశారు. శుక్రవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు హిందూమతానికి వ్యతిరేకంగా 140కిపైగా ఘటనలుజరిగితే, కోట్లాదిమంది హిందువుల మనోభావాలు గాయపడుతుంటే, తనకేబినెట్ లోని మంత్రులు హిందువుల మనోభావాలు దెబ్బతినేలా నోరుపారేసుకుంటుంటే ఏనాడూ నోరు తెరవని ముఖ్యమంత్రికి అకస్మాత్తుగా హిందూధర్మంపై ప్రేమ పుట్టు కురావడం విచిత్రంగా ఉందన్నారు. రామతీర్థం ఘటన తనప్రభుత్వ వైఫల్యమని, భవిష్యత్ లో అటువంటి ఘటనలుజరగ కుండా చూసుకుంటాననే మాటచెప్పలేని ముఖ్యమంత్రి, విజయవాడలో తొమ్మిదిఆలయాలను పునర్నిర్మిస్తానని చెప్పడం విచిత్రంగా ఉందని పట్టాభి తెలిపారు. ఒకప్రత్యేక వేషధారణతో, జగన్మోహన్ రెడ్డి హిందూదేవాలయాల నిర్మాణ కార్యక్రమం చేపట్టి నంతమాత్రాన ఆయన్ని ప్రజలెవరూనమ్మేస్థితిలో లేరన్నారు. విజయవాడలో  జరుగతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా, కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణంలో భాగంగా కొన్ని ప్రార్థనామందిరాల ను తొలగించాల్సిన పరిస్థితి గతప్రభుత్వానికి ఏర్పడిందన్నారు.

ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు తిరిగి దేవాల యాలన్నింటినీ ప్రభుత్వమే  నిర్మిస్తుందని స్పష్టంచేయడం జరిగిం దన్నారు. రోడ్లనిర్మాణం, వెడల్పు ప్రక్రియలో దేశవ్యాప్తంగా అనేకచోట్ల ప్రార్థనామందిరాలను తొలగించడం, తిరిగి నిర్మించడం అనేది జరుగుతూనే ఉంటుందన్నారు. కానీ నేడురాష్ట్రంలో కుట్రపూ రితంగా హిందూదేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, రామతీర్థంలో రాములవారి శిరస్సుఎందుకు తొలగించబడిందో, అక్కడెలాంటి అభివృద్ధిపనులు జరుగుతున్నాయో చెప్పాలని పట్టాభి  డిమాండ్ చేశారు. అంతర్వేదిలో, పిఠాపురంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుగాయో చెప్పాలన్నారు. ఏ అభివృద్ధి కార్యక్రమం జరుగుతోందని రాజమహేంద్రవరంలో సుబ్రహ్మణ్యస్వా మి విగ్రహాన్ని ధ్వంసంచేశారన్నారు.

విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలు తగలబెట్టడం, దేవాలయాలనుకూల్చడమనేవి కుట్రపూరి తంగానే జరుగుతున్నాయనే నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గ్రహించా లన్నారు. జగన్మోహన్ రెడ్డికి నిజంగా హిందూ మతంపై, దేవాల యాలపై గౌరవముంటే, ఆయన ముందుగా వెళ్లాల్సింది అమరావ కి అని పట్టాభి స్పష్టంచేశారు. రూ.150కోట్ల వ్యయంతో, రాజధాని లో తలపెట్టిన వేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణాన్ని జగన్మోహన్  రెడ్డి ఎందుకుఆపేశాడో సమాధానం చెప్పాలన్నారు. హిందువుల మనోభావాల పట్ల జగన్ కు ఏమాత్రం గౌరవమున్నా, విజయవాడ లో డ్రామాలు ఆడటం ఆపేసి, ఆయన తక్షణమే అమరావతికి వెళ్లి, వేంకటేశ్వరస్వామి నిర్మాణాన్నితిరిగి ప్రారంభించాలని పట్టాభి డిమాండ్ చేశారు. రాజధానిలో  శ్రీవారి ఆలయనిర్మాణం చారిత్రాత్మ కమని, చంద్రబాబునాయుడు శంఖుస్థాపన చేశారని జగన్మోహన్ రెడ్డి గెజిట్ పత్రిక సాక్షిలో రాసినవారు, ఆ ఆలయనిర్మాణాన్ని ఎందుకు ఆపేశారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పగటి వేషగాడిలా విజయవాడలో నాటకాలు ఆడితే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరన్నారు.

