చూశారా…కొన్ని గుళ్ళకి హాని చేస్తే చాలు….

198

మనకి ప్రత్యేక హోదా ఇవ్వక్కర్లేదు..
GST పరిహారం ఇవ్వక్కర్లేదు..
పోలవరం నిర్వాసితులకి నిధులు ఇవ్వక్కర్లేదు..
గండికోట ముంపు బాధితులకి పరిహారం ఇవ్వక్కర్లేదు..
కడప యురేనియం బాదితుల సమస్యలు తీర్చక్కర్లేదు..
రైతు చట్టాలపైన చర్చ అక్కర్లేదు..
పడిపోతున్న ప్రజల ఆదాయాలూ, పెరుగుతున్న బడాబాబుల ఆస్తులపై చర్చ అక్కర్లేదు..
పెరుగుతున్న నిత్యావసరాల పైన చర్చ అక్కర్లేదు..
పెట్రోల్, డీజిల్, గాస్ లపైన రేట్లెంత పెంచినా చర్చ అక్కర్లేదు..
విభజన హామీలు తీర్చాల్సిన పనిలేదు..
ఇండస్ట్రీలు అక్కర్లేదు..
పోర్ట్ పనులు అక్కర్లేదు..
రోడ్లు అక్కర్లేదు..
పెరుగుతున్న టోల్ గేట్ల రేట్లు అక్కర్లేదు..
పెరుగుతున్న ఇంటి పన్నులూ అక్కర్లేదు..
పడిపోతున్న జీవన స్తితిగతులపై చర్చ అక్కర్లేదు..
స్థానిక ఎలక్షన్లూ అవసరం లేదు..
పెండింగ్ లో ఉన్న బిల్స్ ఇవ్వాల్సిన పనిలేదు..
PGవిద్యార్ధులకి స్కాలర్ షిష్ ఎత్తేస్తే చర్చలేదు..
ఇళ్ళ స్థలాలలో జరిగిన అవినీతి అక్కర్లేదు..
న్యాయవ్యవస్తపై పోతున్న నమ్మకంపైన చింత అక్కర్లేదు..
పెరిగిన నిరుద్యోగంపైన, పోయిన ఉద్యోగాలపైన చింత అక్కర్లేదు..
మూసేస్తున్న ప్రభుత్వ కంపెనీలపైన చర్చ అక్కర్లేదు..
మనం ఇలా ఉంటే ఈదేశం ఎప్పటికీ బాగుపడదు. మీరూ, మీ పిల్లలూ, వాళ్ళ పిల్లలూ ఇలా గుడులూ చుట్టూనే తిరుగుతూ ఉంటే ప్రపంచం మాత్రం కొత్త కొత్త ఇన్నోవేషన్స్ తో పేటెంట్స్ తీసుకుంటూ అభివృద్ది సాధిస్తున్నాయి.
ప్రపంచంలో కొత్త ఐడియాస్ తో స్టార్ట్ అవుతున్న స్టార్ట్ అప్స్ లలో మనం ఎక్కడున్నామో చర్చ ఉందా. ఎంత శాతం మన దేశ కంపెనీలకి నిధులొస్తున్నాయో ఏమైనా చర్చ ఉందా. ఎంత నాణ్యమైన కొత్త కంపెనీలు పెడుతున్నామో చూస్తున్నారా?
ఏం బతుకుల్రా మనవి?
ఇలాగే ఉందామా ఎల్లకాలం.
గుడీ, మసీదు, చర్చి లేకపోతే చైనా, పాకిస్థాన్.
ఇంతేనా… ఇంకేమీ పట్టవా?.
మీ ఊరి సమస్యలపైన ప్రభుత్వాన్ని నిలదీయండి.
ఇవన్నీ మాకవసరం లేదు పోరా, మా సమస్యలే మాక్కావలని గట్టిగా అడగండి. ఒక్క గుడి, మసీదు కూలదు. కూల్చినా ఎవడూ పట్టించుకోకపోతే కూల్చే అవసరం ఎవడికుంది.
మన బతుకుల గురించి ఆలోచిద్దాం బ్రో…