పెరుగుతున్న బాబు తప్పులు!

126

 ( వై.వి.రెడ్డి, పొలిటికల్ అనలిస్ట్ ) 

మహాభారతం గురించి తెలియని వారుండరు. ఉగ్గుపాలతోపాటే మన అమ్మ మనకు మహాభారత, రామాయణ, భాగవతాలు గురించి చెబుతారు. మహాభారతంలో శిశుపాలుడు ఉంటాడు. దమఘోషుడు, సాత్వతిలకు జన్మించినవాడే  శిశుపాలుడు. శిశుపాలుడు పుట్టడంతోనే నాలుగు చేతులు, మూడు కనులతో పుడుతాడు. దీంతో దమఘోషుడు, సాత్వతి కలత చెందుతారు. ఎవరైతే శిశుపాలుడిని ఎత్తుకున్నప్పుడు సాధారణ  సాధారణ రూపం శిశుపాలుడు ధరిస్తాడో అతని చేతిలో మీ కుమారుడు హతమవుతాడు అని ఆకాశవాణి పలుకుతుంది. దీంతో ఇంటికి ఎవరొచ్చినా ధమఘోషుడు, సాత్వతి తమ బిడ్డను వారి చేతికి ఇచ్చేవారు. కానీ..శిశుపాలుడికి సాధారణ రూపం వచ్చేది కాదు. ఓ రోజు  బలరామకృష్ణులు సాత్వతి ఇంటికి వస్తారు. అందరికీ ఇచ్చినట్లుగానే తమ బిడ్డను శ్రీకృష్ణుడు చేతికి ఇస్తారు దమఘోషుడు – సాత్వతి దంపతులు. శిశుపాలుడికి సాధారణ రూపం వస్తుంది. దీంతో ఒక పక్క సంతోషం, మరో పక్క ఆందోళన చెందుతారు ధమఘోషుడు – సాత్వతి.

శ్రీకృష్ణుడి చేతిలో తమ కుమారుడికి మరణం తప్పదని గ్రహించిన సాత్వతి శిశుపాలుడిని చంపవద్దని ప్రాధేయ పడుతుంది. దీంతో..వంద తప్పులు చేసే వరకు శిశుపాలుడిని  క్షమిస్తానని శ్రీకృష్ణుడు సాత్వతికి హామీ ఇస్తాడు. ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే  రాజకీయ నాయకుడి ముసుగు వేసుకుని పాలకుడి అవతారమెత్తిన చంద్రబాబు 40 ఏళ్ల పాపాలను ప్రజలు లెక్క పెడుతున్నారు. దేవుడి గుళ్ల మీద దాడులతో చంద్రబాబు పాపాలు పరాకాష్టకు చేరుకున్నాయని ప్రజలు అనుకుంటున్నారు.

చంద్రబాబు రాజకీయ చరిత్ర చూసినప్పుడు ఓ రకంగా గర్వంగా ఉంటుంది. మరో రకంగా ఛీదర పుడుతుంది. గర్వంగా ఎందుకు ఉంటుంది అంటే..చాలా పేద కుటుంబం నుంచి రాజకీయాల్లో అత్యున్నత దశకు చంద్రబాబు చేరుకున్నారు. ఇది ప్రజాస్వామ్య గొప్పదనం అనొచ్చు,  చంద్రబాబు తన  రాజకీయ జీవితంలో వేసిన ఎత్తులు, జిత్తులు అనొచ్చు. మరో వైపు ఛీదర ఎందుకు పుడుతుంది అంటే నమ్మిన వాళ్లను నమ్మకంగా ఉండి వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబును చూసే నేర్చుకోవాలి. రోమ్ చరిత్రలో సీజర్‌ను బ్రూటస్‌ వెన్నుపోటు పొడిచినట్లు …పిల్లనిచ్చిన  మామ ఎన్టీఆర్‌నే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పీఠాన్ని ఆక్రమించుకున్న  రాజకీయ కుటిలుడు చంద్రబాబు.

