వరదసాయానికి ఇంకెన్నాళ్లు …?

0
2
  • అసలు ఇచ్చే ఉద్దేశ్యం ఉందా లేదా..?
  • ఇస్తే ఎన్నిరోజుల్లో పూర్తిచేస్తారో తెలపాలి : ఏఐసీసీ అధికారప్రతినిధి డా.శ్రవణ్
  • వరదసాయంపై తాను రాసిన లేఖ పై  విచారణ చేపట్టిన హైకోర్టుకు ధన్యవాదాలు.
  • వరదసాయం అక్రమార్కులపై కఠిన శిక్షలకు డిమాండ్
  • ఎవరెవరికి సాయమందించారో బహిర్గతపర్చాలి
  • అసలు లబ్దిదారులకు న్యాయం చేసి అవినీతిపరులపై కఠిన శిక్షకు డిమాండ్ .

హైదరాబాద్:ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ కెసిఆర్ ప్రకటించిన వరదసాయం ఏమైందని నిలదీశారు.గ్రేటర్  ఎన్నికల ప్రచారం లో భాగంగా ఎందరికో ఇచ్చాం ఇంకొందరికి ఇవ్వలేమా అంటూ ప్రగల్భాలు పలికి ఎన్నికల ఫలితాలు రాగానే అందరికి వరదసాయం అందుతుందని ప్రకటించిన కెసిఆర్ ఇపుడు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదని దుయ్యబట్టారు.ప్రస్తుతం హైకోర్టు నోటిసులకైనా స్పందించి ప్రభుత్వ ప్రధానకార్యదర్శి మరియు జిఎచ్ఎంసి కమిషనర్లు  సమాధానమియ్యాలని ఇంతవరకు ఎంతమందికి వరదసాయం అందించారో,ఇంకా ఎంతమంది అర్హులు ఉన్నారో మరియు యెంత మంది అర్హులను గుర్తించాల్సివుందో తెలియజేయాలని డిమాండ్ చేసారు. వెంటనే అధికారులు స్పందించి వరదసాయం పంపిణి వివరాలు డివిజన్,వార్డుల వారీగా తెలియజేయాలని డిమాండ్ చేసారు.ముఖ్యమంత్రి సహాయనిధిపై రాష్ట్ర ప్రజలకు పూర్తి  హక్కులు ఉన్నాయని అర్హులైన వారందరికీ సాయం అందించాల్సిందేనని ఈ సహాయనిధి ముఖ్యమంత్రిదో లేక తెరాస పార్టీ యొక్క సొంత ఖజానా కాదని గుర్తుచేశారు.

తాను రాసిన లేఖను ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన తెలంగాణ హైకోర్టుకు ధన్యవాదాలు తెలుపుతూ వరదసాయం లో ఘోరమైన అవినీతికి తెరాస నాయకులు,ఎమ్మెల్యే లు జిఎచ్ఎంసి అధికారులు పాల్పడ్డారని వారందరికీ కఠిన శిక్షలు విధించాలని దాసోజు కోరారు .నవంబర్ 2 ,2020 న హైకోర్టుకు రాసిన లేఖలో శ్రవణ్ వరదసాయం అవినీతిపై సమగ్ర వివరాలు పొందుపరిచారు.ఈ లేఖలో తెరాస ప్రభుత్వం హామీ మేరకు పదివేల రూపాయలు పంచాల్సి ఉందని చాలా చోట్ల డబ్బులు పంచారని పదివేలకు బదులు తెరాస నాయకులు,కార్పొరేటర్లు తమ చేతివాటం ప్రదర్శించారని,10 వేల  రూపాయలకు బదులు 2వేలు,3 వేలరూపాయలు చేతిలోపెట్టారని ఇదేమని అడిగితే దిక్కున్నచోట చెప్పుకోవాలని తెరాస గుండాలు బెదిరించారని శ్రవణ్ తెలిపారు .అసలు ప్రభుత్వ సాయం అందించడం లో ఏ హోదా లేని తెరాస నాయకుల జోక్యం ఏంటని శ్రవణ్ అన్నారు.

అక్టోబర్ లో కురిసిన వర్షాలకు హైదరాబాద్ ప్రజలు తీవ్ర కష్ట,నష్టాలకు  గురైనారని వారికి వరదసాయం అందిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని ఆరున్నర లక్షల మందికి 650 కోట్లు  వరదసాయం అందించామని ఇంకా ఓ లక్ష మందికి సహాయం చేస్తామన్న మాటలు నీటిమూటలు అయ్యాయని  దాసోజు దుయ్యబట్టారు.
గ్రేటర్ ఎన్నికలే లక్ష్యంగా కెసిఆర్,తెరాస  నాయకులు  ప్రజలను మభ్యపెడుతూ ప్రజాధనాన్ని వాడుకుని ఎన్నికల తరువాత ప్రజలను విస్మరించారని తెలిపారు.గౌరవ హైకోర్టు నిజమైన లబ్దిదారులకు న్యాయం చేసి అవినీతిపరులను జైలుకు పంపాలని దాసోజు అభ్యర్థించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here