ఎవ్వరినీ లెక్క చేయవద్దు,ఎవ్వరినీ స్పేర్‌ చేయొద్దు

404

విగ్రహ విధ్వంస ఘటనలను లోతుగా పరిశీలన చేయండి
‘స్పందన’ కార్యక్రమంలో సీఎంవైయస్‌ జగన్‌

అమరావతి: ‘స్పందన’ కార్యక్రమంలో భాగంగా, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో  పలు అంశాలపై మాట్లాడిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, చివరగా రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను ప్రస్తావించారు. ఈ సందర్భంగా సీఎం వైయస్‌ జగన్‌ ఏమన్నారంటే..:

నిన్న (సోమవారం) పోలీస్‌ డ్యూటీ మీట్‌ ప్రారంభించిన సందర్భంగా కూడా పోలీసులను ఉద్దేశించి మాట్లాడాను. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల గురించి మాట్లాడాను.  మనం డీల్‌ చేయాల్సిన పరిస్థితుల మీద కూడా వివరంగా మాట్లాడాను.

గెరిల్లా వార్‌ఫేర్‌:
రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్‌ జరుగుతోంది. ఇది చాలా కొత్త అంశం.
ఎక్కడైనా దొంగతనాలు జరిగితే పోలీసులు పట్టుకునే పరిస్థితులు పోయి కొత్త ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.రాజకీయ దురుద్దేశాలతో గుళ్లలో విధ్వంసాలుజరుగుతున్నాయి.ఎవరూ లేని ప్రదేశాల్లో.. అర్థరాత్రి పూట.. అందరూ పడుకున్నాక.. తక్కువ జనాభా ఉన్న ప్రదేశాల్లో గుడులపై దాడులు చేస్తున్నారు.
వాటిలోని విగ్రహాలను పగలగొడుతున్నారు.

ప్రచారం–ప్రసారం:
ఆ మర్నాడు వాటిని సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఆ వెంటనే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటి మీడియా సంస్థలు వాటిని అదే పనిగా ప్రసారం చేస్తున్నాయి. దాన్ని ఉపయోగించుకుని ప్రతిపక్ష పార్టీ నేతలు కుయుక్తులు.

తట్టుకోలేకపోతున్నారు:
ఇంటింటికీ అనేక సంక్షేమ ఫలాలు అందిస్తుంటే.. జీర్ణించుకోలేక, తట్టుకోలేక దొంగదెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారు.
సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు ఎన్నో సేవలందుతున్నాయి.
దీంతో ఏం చేయాలో తోచక, అలాంటి పనులకు ఒడి గడుతున్నారు.దేవుడంటే భయం, భక్తి లేకుండా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు.దీని ద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకు రావాలనుకుంటున్నారు.ఇలాంటి నేరాలను కూడా పోలీసులు పరిగణలోకి తీసుకోవాల్సిన అన్యాయమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం.

రక్షించుకునే కార్యక్రమాలు:
వీటన్నింటినీ మనం చాలా జాగ్రత్తగా మానిటర్‌ చేయాలి.ఇప్పటికే 36 వేల సీసీ కెమెరాలు గుళ్లలో పెట్టాం. ఆ విధంగా గుడులు, గోపురాలను రక్షించుకునే కార్యక్రమాలు చేస్తున్నాం.
నిజానికి గతంలో ఏనాడూ ఇలాంటి పరిస్థితి రాలేదు.అంత దారుణమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం.

కఠినంగా వ్యవహరించాలి:
ఈ రాజకీయ గెరిల్లా వార్‌ఫేర్‌ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో మత సామరస్యం గురించి మాట్లాడే మాటలు పబ్లిసైజ్‌ కావాలి. మతాల మధ్య, కులాల మధ్య విద్వేషాలు పెంచే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలి.

ఎవ్వరినీ లెక్క చేయవద్దు:
ఈ పరిస్థితుల్లో ఎవ్వరినీ లెక్క చేయవద్దు. ఎవ్వరినీ స్పేర్‌ చేయొద్దు.ఘటనలు ఏమైనా జరిగితే వాటిని ఖండించాలి. సామరస్యం పెంచాలి.అలా కాకుండా రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తే వారికి గుణపాఠం చెప్పాలి.విగ్రహాలను ధ్వంసం చేసే పనులను చేపడితే మాత్రం కఠినంగా వ్యవహరించాలి.ప్రతి ఘటనను లోతుగా పరిశీలన చేయండి, దర్యాప్తు చేయండి. ఎవరు చేస్తున్నారన్నది కూడా డిస్‌ప్లే చేయండి. అలాంటి అన్యాయమైన పనులు చేసే వారికి వదిలి పెట్టొద్దు. ఆ మెసేజ్‌ కూడా ఇవ్వండి. ఈ విషయంలో ఎవ్వరినీ లెక్క చేయొద్దు.