జాగ్రత్త..ముక్కు జోలికెళితే కరోనా ఎటాక్ గ్యారెంటీ!

మనం అనేక మంది నిత్యం ఏదోక సందర్భంలో ముక్కు నలుపుకుంటారు..ఏదాలపంగా వేళ్లు లోపలికి పోనిస్తారు. ఎవరైనా గమనిస్తున్నారని అనిపిస్తే వేంటనే సర్దుకుని తిన్నగా కూర్చుంటారు. చూసే వాళ్లకు ఇబ్బందిగా ఉంటుందని తెలిసినా అప్పుడప్పుడూ పొరపాటునో గ్రహపాటునో కొందరు ఇలా చేసేస్తుంటారు. ఒకానొక సర్వే ప్రకారం.. ప్రపంచ జనాభాలోని 91 శాతం మంది ఏదోక సమయంలో ఈ పని చేస్తారని తేలింది. అయితే..ప్రస్తుత కరోనా కాలంలో ఈ అలవాటు ఉన్న వాళ్లు తక్షణం తమ తీరును మార్చుకోవాలని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మ్యూకస్ అనే చిక్కని పదార్థం నిరంతరం ముక్కులో ఉత్పత్తి అవుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నాశికా రంధ్రాల్లో ఇది నిరంతరం తయారవుతూ దుమ్ము, ధూళీ, ఇతర వ్యాధి కారక క్రిములను బంధించి ఎటూకదలకుండా చేస్తుంది. అయితే..ముక్కులో వేళ్లు పెట్టుకోవడం వల్ల కొన్ని సార్లు అక్కడ కంటికి కనిపించని గాయాలవుతాయి. దీంతో..అప్పటివరకూ సూక్ష్మ క్రిములకు అడ్డుగా ఉన్న మ్యూకస్ కూడా తొలగిపోతుంది. ఈ క్రమంలో కరోనా వైరస్ కణాలు కూడా రక్తణాళాల్లోకి ప్రవేశించి అటుపై..ఊపిరితిత్తులను చేరుకుంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి.. ఇటువంటి అలవాటు ఉన్న వారు కరోనా కాలంలో జాగ్రత్తగా ఉండాలని వారు హెచ్చరిస్తున్నారు.

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com
Close Bitnami banner
Bitnami