వేంకటేశ్వర  యూనివర్శిటీ నుంచే చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలకు, ఏమార్చే రాజకీయాలకు పెట్టింది పేరు. చంద్రబాబు సామాజిక వర్గం అధికంగా ఉండే  వెంకటేశ్వర యూనివర్శిటీలోని ఎకనామిక్స్‌ డిపార్ట్మెంట్ నుంచే చంద్రబాబు రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. వెంకటేశ్వర యూనివర్శిటీలో విద్యార్ధి నాయకుడిగా  జిల్లా కాంగ్రెస్‌ నేతలతో పరిచయాలు పెంచుకున్నారు. ఇక్కడ నుంచే తన రాజకీయ మేడలకు మెట్లు కట్టుకోవడం చంద్రబాబు ప్రారంభించారు .    కులం కార్డుతో మొదటి నుంచి రాజకీయాలు చేసిన చంద్రబాబు ..ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి సీఎం అయిన తరువాత కూడా  కుల రాజకీయాలనే నమ్ముకున్నారు. చరిత్రలో చాలా మంది రాజులు రెండు రకాల పాత్రలు పోషిస్తారు. ఒకటి సింహాసనం అధిష్టించక ముందు ఒకలా, సింహాసనం అధిష్టించిన తరువాత మరోలా. సింహాసనం కోసం ఎన్ని అకృత్యాలకైనా పాల్పడే వారు సింహాసనం సొంతమైన తరువాత కుల,మత, ప్రాంతాలకు అతీతంగా పాలన చేసిన సందర్భాలు మనం చరిత్రలో చూశాం. కానీ..చంద్రబాబు నాయుడు మాత్రం  మామ ఎన్టీఆర్‌ నుంచి సీఎం సీటు లాక్కోవడానికి ఎటువంటి కుటిల ప్రయత్నాలు చేశారో, సీఎం అయిన తరువాత సీటు మీద ఉండటానికి అటువంటి  కుటిల విధానాలనే అనుసరించారు. వాడుకుని వదిలేయడంలో సమకాలిన రాజకీయాల్లో  చంద్రబాబును మించినవారు లేరనేది వాస్తవం.

చంద్రబాబు జీవిత చరిత్ర తెలుగు నాట ప్రజలకు కళ్లకు కట్టినట్లు తెలుసు.  గ్రామాల్లో చిన్న పిల్లవాడిని అడిగినా మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి  సీఎం కుర్చీని ఆక్రమించాడు ఆయనే కదా అంటారు.
అంతగా..చంద్రబాబు వెన్నుపోటు చరిత్ర ప్రజల్లోకి దూసుకెళ్లింది. చంద్రబాబు సీఎం కాకముందు కూడా రాజకీయంగా ఎదగడానికి, వేంకటేశ్వర యూనివర్శిటీ విద్యార్ధి రాజకీయాల్లో నెట్టుకురావడానికి చాలా తప్పులు చేసి ఉండొచ్చు . చంద్రబాబు తప్పులు కౌంట్ అవుతుంది మాత్రం మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచినప్పటి నుంచే. సాత్వతికి శ్రీకృష్ణుడు  నూర తప్పులు చేసే వరకు క్షమిస్తానని వరమిస్తాడు.

