జగన్‌కు అంగుళం హాని కల్గిస్తే మీకు అడుగు దిగుద్ది

56

ఐ డోంట్ కేర్ మీ ఇష్టం వచ్చినన్ని రోజులు వేసుకోండి  
టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి
బూతుల మంత్రనో ఇష్టమొచ్చిన హెడ్డింగ్ పెట్టుకోండి    
 మంత్రి కొడాలి నాని హెచ్చరిక

గుడివాడ , జనవరి 5 : రాష్ట్ర ప్రజలకు అండగా ఉంటున్న సీఎం జగన్మోహనరెడ్డిని కాపాడుకోవాల్సిన అవసరం మనందిరపై ఉందని , ఆయన వెనుక ఉన్నానన్న ఆక్రోశంతో ఏబీఎన్ రాధాకృష్ణ , టీవీ 5 బీఆర్ నాయుడు , ఈనాడు రామోజీరావులు వారి ఛానల్స్ లో ఇష్టమొచ్చినన్ని రోజులు తన గురించి పుంఖాను పుంఖాలుగా వేసుకోవచ్చని , పత్రికల్లో రాసుకోవచ్చని , ఐ డోంట్ కేర్ అంటూ రాష్ట్ర పౌరసరఫరాలు , వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు ( నాని ) అన్నారు . మంగళవారం నందివాడ మండలం లక్ష్మీనరసింహపురంలో ఇళ్ళపట్టాల పంపిణీ కార్యక్రమంలో అనంతరం ఆయన మాట్లాడారు . మీ ఛానల్స్ , పత్రికల్లో నా ఫొటో తప్ప ఎవరి ఫొటోలు పెట్టుకోకున్నా అభ్యంతరం లేదన్నారు . మీ ఛానల్స్ ఎంత , మీ బతుకులెంత అంటూ ఆవేశంగా మాట్లాడారు.

టీడీపీ తొట్టిగ్యాంగ్ పది మంది చూసే ఛానల్స్ అవి అని అన్నారు . సీఎం జగన్మోహనరెడ్డికి రాజకీయంగా అంగుళం హాని తలపెడితే మీకు అడుగు దిగుద్దని హెచ్చరించారు . మీరంతా ఒళ్ళు దగ్గర పెట్టుకు ఉండాలని సూచించారు . సీఎం జగన్మోహనరెడ్డిని ఏమీ చేయలేక ఆయనపై బండలు వేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు . తనలాంటి వారు జగన్ వెనుక ఉంటూ చంద్రబాబును , ఆయన పార్టనరను , లోకేష్ ను విమర్శిస్తే బూతుల మంత్రనో , భూషణం మంత్రనో అంటున్నారని , మీ ఇష్టమొచ్చినట్టుగా హెడ్డింగ్లు పెట్టుకున్నా లెక్కచేసేది లేదన్నారు . జగన్మోహనరెడ్డిని ఒక మాట అంటే అన్నవారిని తిరిగి పది మాటలు అంటామన్నారు . సీఎం జగన్మోహనరెడ్డి పది కాలాల పాటు చల్లగా ఉంటే పేదలు , దళితులు , బలహీన వర్గాలు , మైనార్టీలు , అగ్రవర్ణాల్లోని పేదల పిల్లలను చదివించే బాధ్యతను ఆయన తీసుకుంటారన్నారు . పేదవర్గాల పిల్లలందరికీ ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తారన్నారు . ఆస్థిపరుల పిల్లలు వేసుకునే స్కూల్ డ్రెను ఉచితంగా అందజేస్తారన్నారు . నాణ్యమైన భోజనాన్ని అందిస్తారన్నారు . ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా ఉచితంగానే వైద్యం చేయించి ఇంటికి పంపుతారన్నారు . గ్రామాల్లో మౌలిక సదుపాయాలను కల్పిస్తారన్నారు . ప్రతి ప్రభుత్వ పథకంలోనూ పేదలను భాగస్వాములుగా చేస్తారన్నారు . అటువంటి జగన్మోహనరెడ్డిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు . అలాగే సీఎం జగన్మోహనరెడ్డికి దేవుని , తండ్రి రాజశేఖరరెడ్డి , ఇక్కడున్న ప్రజల ఆశీస్సులు ఉన్నాయన్నారు . మనస్పూర్తిగా ప్రజలందరూ దీవించాలన్నారు.