కేటీఆర్‌ను సీఎం చేసే ఆలోచన కేసీఆర్‌కు లేదు:బండి సంజయ్

125

మరో మూడేళ్లు కేసీఆరే సీఎంగా ఉంటారు
ఆరేళ్లుగా కేసీఆర్ కుటుంబం అంతులేని అవినీతికి పాల్పడింది
కేసీర్ అక్రమాలను బట్టబయలు చేస్తాం

తెలంగాణ ముఖ్యమంత్రి పదవీబాధ్యతలను త్వరలోనే కేటీఆర్ స్వీకరించబోతున్నారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. తన కుమారుడికి పట్టాభిషేకం చేసేందుకు కేసీఆర్ ముహూర్తాన్ని నిర్ణయించారనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరో మూడేళ్ల పాటు కేసీఆరే సీఎంగా ఉంటారని ఆయన అన్నారు. తన కుమారుడు కేటీఆర్ ను సీఎం చేసే ఉద్దేశం కేసీఆర్ కు లేదని చెప్పారు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న ఆయన అక్కడ ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు బీజేపీకే పట్టం కడుతున్నారని సంజయ్ అన్నారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. గత ఆరేళ్లుగా కేసీఆర్ కుటుంబం అంతులేని అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కేసీఆర్ అవినీతి, అక్రమాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భవిష్యత్తులో వచ్చేవి బీజేపీ ప్రభుత్వాలేనని అన్నా