ఆ నూరు తప్పులు  కూడా ఎలాంటివో శ్రీకృష్ణుడు సాత్వతికి చెబుతాడు. “అర్హమైన వంద తప్పులు చేసే వరకు శిశుపాలుడిని క్షమిస్తాను”అని శ్రీకృష్ణుడు తన మేనత్త సాత్వతికి మాట ఇస్తాడు. కాబట్టి చంద్రబాబు అర్హమైన మొదటి తప్పు చేసింది మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడవటంతోనే. ఆ మానసిక వ్యధతోనే ఆయన ప్రాణాలొదిరారు అనేది అందరూ చెప్పుకునే మాట. కాబట్టి చంద్రబాబు మొదటి అర్హమైన తప్పు పిల్లనిచ్చి, రాజకీయంగా ఎదగడానికి సహాయపడిన మామ ఎన్టీఆర్‌ను నమ్మించి పదునైన రాజకీయ కత్తితో వెన్నుపోటు పొడవటం. తరువాత ..వ్యవస్థల్లో తన మనుషులను అడ్డుపెట్టుకుని, మేనేజ్‌ చేసి టీడీపీ జెండా లాక్కోవడం, టీడీపీ ఖాతాలో ఉన్న డబ్బులు ఎన్టీఆర్‌కు వెళ్లకుండా చేయడం, తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు, బామర్ధి హరికృష్ణలకు ఇచ్చిన మాట తప్పడం. వీటి దగ్గరి నుంచి చంద్రబాబు చేసిన తప్పులను తెలుగు నాట ప్రజలు లెక్క పెడుతూనే ఉన్నారు.

ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయినప్పటి నుంచి ఆయన అవినీతికి అంతులేకుండా పోయింది.  ప్రభుత్వ పథకాలు,  రాష్ట్రం అభివృద్ధి మాటున లక్షల కోట్లు చంద్రబాబు దోచుకున్నారు, దోచి పెట్టారని  పరిశోధనల్లో విదేశీ స్కాలర్లే తేల్చి చెప్పారు. అవినీతిని   ఏవిధంగా, ఎన్ని విధాలుగా చేయవచ్చో చంద్రబాబు ఓ పుస్తకం రాయొచ్చు.  ఎందుకంటే..చంద్రబాబుకు దోచుకోవడం తేలిసింతగా ప్రపంచంలో ఎవరికీ తెలియదు. అలాగే..అబద్దాలు ఆడి ప్రజలను ఎలా మభ్య పెట్టవచ్చో అనే దాని మీద కూడా చంద్రబాబు ఓ బుక్‌ రాయొచ్చు. ఎందుకంటే…కళ్లా ర్పకుండా అబద్దాలు ఆడటం, వాటిని నమ్మించడంలో చంద్రబాబుకు మించిన వారు లేరు. చంద్రబాబు ఎదిగిన తీరులోనే కోట్ల అబద్దాలు, అంతులేని అవినీతి ఉంది. ఆరుగాలం కష్టపడి ప్రజలు బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును కూడా అఫీషియల్‌గా  కొట్టేయడం చంద్రబాబు అండ్‌ కోకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు.

దీనికి ప్రత్యక్ష నిదర్శనం రాయపాటి సాంబశివ రావు ఆయన కాంట్రాక్ట్ కంపెనీ ట్రాన్స్‌ ట్రాయ్‌.  ఈ ట్రాన్స్‌ ట్రాయ్ కంపెనీ బ్యాంకుల నుంచి తీసుకున్న  8వేల కోట్లు ఎటూపోయాయి..?. చంద్రబాబు జేబులోంచి హవాలా మార్గం ద్వారా విదేశాలకా?. ఏపీ అప్పుల్లో ఉందని 2014 -19 మధ్య కాలంలో సీఎంగా చంద్రబాబు ఏడ్వని రోజూ అంటూ లేదు. కానీ..2019 లోక్‌సభ ఎన్నికల  ఆ తరువాత జరిగిన మధ్యప్రదేశ్ , రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు జరిగిన ఎన్నిలకు కాంగ్రెస్‌కు ఫండింగ్ చేసింది చంద్రబాబు కాదా?!!. అలాగే..గుజరాత్, పంజాబ్ ఎన్నికలకు కాంగ్రెస్‌కు ఫండింగ్ చేసింది చంద్రబాబే కదా?!!.  ఈ డబ్బులు అన్నీ ఏపీ ప్రజలవే. సందేహం లేదు.

