ఓ నలభై యాభై ఏళ్ల క్రితం వరకూ బీపీ గురించి ఎవరూ విని ఉండరు !

586

*  రక్తపోటు ఇలా పెరిగిపోవడానికి కారణమేమిటని డాక్టర్లను ఆరాతీస్తే, అప్పట్లో బీపీ లేకపోవడానికి కారణం అయొడైజ్డ్ ఉప్పు లేకపోవడమేనని తెలిసింది. మళ్లీ రాళ్ల ఉప్పుకు ఎంత త్వరగా మారితే ఆరోగ్యానికి అంత మంచిదని కూడా వారు సలహా ఇస్తున్నారు.
*  మానసిక ఒత్తిడి తగ్గాలన్నా, రక్త దోషాలు పోవాలన్నా, రక్తపోటు మామూలు స్థితిలో ఉండాలన్నా అయొడైజ్డ్ ఉప్పుకు స్వస్తి చెప్పి, రాళ్ల ఉప్పును ఉపయోగించాల్సిందేనని వారు నొక్కి చెబుతున్నారు.
* అయొడైజ్డ్ ఉప్పు అసలు ఉప్పే కాదని తెలిపారు.సోడియం, క్లోరైడ్, అయొడిన్ అనే మూడు కృత్రిమ రసాయనాలతో ఈ అయొడైజ్డ్ ఉప్పును తయారు చేస్తారు.
*  చాలా పరిశుభ్రంగా ఉంటుందని, ఆరోగ్యకరమని, చక్కగా స్ఫటికాల్లా మెరిసిపోతుంటుందని భావించే ఈ అయొడైజ్డ్ ఉప్పు శరీరంలో పూర్తిగా కరగదు. మూత్రపిండాల్లో కూడా కరగకపోగా, వాటిల్లో రాళ్లను సృష్టిస్తుంది. దీని కారణంగా రక్తపోటు పెరిగేదానికి పూర్తి అవకాశాలు వున్నాయి.
*  అసలైన ఉప్పు, అంటే రాళ్ల ఉప్పు సముద్రం నుంచి వస్తుంది. దీన్ని ఎండలో ఎండబెడతారు. ఇందులో సహజసిద్ధమైన 72 ఖనిజ లవణాలుంటాయి. ఇందులో కూడా సోడియం, క్లోరైడ్, అయొడిన్‌లు ఉంటాయి కానీ, అవి సహజమైనవి. కృత్రిమమైనవి కావు.
ఈ ఉప్పు నీళ్లలో వెంటనే కరిగిపోతుంది. శరీరంలోను, మూత్రపిండాల్లోను కరిగిపోతుంది. అందుచేత మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడవు.
*  రాత్రివేళల్లో పిక్కలు, అరికాళ్లలో నొప్పులు వచ్చినా, పిక్కలు బిగపట్టుకుపోయినా ఓ అరగ్లాసు నీళ్లలో ఓ చెంచాడు రాళ్ల ఉప్పు వేసి, బాగా కలిపి, ఆ నీటిని తాగండి. అయిదు నిమిషాల్లో ఆ నొప్పులు, బాధలన్నీ మటుమాయమైపోతాయి. ( బి.పి పేషంట్ రీడింగ్  ని బట్టి నిర్ణయించుకోవాలి….)
*  అంతేకాదు , చిన్న పిల్లలకు వేసవి కాలంలో మూత్రం జారీ కావడం లో ఇబ్బందులు కలిగితే రాళ్ళఉప్పు నూరి పొ త్తి కడుపు మీద పట్టు వేసేవారు. పది నిమిషాలలో మూత్రం సాఫీగా వచ్చేస్తుంది.
*  రాళ్ల ఉప్పు వాడడం ప్రారంభించిన తరువాత శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. తొందరగా కరిగిపోవడం చేత, “ అయాన్ల మార్పిడి “ జరిగి శరీరం మందులకు స్పందించడం ప్రారంభమవుతుంది. మూత్రపిండాలు సజావుగా పని చేస్తున్నట్టు అనుభవపూర్వకంగా తెలుస్తుంది.
*  రాళ్ల ఉప్పులో ఔషధ విలువలు ఎక్కువగా ఉంటాయి. బీపీ సాధారణ స్థితిలో ఉండాలన్నా, తలకు రక్తం సజావుగా చేరాలన్నా మిరపకాయల వాడకం ( వాతాన్నికలుగజేయడమే కాదు, సరిచేస్తుంది కూడా), అరటి పండ్లు తినడం అనివార్యం. ఇవి రెగ్యులర్‌గా వాడేవారికి గుండె సంబంధమైన సమస్యలు కూడా తలెత్తవని డాక్టర్లు సూచిస్తున్నారు.
*  శరీరంలో సరైన పాళ్లలో ఉప్పు లేకపోతే నీరు నిలవడం అసాధ్యం. శరీరంలో నీరు నిలవకపోతే, రక్తనాళాలు సజావుగా పనిచేయవు. శరీరంలో నీటి శాతం ఏమాత్రం తగ్గినా అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అయొడైజ్డ్ ఉప్పు వల్ల శరీరంలో నీళ్లు నిలవవు. రాళ్ల ఉప్పు వల్ల శరీరంలో 95 శాతం వరకూ నీళ్లు నిలుస్తాయి.
*  శరీరం నుంచి సరిగా మూత్రం బయటికి పోవడానికి, చెమటలు పట్టడానికి రాళ్ల ఉప్పు సహకరిస్తుంది. ఇదే ప్రక్రియ రక్తపోటును నియంత్రిస్తుంది.