హిందూమతాన్ని కాపాడే వ్యక్తే అయితే,  ముఖ్యమంత్రి కృష్ణా-గోదావరి సంగమప్రదేశంలో జరిగే పవిత్ర హరతుల కార్యక్రమాన్ని ఎందుకు నిలుపుదల చేశాడో  చెప్పాల న్నారు.  జగన్మోహన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి హిందూధర్మంపై అభిమానముంటే, తక్షణమే నేటిసాయంత్రంనుంచే హరతులిచ్చే కార్యక్రమాన్ని వెంటనేప్రారంభించాలని పట్టాభి డిమాండ్ చేశారు.  చేయాల్సిన దుర్మార్గాలన్నీ ఒకవైపు చేస్తూ, ఇప్పుడు హిందూ  ధర్మాన్ని కాపాడేవాడిలా ముఖ్యమంత్రి విజయవాడలో నాటకాలు ఆడుతున్నాడన్నారు. విజయవాడవాసిగా, దేవాదాయశాఖ మంత్రిగా ఉన్నందుకు ఊసరవెల్లి వెల్లంపల్లి శ్రీనివాస్ నిజంగా సిగ్గుపడాలన్నారు.

04-07-2019న దేవాదాయభూములను ఇళ్లపట్టాలకోసం లాక్కునేలా ప్రభుత్వం జీవోఎందుకుఇచ్చిందో సమాధానం చెప్పాలన్న పట్టాభి,  తక్షణమే ఆజీవోను రద్దుచేసి, ఇళ్లపట్టాలకు ఇచ్చిన దేవాదాయభూములను వెనక్కు తీసుకోవాలన్నారు. దేవా దాయశాఖకు చెందిన సెంటు భూమిని కూడాప్రభుత్వం తీసుకోదని ఈరోజే తిరిగి జీవో ఇవ్వాలన్నారు. నా ప్రభుత్వంలో దేవాదాయ భూమిని అంగుళంకూడా తీసుకోమని ముఖ్యమంత్రి చెప్పగలరా అన్నారు. జెరూసలేం వెళ్లే క్రైస్తవులకు, మక్కా వెళ్లే ముస్లింలకు సాయం చేసినట్లుగానే, చంద్రబాబునాయుడు హిందువులకోసం తీసుకొచ్చిన దివ్యదర్శనం పథకాన్ని జగన్ ప్రభుత్వం ఎందుకు రద్దుచేసిందో చెప్పాలన్నారు. హిందువులు దేవాలయాలను దర్శిం చుకోవడం ఈప్రభుత్వానికి ఇష్టంలేదుకాబట్టే పథకాన్ని రద్దుచేసిం దన్నారు.