రాష్ట్ర ఖజానాను, కేంద్రం నుంచి వచ్చే నిధులను తాను దోచుకుంటూ తన పార్టీ నేతలు, కార్యకర్తలకు పంచి పెట్టడంలో చంద్రబాబును మించినవారు లేరు. ప్రజల పథకాల సొమ్మును  టీడీపీ పాల్జేసిన దోపిడీదారుడిగా చంద్రబాబు చరిత్రలో మిగిలిపోతారు. అమరావతి పేరుతో ప్రజారాజధానిని కాకుండా కుల రాజధానిని నిర్మించిన రియల్ ఎస్టేట్ అవినీతి సామ్రాట్ చంద్రబాబు అని ప్రజలు చెప్పుకోవడంలో ఆశ్చర్యం లేదు. తెలంగాణ రాష్ట్ర  సీఎం కేసీఆర్ చెప్పినట్లు చంద్రబాబు లీడర్‌ కాదు ఓ మేనేజర్ మాత్రమే.  నాయకుడు అనేవాడు ప్రజల సంక్షేమాన్ని, అభివృద్ధిని కాంక్షిస్తాడు. మేనేజర్ మాత్రమే దోచుకుని,దోచిపెడతాడు అనేది స్పష్టం. చంద్రబాబులో నాయకుడి లక్షణాలు కంటే మేనేజర్ లక్షణాలే అధికంగా ఉన్నాయి. కాకపోతే..ఎన్టీఆర్‌ నుంచి లాక్కున్న  పొలిటికల్ ప్రొపర్టీ టీడీపీతో ప్రజల్లోకి వెళ్లి వాళ్ల ఓట్లతో అధికారంలోకి వచ్చి  వారినే దోచుకునే సూత్రాన్ని చంద్రబాబు విజయవంతంగా అమలు చేయగలిగారు. ఇవన్నీ కూడా ప్రజలు లెక్కపెడుతున్నారు.

2019లో అధికారం కోల్పోవడం, మోదీ -అమిత్ షాలు తనను దగ్గరకు కూడా రానివ్వక పోవడంతో చంద్రబాబు తెగింపు రాజకీయాలు చేస్తున్నారు. ఏపీలో హిందూ అజెండాను కొల్లగొట్టడానికి తెగింపు రాజకీయాలు చేస్తున్నారు.2024లో అనేది చంద్రబాబు రాజకీయ జీవితంలో  చాలా కీలకం. 2024లో చంద్రబాబు ఓడిపోతే  రాజకీయంగా తలపులు మూసేసుకోవడమే. అంతేకాదు..తెలుగు దేశం పార్టీ కూడా ఆయన నుంచి లాక్కోవచ్చు. ఇవన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకే…మంగళగిరిలో ఓడిపోయిన కుమారుడు లోకేష్‌ను ప్రజల ముందు పెద్ద నేతగా మార్చడానికి తెగ తాపత్రయపడుతున్నాడు. అందులో భాగంగానే..ఎన్టీఆర్‌కు వచ్చినట్లు ప్రజలు లోకేష్‌ను చూడటానికి వస్తున్నారని మాటలతో మాయ చేయాలని చంద్రబాబు చూస్తున్నారు.  కానీ..ప్రజలు ఇవన్నీ లెక్క కడుతున్నారు. ఆంధ్రా ప్రజలకు చంద్రబాబు ఏంటో తెలుసు..!!లోకేష్‌ అంటే ఏంటో తెలుసు..!!.

