దశాబ్ధాల దాహార్తి తీరుతున్న వేళ..

3
2

దాహార్తితో అలమటిస్తున్న పిడుగురాళ్ళ ప్రజల గొంతు తడిపేందుకు ప్రభుత్వం నిర్మించిన సమగ్రమంచినీటి పధకాన్ని రేపు ప్రారంభించనున్నారు పురపాలక శాఖా మంత్రి బొత్ససత్యన్నారాయణ మరియు గురజాల ఎమ్మెల్యే కాసుమహేష్ రెడ్డి. దశాబ్దాల నుండి అవస్తలు పుడుతున్న ప్రజల తాగునీటి కష్టాలను తరిమికొట్టడానికి ఈపధకం ఎంతగానో ఉపయోగపడనుంది.
చిన్నమధ్యతరహా పట్టణాల్లో మౌళిక సదుపాయాల కల్పనకు ఉద్దేశించిన యూ ఐ డి ఎస్ ఎస్ m t  పధకం కింద ప్రభుత్వం రూ 35. 59 కోట్లు కేటాయించగా, మేఘా ఇంజనీరింగ్ సంస్ద ఈప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. పిడుగురాళ్ళ ప్రాంత ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య లేకుండా చేయడమే ఈప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం. పిడుగురాళ్లకు సమీపంలోని గోవిందాపురం నుంచి  పట్టణం వరకు 17 కిలోమీటర్ల పైప్ లైన్  నిర్మించింది మేఘా ఇంజనీరింగ్ సంస్ద. పట్టణంలో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగు నీరు అందించేందుకు 14 కిలోమీటర్ల distribution పైప్ లైన్ ఏర్పారు చేసింది.  గోవిందాపురం వద్ద ఇన్టేక్ వెల్ తో పాటు పిడుగురాళ్ల పట్టణంలో రోజుకు 14 మిలియన్ లీటర్ల సామర్ధ్యం ఉన్న  water treatment plant  నిర్మించింది. మూడు Reservoiers లను లెనిన్ నగర్, ఎన్ ఎస్ పీ కాలనీ, హెడ్ వాటర్ వర్క్స్ వద్ద నిర్మించింది. ప్రస్తుతం ఉన్న 77 వేల  పట్టణ  జనాభాతో పాటు 2036 సంవత్సరానికి పట్టణం లో పెరిగే జనాభాకు కూడా ఉపయోగ పడేలా  ఈ పధకాన్ని రూపొందించారు.
అప్పటికి పట్టణ జనాభా లక్షా ఏడు వేలకు చేరుతుందని అంచనా. ఈ పధకం గత మూడు నెలలుగా పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు ప్రయోగాత్మకంగా  ఎలాంటి అవాంతరాలు లేకుండా స్థానిక శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి  సహకారంతో మంచి నీటిని అందిస్తోంది.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here