జగన్మోహన్ రెడ్డినిజంగా  ఆలయాలు నిర్మించేవాడే అయితే, తక్షణమే దివ్యదర్శనం పథకాన్ని తిరిగిప్రారంభించాలన్నా రు.  పేదబ్రాహ్మణులకోసం చంద్రబాబునాయుడి ప్రభుత్వం బ్రాహ్మణకార్పొరేషన్ ద్వారా అమలుచేసిన గాయత్రీ విద్యాప్రశస్తి పథకం, భారతీ విద్యాపథకం, భారతీ విదేశీపోస్ట్ గ్రాడ్యుయేషన్ పథకం, చాణక్య, వేదవ్యాస, వశిష్ట వంటి పథకాలను జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే ఎందుకు ఆపేశాడో చెప్పాలన్నారు.  పేద బ్రాహ్మణులకు సాయంచేయడం, బ్రాహ్మణ విద్యార్థులు విదేశాలకెళ్లి చదువుకోవడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టంలేదు కాబట్టే, ఆ పథకాల ను రద్దుచేశాడన్నారు.  తక్షణమే ఆ పథకాలన్నింటినీ ప్రారంభిం చాలన్నారు.దేవాదాయశాఖకు చెందిన రూ.144కోట్ల నిధులను ఇతరపథకాలకు  దారిమళ్లిస్తూ,  జీవో ఇచ్చింది (జీవోనెం-18,- 06-01-2020న) జగన్ ప్రభుత్వం కాదా అన్నారు. దేవాదాయశాఖ కుచెందిన నిధులను, బ్రాహ్మణ కార్పొరేషన్ నిధులను దోచుకన్న వారు దేవాలయాల గురించి ఎలా మాట్లాడతారని పట్టాభి ప్రశ్నం చారు.

రాష్ట్రవ్యాప్తంగా హిందూమతంపై 140కుపైగా దాడులు జరిగితే పట్టించుకోకుండా, రాజధానిలో వేంకటేశ్వరస్వామి నిర్మాణ ఆలయాన్ని నిలిపివేసి, పవిత్రసంగమంలో జరిగే హారతులకు మంగళంపాడి, దేవాలయాలభూములను ఇళ్లస్థలాల పేరుతో అన్యాక్రాంతంచేసిన ముఖ్యమంత్రికి నేడు హిందూధర్మం గుర్తుకు రావడం విచిత్రంగా ఉందన్నారు. ఇవన్నీ చేశాకే జగన్మోహన్  రెడ్డి దేవాలయాల నిర్మాణం గురించి మాట్లాడలన్నారు. హిందూధర్మా నికి, హిందువులకు వ్యతిరేకంగా చేయాల్సిన పనులన్నీ చేసేసిన ముఖ్యమంత్రిని ప్రజలందరూ హిందూద్రోహిగా చూస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తనవీధినాటకాలనుకట్టిపెట్టి, తాను చేయమన్న పనులన్నీ చేస్తేమంచిదని పట్టాభి హితవుపలికారు.

జగన్మోహన్ రెడ్డి హిందూద్రోహే కాదు, నిజమైన క్రైస్తవుడు కూడా  కాదు
జగన్మోహన్ రెడ్డి హిందూద్రోహిగా మిగిలినా, నిజమైన క్రైస్తవుడిలా కూడా ఆయనెప్పుడూ వ్యవహరించలేదన్నారు. సొంత చిన్నాన్న ను దారుణంగా బాత్రూమ్ లో చంపేయమని ఏ బైబిల్ చెప్పిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు. పేదవాడి భూములను దౌర్జన్యంగా లాక్కోమని, దళితులపై దాడులుచేయమని, వేలకోట్ల రూపాయల ప్రజలసొమ్ముని స్వాహా చేయమని, అడ్డగోలుగా అవినీతిచేయమని జగన్మోహన్ రెడ్డికి ఏ బైబిల్ గ్రంథం చెప్పిందో చెప్పాల న్నారు.  దళితఎంపీ చనిపోతే, ఆయన కుటుంబాన్ని పరామర్శించవద్దని ఏ మతగ్రంథం చెప్పిందో చెప్పాలన్నారు. జగన్మోహన్ రెడ్డి తనచేష్టలు, చర్యలతో ఫేక్ క్రిస్టియన్ అని తేలిపోయిదన్నారు.  కేవలం రాజకీయంకోసమే, ఆయన, ఆయన కుటుంబం క్రిస్టియన్ల ముసుగు వేసుకుందన్నారు.

