తిరుపతి ఉప ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపబోతున్న “భూవివాదం”

రానున్న తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో..  స్థానిక సమస్యల పరిష్కార అంశం ప్రధాన పార్టీలకు పరీక్షగా మారనున్నాయి. సుదీర్ఘకాలం నుంచి అపరిష్కృతంగా ఆయా సమస్యల పరిష్కారం కోసం స్థానికులు, ప్రచారానికి రానున్న పార్టీ నాయకుల వద్ద ప్రస్తావించక తప్పని పరిస్థితి ఏర్పడింది.

రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినప్పుడల్లా తిరుపతిలో వివాదాస్పదంగా మారుతున్న దశాబ్దాల కాలంనాటి స్థానిక ప్రజల అనుభవంలో గల భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి! తిరుపతి నగరంలో సుమారు 10 వేల మందికి గుదిబండగా మారిన సమస్యకు ఉపశమనం కలిగించేలా టీటీడీ,అధికారపార్టీ దృష్టిసారించాలి!

“చింతలచేను””పెద్ద కాపు వీధి”జయ శ్యామ్ టాకీస్ రోడ్”డిబిఆర్ హాస్పిటల్ రోడ్డు పరిసర ప్రాంతాలలోని టౌన్ సర్వే నెంబర్ 6,8,9,12,623 మరియు 4073 లలో నివాసముంటున్న ప్రజలు ఆరు దశాబ్దాలుగా అనుభవిస్తున్న సుమారు 188 ఎకరాల భూములకు క్రయ విక్రయాలు జరుపుకునేలా ప్రభుత్వం వెంటనే అనుమతించాలి!  తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు పై తెలిపిన సర్వే నెంబర్లలోని కాళీ స్థలాలలో ఇంటి,వాణిజ్య సముదాయాల నిర్మాణాలకు తక్షణం అనుమతులు ఇవ్వాలి!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వముచే 1957 సంవత్సరంలో రైత్వారీ పట్టా జారీ చేయబడి 1958 లో చంద్రగిరి సబ్ కలెక్టర్ వారిచే ధ్రువ పరచబడి 1959 నవంబర్ నెల 9వ తేదీన చిత్తూరు జిల్లా గెజిట్ ద్వారా ప్రచురించబడి రిజిస్ట్రేషన్ కు అన్ని అర్హతలు కలిగి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో సర్వ హక్కులతో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి అలాంటిది గత సంవత్సరం నుంచి ఉన్నఫలంగా రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేయడం పై రాష్ట్రప్రభుత్వం పునరాలోచన చేయాలి!

టీటీడీ శ్రీనివాసం వసతి సముదాయ నిర్మాణానికి, ఏపీఎస్ ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణానికి ఇదే సర్వేనెంబర్ లో దశాబ్దకాలంగా అనుభవిస్తున్న ప్రైవేటు వ్యక్తుల నుంచి స్థలం కొనుగోలు చేసింది వాస్తవం కాదా??టీటీడీ స్థలం అయినప్పుడు ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది??
గత ప్రభుత్వం 2003 వ సంవత్సరంలో 781 జీవో జారీ చేసి రిజిస్ట్రేషన్లను కొంతకాలం నిలిపివేసింది స్థానిక ప్రజల నుంచి,అన్ని రాజకీయ పార్టీల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో తిరిగి పునరుద్ధరించింది నాటి నుంచి నేటి 2019 వరకు కొన్నివేల రిజిస్ట్రేషన్లు,ఇండ్లు, అపార్ట్మెంట్ల నిర్మాణాలు ఆ ప్రాంతంలో జరిగాయి గత సంవత్సరం నుంచి ఉన్నపళంగా రిజిస్ట్రేషన్లు నిలపడం,నగరపాలక సంస్థ నిర్మాణాలకు అనుమతి ఇవ్వకపోవడంతో చిన్నా చితకా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి ప్లాట్లు కొనుగోలు చేసిన స్థానికులకు, మధ్యతరగతి కుటుంబాల వారికి దినదినగండంగా మారింది!

రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కోర్టు తీర్పు వచ్చేవరకు పై సర్వే నెంబర్లలో గల ఖాళీ జాగాలకు,అపార్ట్మెంట్ లకు, ఇండ్లకు రిజిస్ట్రేషన్లు జరిగే విధంగా అలాగే భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే విధంగా టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్,అధికార పార్టీ నాయకులు,తిరుపతి ఆర్డిఓ, నగరపాలక సంస్థ కమిషనర్ గారు చొరవ చూపాలి!
టీటీడీ ధర్మకర్తల మండలి,జిల్లా అధికార పార్టీ నాయకులు సంబంధిత స్థలాలలో నివాసముంటున్న వారితో పాటు నగరంలో అనేక ప్రాంతాలలో రిజిస్ట్రేషన్లు జరగక,బ్యాంకు లోన్ లు రాక, అవసరానికి అమ్ముకోలేక సతమతమవుతున్న స్థానిక ప్రజలతో ముఖాముఖి సమావేశం ఏర్పాటు చేసి చర్చించి వారి సాధక బాధలను ఆలకించి మధ్యేమార్గంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెల్లి శాశ్వత పరిష్కారానికి “పాస్ట్ ట్రాక్ కమిటీ” ని నియమించి సత్వర పరిష్కారానికి చొరవ చూపాలి!

                                                                              – నవీన్ కుమార్ రెడ్డి

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close Bitnami banner
Bitnami