2024 భయంతోనే చంద్రబాబు తెగింపు రాజకీయాలు చేస్తున్నారు. గుడులపై దాడులు చేయిస్తూ సమాజంలో చీలికలు తీసుకురావడానికి శతవిధాలుగా ప్రయత్నం  చేస్తున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్ రెడ్డి చెప్పినట్లు ప్రభుత్వం మంచి పని చేయాలని అనుకున్న ముందు రోజునే విగ్రహాల ధ్వంసం జరుగుతుంది. ఇప్పటి వరకు 11 విగ్రహాల ధ్వంసం జరిగింది. ఇవన్నీ చంద్రబాబు అండ్ కో పనేనని  ప్రజలు లెక్కలేస్తున్నారు. నవంబర్ 14, 2019 గుంటూరు దుర్గ గుడి ధ్వంసం దగ్గర నుంచి రామతీర్ధంలోని శ్రీరాములవారి విగ్రహం ధ్వంసం వరకు చంద్రబాబు పాపాలు ప్రజలు లెక్కేస్తున్నారు. ఎన్టీఆర్‌ కు వెన్నుపోటు  చంద్రబాబు చేసిన మొదటి పాపంగా లెక్క కడితే..100 పాపాలకు దగ్గర్లో చంద్రబాబు ఉన్నారని అనిపిస్తోంది. తన రాజకీయం కోసం గుడుల్లో క్షుద్రపూజలు చేయించిన చరిత్ర చంద్రబాబు కుటుంబీకుల సొంతం. ఇది పాపాల్లో కల్లా మహాపాపం. చంద్రబాబు చేస్తోన్న ఈ పాపాలు అన్నింటినీ ప్రజలు లెక్క పెడుతున్నారు.

2024 తరువాత చంద్రబాబు రాజకీయంగా సమాధి కావడం ఖాయం. చంద్రబాబు చేస్తోన్న పాపాలే ఓట్ల రూపంలో 2024లో చంద్రబాబు రాజకీయ జీవితాన్ని కాటేయబోతున్నాయి. ఆ తరువాత కూడా చంద్రబాబు చేస్తోన్న తప్పులు, పాపాలు ఆయనను వదలవు. వేటాడి వెంటాడుతాయి. తాను అధికారంలో ఉన్నప్పుడు ఎవరినైతే ఆర్ధికంగా నిలబెట్టాడో, రాజకీయంగా ప్రోత్సాహించారో వారే చంద్రబాబు దగ్గరకు వస్తారు. వచ్చి చంద్రబాబు ఇచ్చిన చల్లని మజ్జిగా తాగి తమ రాజకీయ ఆలొచనలు  బయట పెడతారు. బాబుగారు 2024  ఎన్నికల్లో మన పార్టీ ఘోరంగా  ఓడిపోయింది. మీకా వయసు అయిపోతుంది.

మీ కుమారుడు రాజకీయంగా అన్‌ ఫిట్ అని  ప్రజలు తేల్చేశారు. మీరేమో వయసురీత్యా పార్టీని నడపలేరని, వైఎస్‌ జగన్‌ను ఎదుర్కోలేరని స్పష్టంగా అర్ధమవుతుంది. దయచేసి మీరు తప్పుకోవాలి. మీరు తప్పుకోకపోతే పార్టీ క్యాడర్‌ చేజారి పోతుంది. వైఎస్‌ఆర్‌ సీపీ, బీజేపీలోకి వెళ్తారు నేతలు , కార్యకర్తలు దారి పడతారు. కాబట్టి మీరు తప్పుకుని జూనియర్ ఎన్టీఆర్‌కు పార్టీ పగ్గాలు అప్పగిస్తే మంచిది. పార్టీ, మన సామాజికవర్గం రెండూ నిలబడతాయి.లేనిపక్షంలో మీతోపాటు పార్టీ, సామాజికవర్గం కాలగర్భంలో కలిసిపోతాయి. ఇలా చంద్రబాబు చేసిన తప్పులు, పాపాలు వెంటపడి వేటాడుతాయి. దేవుడితో పొలిటికల్ గేమ్ ఆట మొదలు పెట్టిన చంద్రబాబు ఆ రాజకీయ క్రీడలోనే పొలిటికల్‌గా కిల్  కావడం ఖాయం.  ఎందుకంటే..చంద్రబాబు 100 త ప్పులు 2024తో పూర్తవుతాయి. 2024లో ప్రజలు ఓట్లు సుదర్శన చక్రాలై చంద్రబాబు రాజకీయ జీవితాన్ని చీల్చి చెండాడుతాయి. ఇది సత్యం.