జగన్మోహన్ రెడ్డి నిజమైన క్రైస్తవుడయితే, ఆయన దోచేసిన సొమ్ముతో జీసస్ పేరుతో జిల్లాకొక ఆసుపత్రి ఏర్పాటుచేసి, ప్రజలకు ఉచితవైద్యసేవలు అందించాలనే ఆలోచన ఆయనకు ఎందుకు కలగడం లేదన్నారు.  జగన్ బావ బద్రర అనిల్ తన సంస్థపేరుతో ఎన్ని సేవాకార్యక్రమాలు చేశాడో చెప్పాలన్నారు. అనేక క్రైస్తవసంస్థలు రాష్ట్రంలో విరివిగా సేవాకార్యక్రమాలు అమలు చేశాయని, లయోలా కాలేజీకి తమ కుటుంబం కూడా భూమి ఇచ్చిందని పట్టాభి తెలిపారు. గతంలో హిందువులు, క్రైస్తవులు కలిసిమెలిసే జీవించారని, జగన్ అధికారం లోకి వచ్చాకే వారిమధ్య స్పర్థలు రాజేశాడన్నారు. జగన్ తీరుతో నిజమైన క్రైస్తవులంతా బాధపడుతున్నారని, మతం ముసుగులో ఆయన చేస్తున్నపనులతో వారుకూడా విసిగివేసారిపోయారన్నారు. హిందువులు, క్రైస్తవులతోపాటు జగన్ ముస్లిం మైనారిటీలను కూడా వదల్లేదన్నారు.

నంద్యాలలో అబ్దుల్ సలాం, రాజమహేంద్ర వరంసమీపంలో అబ్దుల్ సత్తార్ కుటుంబాలు ఏమయ్యాయో అందరికీ తెలుసునన్నారు. జగన్ కారణంగా ఎన్ని ముస్లిం కుటుంబాలు రోడ్డునపడ్డాయో చెప్పాల్సిన పనిలేదన్నారు. ఏవర్గాన్ని, ఏమతాన్ని వదిలిపెట్టకుండా దుర్మార్గంగా, కిరాతకంగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికీ ఫేక్ క్రిస్టియనే అని పట్టాభి తేల్చిచెప్పారు. జగన్మోహన్ రెడ్డి నిజంగా హిందూధర్మాన్ని అభిమానించేవాడయితే, రాజధానిలో వేంకటేశ్వరస్వామి నిర్మాణా న్ని ప్రారంభించాలని, దివ్యదర్శనంసేవలను, పవిత్రహర తుల కార్యక్రమాన్ని వెంటనే అమలుచేయాలని పట్టాభి డిమాండ్ చేశారు.  దేవాదాయశాఖ నిధులను దారిమళ్లించమని, బ్రాహ్మణు లకు గతప్రభుత్వం అమలుచేసిన పథకాలను, తమప్రభుత్వం కూడా అమలుచేస్తుందని జగన్మోహన్ రెడ్డి బహిరంగంగా స్పష్టం చేయాలన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలపై జరిగిన దాడులకు సంబంధించి ఒక్కరినికూడా తనప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేయలే క పోయిందో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలన్నారు. హిందువు ల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన కొడాలినానీని మంత్రివర్గం నుంచి తొలగించాకే, జగన్మోహన్ రెడ్డి ఆలయాలనిర్మాణం గురించి మాట్లాడాలన్నారు. తెలుగుదేశంపార్టీ ఎప్పుడూ మతాలకోసం పని చేయలేదని, మతసామరస్యంకోసమే పాటుపడిందని పట్టాభి స్పష్టంచేశారు.  తాను లేవనెత్తిన అంశాలపై హిందువులు, క్రైస్తవు లు జగన్మోహన్ రెడ్డిని నిలదీసి, ఆయనకు తగినవిధంగా బుద్ధి చెప్పాలని పట్టాభి పిలుపునిచ్చారు.

1 COMMENT

  1. Ι think this is one of the most vital info for me. And i am
    ցlad reading your article. But wanna remark on some
    general things, The ѡebsite style iѕ perfect, the articles is
    really nice : D. Good job, cheers

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here